UA-35385725-1 UA-35385725-1

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఏమండీ…ఓసారి వస్తారా! ఒంటరిగా…(కాబోయే భర్తతో కాబోయే భార్య)
కచ్చితంగా…ఎక్కడికి రమ్మంటావ్‌! (కాబోయే భార్యకు కాబోయే భర్త సమాధానం)
కాసేపు ఇద్దరం షికారు చేద్దాం (ఆయనకు ఆమె ఇచ్చిన ఆఫర్‌)
అవునా…సరే! బండెక్కు (కాబోయే భర్త ఒప్పుకోలు)
(ఇద్దరూ బైక్‌పై కొంచేపు షికార్లు చేశారు. కొండెక్కి ఓ చోట ఆరామ్‌సే కూర్చున్నారు..అలసటతో)
మీరు కళ్లు మూసుకుంటే ఒక గొప్ప సర్‌ప్రైజ్‌ ఇస్తా (కాబోయే భర్తకు కాబోయే భార్య బంపర్‌ ఆఫర్‌)
ఓకే…డెఫినిట్‌గా…(ఆనందంతో, ప్రేమతో కళ్లుమూసుకున్నాడు కాబోయే భర్త)
(కాబోయే భార్యామణి ఏం చేసిందంటే…అతని కళ్లకు చున్నీ చుట్టి, దాన్ని నెమ్మదిగా అతని మెడకు కూడా చుట్టి… చేతిలోంచి పదునైన కత్తిని తీసింది…అంతే…కట్‌ చేస్తే…ఆ కుర్రాడి మైండ్‌బ్లోయింగ్‌! గొంతు కోసేసింది! ప్రాణం పోతున్నా.. అతను ఆమెను పట్టుకొని, వదల్లేదు. కిలేడీ దొరికిపోయింది. డేరింగ్‌తో అతనే స్వయంగా హాస్పిటల్‌కి చేరాడు… ఇంకోసారి కట్‌చేస్తే… ఇప్పుడతను ఆసుపత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. గొంతునుంచి కారే రక్తంతో మాటపెగల్లేక…మూగబాస చేస్తున్నాడు…ఏం జరిగిందో చెపుదామన్నా చెప్పలేక ప్రాణం కాపాడమని కోరాడు…పరిస్థితి విషమంగానే వుంది…ఆ అమ్మాయి కటకటాల వెనుక చువ్వలు లెక్కపెట్టడానికి సిద్ధమవుతోంది…ఇదీ కథ. పెళ్లిని చెడగొట్టడానికి ఆడిన ప్రేమకథ!)

Attempt to Murder: రెండు రోజుల్లో వివాహం చేసుకోబోయే ఓ యువకుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఏకంగా అతన్ని చంపేసేందుకు ప్రయత్నించింది ఓ కిలేడీ (యువతి). సోమవారం అనకాపల్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మాడుగుల మండలం ఎం.కోటపాడు గ్రామానికి చెందిన అద్దెపల్లి రామునాయుడుకు, రావికమతానికి చెందిన వి.పుష్పకు ఈ నెల 4న వివాహ నిశ్చితార్థం జరిగింది. మే నెలలో వివాహం జరిపించేందుకు పెద్దలు ముహూర్తాన్ని నిశ్చయించారు. సోమవారం రామునాయుడుకు పుష్ప ఫోన్‌ చేసి, ఇంటికి రావాలని కోరింది. ఇద్దరూ కలిసి బైక్‌పై బుచ్చెయ్యపేట మండలం అమరిపురి బాబా ఆశ్రమం వద్దకు వెళ్లారు. కాసేపు మాట్లాడుకున్నాక తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో బైక్‌ ఆపాల్సిందిగా పుష్ప కోరింది. కళ్లు మూసుకుంటే సర్‌ప్రైజ్‌ ఇస్తానని చెప్పింది. రామునాయుడు కళ్లు మూసుకోగా… చున్నీని అతడి మెడకు చుట్టి, వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసింది. రామునాయుడు కుటుంబ సభ్యులకు స్వయంగా ఆమే ఫోన్‌ చేసి, ప్రమాదం జరిగిందని, అతను గాయపడ్డాడని చెప్పింది. అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. రామునాయుడు ఆమె చేయి పట్టుకుని ఆపి బైక్‌ ఎక్కించాడు. మెడకు కర్చీఫ్‌ చుట్టుకుని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి అసలు విషయం చెప్పాడు. అనంతరం బైక్‌లో రావికమతం పీహెచ్‌సీకి వెళ్లాడు. రామునాయుడు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. వైద్యుల సూచన మేరకు అనకాపల్లి ఎన్టీఆర్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని విశాఖ కేజీహెచ్‌కి తరలించాలని వైద్యులు సూచించారు. అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించి, చికిత్స చేయిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. రామునాయుడు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. నిందితురాలిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. ఏదేమైనప్పటికీ, సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లు ఎవరిచ్చినా…కాస్త జాగ్రత్త గురూ! (Story: యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!)

See Also: 

లేజర్‌ కిరణాలతో విమానాల విధ్వంసం!

నలుగురు పిల్లల్ని కనాల్సిందే!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1