UA-35385725-1 UA-35385725-1

భద్రాచలానికి రైలు…ఏపీని టచ్‌ చేయదు!

భద్రాచలానికి రైలు..ఏపీని టచ్‌ చేయదు!

Bhadrachalm: శ్రీసీతారాములు కొలువైన భద్రాచలం పట్టణానికి ఎట్టకేలకు రైలుమార్గం పడిరది. ఎప్పటి నుంచో భద్రాద్రికి రైల్వే లైను కావాలని డిమాండ్‌ వుంది. ఎట్టకేలకు రైలు రానున్నది. ఈ మేరకు రాములోరి సన్నిధికి రైలు రాకకు మార్గం సుగమమైంది. ఒడిశా నుంచి తెలంగాణలోని భద్రాలచలానికి రైలు మార్గం నిర్మాణం ప్రాజెక్టుపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కీలక సమీక్ష చేశారు. దక్షిణ అయోధ్యగా పేరుపొందిన భద్రాచలానికి రైలు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఒడిశా-తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం కానుంది. ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం వరకు ఈ రైల్వేమార్గం వుంటుంది. రెండు రాష్ట్రాల్లోని మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానిస్తూ ఈ కొత్త లైన్‌ వేయనున్నారు. గిరిజన ప్రాంతాలకు రవాణా వసతిని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం కానున్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. విచిత్రమేమిటంటే, ఈ రైల్వే మార్గం ఏపీని టచ్‌ చేయదు. ఆంధ్రాతో నిమిత్తం లేకుండానే ఒడిశా నుంచి తెలంగాణకు రైలు వెళ్లిపోతుంది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం వరకు మొత్తం 173.416 కిలోమీటర్ల నిడివి ఉండే ఈ లైన్‌ నిర్మాణానికి రూ.2,800 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. నదులు, వాగులు వంకలు ఉన్న నేపథ్యంలో ఈ మార్గంలో ఏకంగా 213 వంతెనలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటిల్లో 48 భారీ వంతెనలు ఉన్నాయి. గోదావరి నదిపై భారీ వంతెన కూడా ఇందులో భాగంగా నిర్మించనున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు గతేడాది సెప్టెంబర్‌లో రైల్వే బోర్డు పచ్చజెండా ఊపింది. ఇటీవలి బడ్జెట్‌లో ఫైనల్‌ లొకేషన్‌ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్‌) కోసం రూ.3 కోట్లు ప్రతిపాదించారు. ఈ మేరకు మొదలైన సర్వే జూన్‌ నాటికి పూర్తి కానుంది. సర్వే నివేదికను పరిశీలించి రైల్వే బోర్డు అనుమతి ఇవ్వగానే పనులు ప్రారంభిస్తారు. ఈ కొత్త లైన్‌ ఒడిశాలోని మల్కన్‌గిరి, బదలి, కోవాసిగూడ, రాజన్‌గూడ, మహారాజ్‌పల్లి, లూనిమన్‌గూడల మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. కన్నాపురం, కుట్టుగుట్ట, పల్లు, నందిగామ, భద్రాచలం వరకు సాగుతుంది. ఇప్పటికే ఉన్న భద్రాచలం-పాండురంగాపురం లైన్‌తో దీనిని అనుసంధానిస్తారు. మొత్తంగా 12 స్టేషన్లను అనుసంధానం చేస్తూ ఈ రైలు మార్గం ఏర్పాటవుతుంది. (Story: భద్రాచలానికి రైలు..ఏపీని టచ్‌ చేయదు!)

See Also: 

మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఆ పార్టీ నేత పనే!

ఆ దర్శకుడి చేతిలో 5 పెద్ద సినిమాలు, స్టార్‌ హీరోలు

బ్రేకప్‌ చెప్పిన హీరోయిన్‌!

ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1