UA-35385725-1 UA-35385725-1

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

టెన్నిస్‌ ఆడితే బాల్‌బాయ్స్‌గా వీఆర్‌ఏలు!
రోజుకు ముగ్గురికి చొప్పున డ్యూటీలు
నిర్మల్‌ జిల్లాలో అధికార దుర్వినియోగం
ఏకంగా జీవోనే జారీ చేసిన వైనం

Nirmal Collector Tennis Game: తెలంగాణలో ఆయన ఓ జిల్లాకు కలెక్టర్‌. ఆయనగారి అరాచకం అంతా ఇంతా కాదు. ఇంతకీ సార్‌ ఏం చేస్తారంటే…టెన్నిస్‌ అంటే ఆయనకు ప్రాణం. కాకపోతే టెన్నిస్‌ బాల్స్‌ను అందించే బాయ్స్‌ లేకపోవడం ఆయనగారికి తలనొప్పిగా మారింది. అందుకే సదరు కలెక్టర్‌ గారు తహసీల్దార్‌ సూచన మేరకు వీఆర్‌ఏలను బాల్‌బాయ్స్‌గా పెట్టుకున్నారు. పైగా వారికి అదొక డ్యూటీగా మార్చేశారు. రోజుకు ముగ్గురిని అదే పనిమీద డ్యూటీ వేయించారు. ఇంతకీ ఇదెక్కడ జరిగిందో తెలుసా? నిర్మల్‌ జిల్లాలోనే. సదరు కలెక్టర్‌గారి పేరు ముషారఫ్‌ ఫారూఖీ. ఆయనొక ఐఏఎస్‌ అధికారి. ఈ సివిల్‌ సర్వీసు అధికారి ప్రజాసేవ చేస్తారో లేదో పక్కనబెట్టండి. ఆయనకు వ్యక్తిగత సేవలు మాత్రం అత్యంత అవసరమని రుజువైంది.ముషారఫ్‌ ఫారుఖీకి టెన్నిస్‌ ఆట అంటే ఇష్టం. రోజూ టెన్నిస్‌ ఆడనిదే ఆయనకు గడవదు. అందుకే స్వయంగా ఓ టెన్నిస్‌ కోర్టు కూడా సిద్ధం చేయించుకున్నారు. రోజూ కొంత మందితో కలిసి ఆడుతూ ఉంటారు. ఆయన కింది అధికారులు అదిచూసి మురిసిపోతూ వుంటారు. అయ్యగారికి టెన్నిస్‌ అంటే ఎంతో ప్రాణం తెలుసా? అని మీడియాకు చెప్పి మరీ చంకలు గుద్దుకుంటారు. కాకపోతే టెన్నిస్‌ ఆడేటప్పుడు బాల్స్‌ అందించే వాళ్లుంటే ఆ ఏకాగ్రతే వేరు. అందుకే ఆ కలెక్టర్‌ గారు వెంటనే తలసీల్దార్‌ను పిలిచి సమస్యకు పరిష్కారం అడిగారు. తహసీల్దార్‌ అత్యుత్సాహం ప్రదర్శించి, మన వీఆర్‌ఏలు పనీపాటా లేకుండా వున్నారని, వారిని బాల్‌ బాయ్స్‌గా వాడుకోవచ్చని ఒక ఉచిత సలహా ఇచ్చి పడేశారు. అంతే…వెంటనే అది అమల్లోకి వచ్చింది. కలెక్టర్‌కు బాల్‌బాయ్స్‌ అందించే నిమిత్తం 21 మంది వీఆర్‌ఏలను లిస్టవుట్‌ చేశారు. వారికి విధులు అప్పగిస్తూ ఒక రోస్టర్‌ను రూపొందించంఆరు. రోజుకు ముగ్గురు చొప్పున కలెక్టర్‌ గారికి బాల్‌బాయ్స్‌గా పనిచేయాలని చెప్పి ఆ 21 మందినీ డ్యూటీలో పెట్టేశారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. భారతదేశంలో ఎక్కడా లేని ‘దొరతనం’ తెలంగాణ నీళ్లు పడేసరికి కలెక్టర్‌గారికి వచ్చేసిందని ఆరోపణలు విన్పిస్తున్నాయి. కింది ఉద్యోగులను స్వంత పనులకు వాడుకోకూడదు. అందుకు చట్టం ఒప్పుకోదు. కానీ ఈ కలెక్టర్‌, తహసీల్దార్‌ చేసిన నిర్వాకం చూసి తెలంగాణ ప్రభుత్వాధినేతలే అవాక్కయ్యారు. మరి చర్యలు వుంటాయో లేదో వేచిచూడాలి. Story: కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!)

See Also: 

ఏపీ జనానికి షాక్‌…భారీగా ఆర్టీసీ వాత!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

దేవుడా! ఇదేం ఖ‌ర్మ‌! తిరుపతిలో నరకయాతన

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

ఆ దిష్టిబొమ్మ సీఎం జగన్‌దేనా?

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1