UA-35385725-1 UA-35385725-1

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

RRR: ఎస్‌ఎస్‌ రాజమౌళి సృష్టించిన మరో అద్భుత చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ దేశవ్యాప్తంగా విజయవంతంగా నడుస్తున్నది. మూడు వారాలుగా ఆర్‌ఆర్‌ఆర్‌ దాదాపు అన్ని ధియేటర్లను ఆక్రమించుకోవడంతో ఇతర సినిమాలు విడుదల కావడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే కొత్త సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. అయినప్పటికీ, ఆర్‌ఆర్‌ఆర్‌ ఇంకా సగానికిపైగా ధియేటర్లను ఆక్రమించి వుంది. ఈ మూవీ మానియా మాత్రం తగ్గలేదు. కొమురం భీమ్‌గా జూనియర్‌ ఎన్‌టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌లు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిలో సైతం వీరిద్దరి నటనకు జనం ఫిదా అయ్యారు. పైగా బాలీవుడ్‌ ఈ మూవీ కొట్టిన దెబ్బకు ఇంకా తేరుకోలేదు. కొన్ని హిందీ రాష్ట్రాల్లో ధియేటర్లు ఖాళీ లేక సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు. ఖాన్‌త్రయంతోపాటు బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్లకు మైండ్‌ బ్లాంక్‌ అయింది. హిందీ డైరెక్టర్లు కూడా రాజమౌళికి సలామ్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా 1000 కోట్ల రూపాయల కలెక్షన్‌ను దాటేసింది. ఆ ఘనత సాధించిన మూడవ భారతీయ చిత్రంగా రికార్డు పుటల్లోకి ఎక్కింది.
అయితే, దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గురించి గానీ, నటుల గురించి గానీ కామెంట్లు, ప్రశంసలు ఎలా వున్నా…తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రామ్‌చరణ్‌, ఎన్‌టీఆర్‌ అభిమానుల మధ్య ఈ సినిమాలో ఎవరు గొప్ప అనే విషయంపై ఇంకా చర్చ జరుగుతూనే వుంది. ఒక విధంగా వాదోపవాదాలు జరుగుతూనే వున్నాయి. నిజానికి ఇరువురూ నటనలో ఇరగదీశారు. కాకపోతే, రామ్‌చరణ్‌కు పాత్ర ఎక్కువగా వుందని, ప్రాధాన్యత ఇచ్చారని, ఎన్‌టీఆర్‌కు తక్కువగా ఇచ్చారని వాదనలు జరుగుతున్నాయి. నిజానికి ఇరువురికీ రాజమౌళి సరిపాళ్లలోనే పాత్రలు రాసుకొచ్చారు. కాకపోతే, క్లైమాక్స్‌లో రామ్‌చరణ్‌ నిడివి కాస్త ఎక్కువగా వుండటంతో ధియేటర్‌ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఎన్‌టీఆర్‌ అభిమానులు కాస్త కినుకవహిస్తున్నారు. అయితే నిజాయితీగా చెప్పాలంటే, రామ్‌చరణ్‌ కన్నా ఎన్‌టీఆర్‌ కాస్త బాగా నటించడానికి స్కోప్‌ వుంది. నటించాడు కూడా. మార్కులైతే ఎక్కువగా ఎన్‌టీఆర్‌కే పడ్డాయి. అయినప్పటికీ పాత్ర నిడివి విషయంలో రామ్‌చరణ్‌కు ఎక్కువున్నట్లు అన్పిస్తున్నది. ఏదేమైనప్పటికీ, దీనిమీద క్లారిటీ ఇవ్వగల వ్యక్తి ఒకేఒక్కరు. ఆయనే సినిమా దర్శకులు ఎస్‌ఎస్‌ రాజమౌళి.
ఈమధ్య ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రొమోషన్‌ కార్యక్రమాలు, సక్సెస్‌మీట్‌లలో ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ఫుల్‌ బిజీగా వుంది. ఈ బృందం దేశమంతా తిరుగుతూ వుంది. ఎక్కడికెళ్లినా రాజమౌళికి గానీ, రామ్‌చరణ్‌కు గానీ, ఎన్‌టీఆర్‌కు గానీ పాత్రల ఆధిపత్య పోరుపై మీడియా ప్రశ్నలు సంధిస్తూనే వుంది. వారు ఏదోఒక సమాధానం చెపుతూనే వున్నారు. తాజాగా ఎస్‌ఎస్‌ రాజమౌళి రామ్‌చరణ్‌, ఎన్‌టీఆర్‌ పాత్రల్లో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత వుందన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఈ అంశంపై రాజమౌళి స్పందించారు. అదేమిటంటే…
‘‘ఇందులో ఎవరి డామినేషన్‌ లేదు.. తారక్‌, చరణ్‌లు ఇద్దరూ తమ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌తో అలరించారు. చరణ్‌ డామినేషన్‌ ఎక్కువగా ఉందన్నమాట సరైనది కాదు. మన దృష్టికోణం బట్టి అది ఆధారపడి వుంటుంది. క్లైమాక్స్‌లో రామ్‌ చరణ్‌కు ఎక్కువ స్క్రీన్‌ స్పేస్‌ ఉండడం వల్ల.. అది చూసి బయటికి వచ్చే ప్రేక్షకులకు చరణ్‌ డామినేషన్‌ ఉందనిపించవచ్చు. అదే కొమురం భీముడో పాట దగ్గరే క్లైమాక్స్‌ ఉండుంటే అప్పుడు ఎన్‌టీఆర్‌ డామినేషన్‌ పూర్తిగా ఉన్నట్టు అనిపించేది. అలాగే ఈ సినిమాలో తారక్‌… చరణ్‌ను రెండుసార్లు రక్షించాడు. చరణ్‌ మాత్రం తారక్‌ను ఒక్కసారి మాత్రమే సేవ్‌ చేశాడు. అంతేకాదు ఓ చోట చరణ్‌ ‘15 సంవత్సరాలుగా స్పష్టత లేని నా గోల్‌కు భీమ్‌ (తారక్‌) దారి చూపించాడు. ఆయుధం ఒక్కటే ధైర్యం అనుకున్న నాకు అతడు ఎమోషన్‌ కూడా ఓ ఆయుధంగా చూపించాడు’ అంటూ చరణ్‌, తారక్‌ను ప్రశంసిస్తాడు.. అంటే ఇక్కడ తారక్‌ హీరో.. చరణ్‌ అతని ఫాలోవర్‌ అనుకోవచ్చు కదా. ఈ విధంగా చూస్తే మీకు తారక్‌ డామినేషన్‌ ఎక్కువగా కనిపిస్తుంది’’ అంటూ రాజమౌళి అంటూ జక్కన తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. రాజమౌళి చెప్పింది అక్షరాల నిజం. ఇద్దరూ బాగానే చేశారు. పైగా సినిమా సగం పూర్తయ్యేవరకు రామ్‌చరణ్‌ పాత్రలో నెగిటివ్‌ షేడ్స్‌ వుంటాయి. ఆఖరిలో మాత్రమే అతనిలోని హీరోయిజం బయటకు వస్తుంది. కానీ ఎన్‌టీఆర్‌ సినిమా ఆరంభం నుంచీ హీరోనే. పాత్రపరంగా చరణ్‌ ఎక్కువ నిడివి వుండవచ్చు. కానీ హీరోగా మాత్రం ఎన్‌టీఆర్‌కే నిడివి ఎక్కువ. మూవీ ఆరంభంలో చరణ్‌ బ్రిటిష్‌వారి తరపున నిలబడి, డ్యూటీలో భాగంగా స్వతంత్ర పోరాటయోధులను, భారతీయులను లాఠీతో కొడుతుంటే…మూవీ చూసే ప్రేక్షకుల్లో చరణ్‌ హీరోయిజం కనబడదు. అతని విలనిజమే కన్పిస్తుంది. కాకపోతే నటన అద్భుతంగా వుంటుంది. ఏదేమైనప్పటికీ, ఈ మూవీ ఎన్‌టీఆర్‌, రామ్‌చరణ్‌కు ఒక గొప్ప వరం లాంటిది. అలాగే వారి అభిమానులకు కూడా! (Story: ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి)

See Also: 

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

దేవుడా! ఇదేం ఖ‌ర్మ‌! తిరుపతిలో నరకయాతన

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!

ఆ దిష్టిబొమ్మ సీఎం జగన్‌దేనా?

బాలినేనికి మంత్రిపదవి దక్కకపోవడానికి కారణాలివేనా?

మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1