UA-35385725-1 UA-35385725-1

ఆ దర్శకుడి చేతిలో 5 పెద్ద సినిమాలు, స్టార్‌ హీరోలు

ఆ దర్శకుడి చేతిలో 5 పెద్ద సినిమాలు, స్టార్‌ హీరోలు

Tollywood News: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొంతమంది దర్శకులు చేతిలో మస్తు సినిమాలతో యమ బిజీగా వున్నారు. ఎస్‌ఎస్‌ రాజమౌళి చేతిలో ఎప్పుడైనా ఒక సినిమానే వుంటుంది. నాలుగైదేళ్లు ఆ ఒక్కటే ఉండవచ్చు. అది పూర్తయ్యాక ఇంకొకటి వస్తుంది. అంతేతప్ప మూడు. నాలుగు కథలతో ఆయన సినిమాలను సిద్ధం చేసుకోవడమనేది జరగదు. కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కూడా ఒకటి రెండు ఒప్పందాలకు పరిమితమవుతాడు. హిట్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. ఇప్పుడాయన ఐదారు సినిమాలతో, హీరోల తాత్కాలిక కాల్షీట్‌ ఏర్పాట్లతో సిద్ధంగా వున్నాడు. కొరటాల శివ మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఆచార్య మూవీని పూర్తిచేశాడు. ఈ సినిమా ఏప్రిల్‌ నెల 29నే విడుదల అవుతోంది. ఆ తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా ఓ సినిమాను మొదలుపెట్టనున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సెట్‌ వర్క్‌ జరుగుతోంది. ఎన్టీఆర్‌కు ఇది 30వ సినిమా. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో జనతా గ్యారేజీ వచ్చింది. అది పెద్ద హిట్టయింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌`30 మూవీ కోసం భారీ సెట్స్‌ నిర్మిస్తుండగా, ఇందులోనే జూన్‌ నుంచి షూటింగ్‌ షెడ్యూల్‌ వుంది. మే 28న ఈ సినిమాలో నటించే తారాగణంతోపాటు సాంకేతిక సిబ్బందిని ప్రకటిస్తారు. ఈ రెండు చిత్రాలు కాకుండా, కొరటాల ఎన్టీఆర్‌ తర్వాత సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుతో ఓ సినిమాను, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌లతో తలో ఒక సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, ఈ ముగ్గురిలో ఎవరి సినిమా ముందుగా మొదలవుతుందో ఆయన చెప్పలేదు. కాకపోతే మహేశ్‌బాబుతో రాజమౌళి సినిమా వుంది కాబట్టి, అది కనీసం రెండేళ్లయినా పడుతుంది. ఆ తర్వాతనే మహేశ్‌తో కొరటాల మూవీ వుండవచ్చు. ఈ లోగా కొరటాల రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లలో ఒకరిని సెట్స్‌పైకి లాక్కొనిపోవచ్చు. ఈ విధంగా ముగ్గురు స్టార్స్‌ను లైన్‌లో పెట్టిన కొరటాల శివ ఇంకో యువ హీరోతోనూ ఓ సినిమా చేయడానికి సిద్ధంగా వున్నారట! దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధంగా వుందని తెలిసింది. అయితే అదింకా బయటకు పొక్కలేదు. ఆ యంగ్‌ హీరో అఖిల్‌ అక్కినేని కావచ్చని అంటున్నారు. (Story: ఆ దర్శకుడి చేతిలో 5 పెద్ద సినిమాలు, స్టార్‌ హీరోలు)

See Also: 

బ్రేకప్‌ చెప్పిన హీరోయిన్‌!

ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1