UA-35385725-1 UA-35385725-1

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

హైదరాబాద్‌: ఎప్పటినుంచో తెలంగాణలో తలనొప్పిగా వున్న జీవో నెంబరు 111ను కేసీఆర్‌ ప్రభుత్వం ఎట్టకేలకు ఎత్తివేసింది. ఈ జీవోను ఎత్తివేయడంతో ఇకముందు హైదరాబాద్‌ శివారు భూములు ఒక్కసారిగా బంగారమయం కానున్నాయి. ఈ ఏరియాలో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన పెద్దమనుషుల జేబుల్లోకి మరిన్ని కోట్ల కాసులు రాలనున్నాయి. ఇకముందు ఆ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ కొత్త రికార్డులను సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అక్కడ వందల సంఖ్యలో ఫాంహౌజ్‌లు వెలిసాయి. విల్లాలను నిర్మించారు. భూ క్రయవిక్రయాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ అసెంబ్లీ వేదిక సంచలన ప్రకటన చేశారు. జీవో 111 పరిధిలో 1,32,600ఎకరాల భూమిని గతంలో జంట జలాశయ పరిరక్షణ కోసం ఈ జీవో ఇచ్చినట్లు చెప్పారు. అయితే హైదరాబాద్‌ నగరానికి ఈ జలాశయాలు నీరు ఇఫ్పుడు అవసరం లేదని, ఇంకో వందేళ్ల వరకు హైదరాబాద్‌కు నీటి కొరత ఉండదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో 111 జీవో అవసరం లేదన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌ జీవో 111ను ఎత్తివేసేందుకు ఆమోదముద్ర వేసింది. దీంతో 111జీవో పరిధిలో ఉన్న భూములు బంగారం కానున్నాయి. హైదరాబాద్‌ పట్టణానికి తాగునీరందించే జంట జలాశయాలు ఉస్మాన్‌ సార్‌, హిమాయత్‌ సాగర్‌ ను కాపాడేందుకు అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో పరిధిలో నిర్మాణాలు చేయడంపై నిషేధం. వ్యవసాయ రంగానికి తప్పా ఎలాంటి భూమి కేటాయింపు చేయకూడదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక 111 జీవోను ఎత్తివేస్తామని రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలు ఇచ్చాయి.
రంగారెడ్డి జిల్లాలో 1,32,000ఎకరాల్లో ఈ జీవో విస్తరించి ఉంది. హైదరాబాద్‌ మహానగర శివారులో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌, శంషాబాద్‌ మండలాలు పూర్తిగా వికారాబాద్‌ జిల్లాలోని శంకర్‌ పల్లి, చేవెళ్ల, షాద్‌ నగర్‌, షాబాద్‌ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిపి ఏకంగా 84 గ్రామాలు జీవో 111 పరిధిలోకి వస్తాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు ఈ జీవో 111ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.
సికింద్రాబాద్‌ వైపు కంటోన్మెంట్‌ ప్రాంతం, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో 111 జీవో ఉన్న కారణంగా అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతున్నదని తెలంగాణ మంత్రివర్గం అభిప్రాయ పడిరది. హైదరాబాద్‌ త్రాగునీటి అవసరాలు, గండిపేట, హిమాయత్‌ సాగర్‌ జలాశయాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఆ జలాశయాల క్యాచ్‌మెంట్‌ ఏరియాలో నిర్మాణాలు చేయకూడదని గతంలో 111 జీవో అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం నగర త్రాగునీటి అవసరాలు గండిపేట, హిమాయత్‌ సాగర్‌ పై ఆధారపడి లేవు. కృష్ణా, గోదావరి జలాల ద్వారా నగర ప్రజల త్రాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ఈ నేపథ్యంలో 111 జీవో ఉద్దేశం దెబ్బతిన్నది. ఎంతో కాలంగా 111 జీవో పరిధిలోని ప్రాంతాల ప్రజలు చేస్తున్న విన్నపాన్ని సానుభూతితో అర్థం చేసుకున్న క్యాబినెట్‌ 111 జీవోను రద్దు చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో గండిపేట, హిమాయత్‌ సాగర్‌ జలాశయాల పరిరక్షణ విషయంలోనూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. ఈ రెండు జలాశయాలను కాళేశ్వరం జలాలతో అనుసంధానం చేసే పనులు వేగంగా నడుస్తున్నాయి. ఈ జలాశయాల ద్వారా త్రాగునీటి సరఫరా కోసం ఏర్పడి ఉన్న ప్రస్తుత వ్యవస్థను నగరంలో పచ్చదనం పెంపొందింపజేసే నీటి సరఫరాకు ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రిగారు అధికారులను ఆదేశించారు. మూసీ సుందరీకరణ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈ జలాశయాల ద్వారా నీటిని మూసీలోకి వదలడానికి తగిన పథకం గతంలోనే రూపొందింది. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ విధంగా ఈ రెండు జలాశయాలు ఉపయోగంలోఉంటాయి. మూసీ సుందరీకరణతో నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. నగర పర్యావరణం మెరుగుపడుతుంద. 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రెండు జలాశయాలు కాలుష్యం కాటుకు గురికాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మురుగునీటి పారుదల నిర్మాణాలను వెంటనే చేయాలని, ఇతర పథకాలను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం చీఫ్‌ సెక్రటరీగారి అధ్యక్షతన, పురపాలక శాఖ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ భాగస్వామ్యంతో కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ ద్వారా రెండు జలాశయాల పరిరక్షణ కోసం నియమనిబంధనలను ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేయాలని కేబినేట్‌ నిర్ణయించింది. ఈ రెండు జలాశయాలలోనూ మూసీ, ఈసా నదులలోనూ కాలుష్య జలాలు చేరడానికి వీలు లేకుండా కొత్త జీవోను పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఆమోదం ద్వారా రూపొందించాలని ముఖ్యమంత్రి కమిటీని ఆదేశించారు. (Story: ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!)

See Also:

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!

ఆ దిష్టిబొమ్మ సీఎం జగన్‌దేనా?

బాలినేనికి మంత్రిపదవి దక్కకపోవడానికి కారణాలివేనా?

మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1