వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
బిసిలంటే….. బలిపశువులా…..?
తెలుగుదేశం పయనమెటు …..?
శ్రీనివాస్-చాట్రాయి (ఏలూరు జిల్లా)
75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 40ఏళ్ళ చరిత్ర కలిగిన తెలుగు దేశం పార్టీలో నూజివీడు నియోజకవర్గంలో బలహీనవర్గాల సామాజిక తరగతుల ప్రజానీకం లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హత కలిగిన ఒక్క మనిషి కూడా లేరా…? వలస పక్షులు అయితేనే విజయం సాధిస్తాయా అనేది చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నూజివీడు శాసనసభ స్థానం అభ్యర్థి నిర్ణయం పై వ్యవహరిస్తున్న తీరు అనేక ప్రశ్నలను లేవనెత్తింది. వైఎస్సార్ పార్టీ పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలుగు దేశం పార్టీ నూజివీడు నియోజకవర్గ అభ్యర్థిగా తనను నియమించారని ఆగిరిపల్లి మండలంలో ని అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పలు గ్రామాల్లో పర్యటిస్తూ పరిచయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ. తనను చంద్రబాబు గారు నూజివీడు వెళ్ళమంటేనే వచ్చానని ఇంకా అనేక విషయాలు పరిచయ కార్యక్రమాల్లో చెప్పడం ప్రారంభించారు. దీనిపై కోపోద్రిక్తులైన ఆగిరిపల్లి మండలంలోని ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియాలో వీడియోలను ట్రోల్ చేయడం టిడిపి విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఇప్పటివరకు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఆయన వ్యతిరేకులకు మధ్య ముఠాలు నడవగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో బిసి సామాజిక తరగతి కి చెందిన యాదవ సామాజిక తరగతి నేతల మధ్యలో పెద్ద వివాదంగా మారింది. నియోజకవర్గంలో అత్యధిక మంది యాదవులకు నిలయమైన ఆగిరిపల్లి మండలంలోని తెలుగుదేశం పార్టీ యాదవ సామాజిక తరగతికి చెందిన అగ్ర స్థాయి నాయకత్వం ముక్తకంఠంతో ముద్దరబోయిన పై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నిర్మాణాత్మకంగా పటిష్టమైన తెలుగుదేశం పార్టీ విలువలకు తిలోదకాలు ఇస్తుందని ధ్వజమెత్తారు. నియోజకవర్గం మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఆరు నెలలకు ఒకళ్ళు మూడు నెలలకు ఒకళ్ళు వచ్చి … మమ్మల్ని చూసుకోమన్నారు బాబు గారు వెళ్ళమన్నారు అంటూ పరిచయ కార్యక్రమాలు తిరగడం పరిచయకార్యక్రమాలు పరిపాటిగా మారిపోయిందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. ఓసి సామాజిక తరగతి కి చెందిన నూజివీడు ఎఎంసి మాజీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు ఒక జీవనదిలా పార్టీలో పదవులు ఉన్నా లేకపోయినా ఆర్థికంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తూ పార్టీ కోసం పనిచేసినా పార్టీలో కనీసమైన పదవిలేని పరిస్థితి ,పంచాయతీ సర్పంచ్ గా రావిచర్ల గ్రామస్తులు ఇచ్చిన పదవి , షుమారు ఒక సంవత్సరంన్నర క్రితం ముసునూరు మండలం గోగులంపాడు గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పర్వతనేని గంగాధర్ టిడిపిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం ఉత్సాహంతో సుమారు 8 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఆయన కూడా అధిష్టానం వెళ్ళమంటే వనే వచ్చానని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అట్లూరి రమేష్ గత కొన్ని సంవత్సరాల నుండి సందర్భానుసారం తెలుగుదేశం పార్టీ కోసం కోట్లాది రూపాయల ఖర్చు పెడుతూనే ఉన్నారు. ఇటీవల చంద్రబాబు సభకు సైతం పర్వతనేని గంగాధర్ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి అన్నదానాలు ఏర్పాటు చేశారు.అదే సభలో చంద్రబాబు మాట్లాడుతున్న వేదిక పైనుండి గంగాధర్ ను దింపేశారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ను మాత్రమే పక్కన వుంచుకుని ప్రసంగించారు. మాటలలో మన కాబోయే ఎమ్మెల్యే ముద్దరబోయిన అన్నారు.ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఒంటెత్తిపోకడలతో మా పదవులు పీకేసారని చెప్పుకోవడానికి కార్యాలయానికి వెళ్ళిన సీనియర్ నాయకుల పై చంద్రబాబు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వెళ్లిన వారితో కనీసం ఫోటో కూడా దిగిన పరిస్థితి ఆనాడు. ఈనాడుకు వచ్చేసరికి అదే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు చంద్రబాబుని కలవడానికి ఎంతో కష్టపడి తే ప్రయత్నిస్తే గురువారం సాయంత్రం కలిసినట్లు సమాచారం. అభ్యర్థిని మార్చేటప్పుడు కనీసం మాట వరసకైనా చెప్పలేదనేది ముద్దరబోయిన బహిరంగగానే మాట్లాడిన మాట అది. బలహీనవర్గాల వారితో చెలగాటమాడుతున్నారని బలి పశువులను చేస్తున్నారని పలువురు అంటున్నారు. నియోజకవర్గంలో 2లక్షల ముప్పై వేల మంది పైగా ఓటర్లు ఉండగా ఎస్సీ, ఎస్టీ,బి సి సామాజిక తరగతులకు చెందిన వారు లక్ష యాభై వేల మంది పైగా ఉన్నట్లు తెలుస్తోంది.40 ఏళ్ల తెలుగుదేశం పార్టీలో ఇక్కడ పుట్టి పెరిగిన వారిని ఒక్కరిని కూడా ఎమ్మెల్యే స్థాయికి అభివృద్ధి చేయలేదని అధిష్టాన నిర్ణయమే అర్థం పడుతుందని పలువురు అంటున్నారు. నూజివీడు నియోజకవర్గ స్థానాన్ని సంతలో పశు మాదిరిగా అమ్ముతున్నారా …..? నామినేషన్ వేసేసరికి అభ్యర్థి ఎవరు అవుతారో అని … పలువురు చర్చించుకోవడం గమనార్హం.అభ్యర్దిని మారిస్తే సమన్వయం సాధ్యమవుతుందనుకుంటే అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు ఆదిలోనే హంసపాదు పడినట్లు అయిందని పలువురు అంటున్నారు. (Story: వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?)
See Also:
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2