కార్గిల్ విజయ్ దివస్ హీరోలకు గౌరవవందనం
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు నివాళులర్పించేందుకు సికింద్రాబాద్‌లోని 1(టి) ఆర్మర్డ్ స్క్వాడ్రన్ ఎన్‌సిసికి అనుబంధంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ డిగ్రీ కళాశాలలో సమావేశమయ్యాయి. కార్గిల్ విజయ్ దివస్ సంస్మరణ దినోత్సవ సందర్భంగా సికింద్రాబాద్‌లోని 1(టి) ఆర్మర్డ్ స్క్వాడ్రన్ ఎన్‌సిసి కమాండిరగ్ అధికారి కల్నల్ వైభవ్ గుప్తా ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. 1999 కార్గిల్ యుద్ధంలో మన సైనికుల పరాక్రమం, త్యాగం, అచంచలమైన స్ఫూర్తిని నొక్కిచెప్పిన ఆయన మాటలు కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల నడుమ ప్రతిధ్వనించాయి. కార్గిల్ విజయ్ దివస్ నేపథ్యంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమం దేశభక్తి, శౌర్యాన్ని ప్రదర్శించింది. (Story : కార్గిల్ విజయ్ దివస్ హీరోలకు గౌరవవందనం)