Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌డీఈవోగా బాధ్యతలు చేపట్టిన ప్రేమ్ కుమార్

డీఈవోగా బాధ్యతలు చేపట్టిన ప్రేమ్ కుమార్

డీఈవోగా బాధ్యతలు చేపట్టిన ప్రేమ్ కుమార్

విజ‌య‌న‌గ‌రం (న్యూస్‌తెలుగు): విజయనగరం జిల్లా విద్యాశాఖ అధికారిగా శుక్రవారం ఎన్‌. ప్రేమ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈయన ఇంతవరకు మన్యం జిల్లా ఎఫ్ఏసిడిఈఓగా మన్యం జిల్లాలో పనిచేసి జిల్లాకు పూర్తిస్థాయి డీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులు, తదితరులు ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పదవ తరగతి పరీక్షల్లో ప్రస్తుతం ఉన్న విధానాన్ని అవలంబిస్తూ ఉత్తమ ఉత్తీర్ణతకు ప్రయత్నం చేస్తామన్నారు. జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తానన్నారు. రానున్న కాలంలో ప్రతి కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలను సందర్శించడం జరుగుతుందన్నారు. అనుమతులు లేని పాఠశాలలపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయులతో కలిసి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. (Story: డీఈవోగా బాధ్యతలు చేపట్టిన ప్రేమ్ కుమార్)

See Also: 

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

రెస్పాన్స్ బ‌ట్టి డెవిల్‌కు సీక్వెల్!

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!