UA-35385725-1 UA-35385725-1

మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఆ పార్టీ నేత పనే!

మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఆ పార్టీ నేత పనే!

Rape: ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో గ్యాంగ్‌రేప్‌లు, రేప్‌లు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక రూపంలో పార్టీల నేతల పాత్ర కూడా వుంటోంది. లేదా వారి అనుచరుల ఆగడాల్లో భాగంగా ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌ జిల్లాలో మైనర్‌ బాలిక అత్యాచారం సంచలనం రేపిన విషయం తెల్సిందే ఈ మైనర్‌ బాలిక అత్యాచారానికి పాల్పడిరది టీఆర్‌ఎస్‌ స్థానిక నాయకుడు బన్నయ్య అని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. బన్నయ్య మెదక్‌ జిల్లాకు చెందిన ఒక ఎమ్యెల్యేకు కుడిభుజం లాంటివాడు. పోలీసులు బన్నయ్య ఒక మైనర్‌బాలికపై అత్యాచారం చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు బనన్నయ్య ఇంటికి వెళ్లి పరిశీలించగా బాలిక ఇంట్లోనే ఉండటంతో ఆమెను పోలీసులకు అప్పగించారు. బన్నయ్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా అల్లాదుర్గం సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ జార్జ్‌ తెలిపారు. బాలికపై బన్నయ్య అత్యాచారానికి పాల్పడ్డట్లుగా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మెదక్‌ జిల్లా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. స్థానిక ఎమ్మెల్యే పక్కనే తిరిగే వ్యక్తి ఓ మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
సదరు మైనర్‌బాలికపై బన్నయ్య ఎప్పటి నుంచో అత్యాచారానికి పాల్పడుతున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం టేక్మల్‌ మండలం పాల్వంచ గ్రామానికి చెందిన ఈ మైనర్‌ బాలికపై బన్నయ్య అత్యాచారం చేసినట్లు తెలిసింది. ఆ మైనర్‌ బాలికను తన ఇంటి నుంచి లాక్కుపోయిన బన్నయ్య పది రోజుల తర్వాత తిరిగి తీసుకొచ్చి ఇంట్లో వదిలివెళ్లాడు. గ్రామంలో ఎమ్మెల్యే పేరు చెప్పుకొని పెద్ద మనిషిలా చలామణి అవుతున్న బన్నయ్య తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బాలిక తల్లిదండ్రులు పంచాయితీ పెట్టారు. గ్రామ పెద్దల సమక్షంలో తాను తప్పు చేశానని, మరోసారి మైనర్‌ బాలిక కుటుంబం జోలికి వెళ్లనని మాటిచ్చాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే బన్నయ్య విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంటే ఆసుపత్రికి తరలించారు. ప్రాణపాయం నుంచి తప్పించుకున్న అతను బాధితురాలి కుటుంబ సభ్యుల్ని బెదిరించాడు. ఆ అమ్మాయి కోసమే తాను పురుగుల మందు తాగానంటూ బిల్డప్‌ ఇచ్చి బలవంతంగా మరోసారి ఆ మైనర్‌ని ఎత్తుకెళ్లాడు. మైనర్‌ బాలికను అధికార పార్టీకి చెందిన నాయకుడు ఇలా పదే పదే ఇంటి నుంచి తీసుకెళ్లడంతో విసిగిపోయిన బాధితురాలి తండ్రి మూడ్రోజుల క్రితం టేక్మల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బన్నయ్య ఇంటికి వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా అతన్ని పట్టుకొని, ఆ మైనర్‌ బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు విచారణ జరుగుతోంది. (Story: మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఆ పార్టీ నేత పనే!)

See Also: 

ఆ దర్శకుడి చేతిలో 5 పెద్ద సినిమాలు, స్టార్‌ హీరోలు

బ్రేకప్‌ చెప్పిన హీరోయిన్‌!

ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1