UA-35385725-1 UA-35385725-1

మహేష్ బాబు సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి

మహేష్ బాబు సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి

‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబు గారి సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి:  సర్కారు వారి పాట స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంటర్వ్యూ 

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది సర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్. తాజాగా విడుదలైన ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఆల్ టైం రికార్డ్ ని సృష్టించింది. సర్కారు వారి పాట ట్రైలర్ 24గంటల్లో 27 మిలియన్స్ వ్యూస్ ని క్రాస్ చేసి టాలీవుడ్ ఫాస్టెస్ట్ వన్ డే రికార్డ్ నెలకొల్పింది. అలాగే 1.2 మిలియన్స్ కు పైగా లైక్స్ సొంతం చేసుకొని రికార్డ్ వేగంతో దూసుకుపోతుంది.ఇక మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతంలో ‘సర్కారు వారి పాట’ ఆడియో ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచింది. కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్.. ప్రేక్షకులని అమితంగా అలరించాయి. ముఖ్యంగా కళావతి పాట 150మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ ని సృష్టించింది. ఈ పాట లో మహేష్ బాబు వేసిన సిగ్నేచర్ స్టెప్స్ కు సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయి రీల్స్ సందడి చేశాయి. మే 12న ప్రపంచవ్యాప్తంగా సర్కారు వారి పాట గ్రాండ్‌ గా విడుదల కాబోతున్న నేపధ్యంలో సినిమా కోసం గ్రేట్ సిగ్నేచర్ మూమెంట్స్ ని కంపోజ్ చేసిన స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మీడియాతో ముచ్చటించారు. కళావతి, పెన్నీ పాటలతో పాటు సర్కారువారి పాట నుంచి రాబోయే మాస్ సాంగ్ విశేషాలు ఇలా పంచుకున్నారు…

ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు ? బుల్లితెర, వెండితెరని అలరిస్తున్నారు. మీ సీక్రెట్ ఏమిటి ?సీక్రెట్ ఏం లేదండీ. ఇచ్చిన పని చక్కగా చేయడమే. నా దృష్టి వెండితెరపైనే వుంది. ఐతే నెలకు రెండు రోజులు టీవీ షూటింగ్ కి సమయం కేటాయించా.

సర్కారు వారి పాటలో ఎన్ని పాటలు చేశారు ?మూడు. కళావతి, పెన్నీ, ఇంకో మాస్ సాంగ్. కళావతి, పెన్నీ ఇప్పటికే విజయాలు సాధించాయి. రాబోతున్న పాట కూడా ఫ్యాన్స్ కు గొప్ప ట్రీట్. ఇందులో మహేష్ బాబు గారి స్వాగ్ అండ్ మాస్ రెండూ చూస్తారు. ఆయన సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి.

ఈ సినిమాలో మహేష్ బాబుగారి డ్యాన్సులు ఎలా వుంటాయి ?వండర్ ఫుల్ గా వుంటాయి. ఫ్యాన్స్ కు బాగా నచ్చుతాయి. డ్యాన్స్ ఎంతబాగా చేశారో చూసిన తర్వాత మీరే చెప్తారు.

ఇప్పుడు పాటలన్నీ  ఇన్స్టంట్ హిట్స్ అవుతున్నాయి కదా ? ఇలాంటి పాటలు ఇవ్వడం ఎంత చాలెజింగా వుంటుంది?ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక పాటలో అందరూ చేయగలిగే రెండు యునిక్ స్టెప్స్ వుంటే అది సోషల్ మీడియా రీల్స్ లోకి వెళ్లి హిట్స్ అవుతున్నాయి. అలాంటి యునిక్ స్టెప్స్ పై ద్రుష్టి పెట్టాల్సి వుంటుంది. కళావతి పెన్నీ సాంగ్స్ పై చాలా మంది రీల్స్ చేశారు. ఇప్పుడు రాబోతున్న మాస్ సాంగ్ కూడా అదిరిపోతుంది. అందులో కూడా యునీక్ స్టెప్స్ వుంటాయి.

ఒక పెద్ద హీరో సినిమా చేస్తున్నపుడు ఒత్తిడి వుంటుందా ?ఒత్తిడి వుండదు. ఒక సాంగ్ కి మించిన సాంగ్ ఇవ్వాలనే పట్టుదల వుంటుంది, దాని కోసమే కష్టపడి పని చేస్తాం. సరిలేరు నికెవ్వరులో మైండ్ బ్లాక్ పాట సూపర్ హిట్. దానికంటే గొప్ప పాట ఇవ్వడానికి ప్రయత్నించాం.పాట అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది.

మహేష్ గారితో మీ కాంబినేషన్ ?మహేష్ బాబు గారితో సరిలేరు నికెవ్వరులో డ్యాంగ్ డ్యాంగ్, మైండ్ బ్లాక్, సర్కారు వారి పాటలో మూడు సాంగ్స్.

మహేష్ గారు త్వరగా నేర్చుకుంటారా ?అవును చాలా త్వరగా నేర్చుకుంటారు. మహేష్ బాబుగారిలో అద్భుతమైన రిధమ్ వుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ అర్ధం చేసుకుంటే చాలు.

హీరో బాడీ లాంగ్వెజ్ ని బట్టి మూమెంట్స్ కంపోజ్ చేస్తారా ?మొదట ట్యూన్ ఇంపార్ట్టెంట్. సాంగ్  ఎలాంటి మూమెంట్స్ కోరుకుంటుందో చూస్తాం. తర్వాత యాక్టర్ బాడీ లాంగ్వేజ్ చూస్తాం. మన స్టయిల్ కి హీరో బాడీ లాంగ్వెజ్ కి సరిపడా మూమెంట్స్ కంపోజ్ చేస్తాం.

కళావతి పాటని అందరూ రీల్స్ చేశారు. మహేష్, సితార ల్లో ఎవరు బాగా చేశారు ? ఒక కోరియోగ్రఫర్ గా చెప్పండి?

మహేష్-సితార ఇద్దరూ బాగా చేశారు. సితార పాపలో గొప్ప గ్రేస్ వుంది. ఐతే పెన్నీ ప్రమోషనల్ సాంగ్ కొరియోగ్రఫీలో నేను లేను. మా అసిస్టెంట్స్ చేశారు. సినిమాలో వచ్చే పాటలో సితార పాప కనిపించదు.

కాపీ స్టెప్పులు అని విమర్శలు వస్తుంటాయి కదా ? దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ?మనం ఒరిజినల్ గా చేస్తే మనది మనకే తెలిసిపోతుంది. మూమెంట్ కంపోజ్ చేస్తున్నపుడే కొత్తగా వుందా లేదా ? అనేది అర్ధమైపోతుంది.

డ్యాన్స్ కాకుండా సాంగ్ లో కోరియోగ్రఫర్ ఇన్పుట్స్ ఎలా వుంటాయి ? ప్రాపర్టీస్ ని కూడా సజస్ట్ చేస్తారా ?కోరియోగ్రఫి అంటే డ్యాన్స్ మాత్రం కాదు.. సాంగ్ ని అందంగా ప్రజంట్ చేయాల్సిన బాధ్యత వుంటుంది. మూమెంట్స్ తో పాటు పాటలో కనిపించే ప్రాపర్టీ, కాస్ట్యూమ్స్ కూడా కొన్నిసార్లు చెబుతాం. దర్శకులు కూడా సూచనలు చేస్తారు. కళావతి పాటని ఫారిన్ లో షూట్ చేశాం. బ్యాగ్ గ్రౌండ్ లో సితారలు వుంటే బావుంటుంది అనిపించింది. దర్శకుడు పరశురాం గారికి చెప్పా. ఆయన ఓకే అన్నారు. అప్పటికప్పుడు వేరే చోట నుంచి తెప్పించి షూట్ చేశాం. సాంగ్ లో బ్యుటిఫుల్ గా కనిపించాయి.

ఒక పాట విజయంలో కొరియోగ్రఫీ పాత్ర ఎంత ?పాట విజయంలో కొరియోగ్రఫీది కీలకమైన పాత్ర వుంది. ఐతే ముందు సంగీత దర్శకుడి నుంచి ట్యూన్ రావాలి. దానికి అందంగా కొరియోగ్రఫీ కుదిరితే పాట సక్సెస్ అవుతుంది.

మహేష్ గారితో పని చేయడం ఎలా అనిపిస్తుంది ? మహేష్ గారికి ఒక డ్యాన్స్ మాస్టర్ గా ఎన్ని మార్కులు వేస్తారు?

మహేష్ బాబు గారితో పనిచేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. మనం ఓకే అన్నా .. ”మాస్టర్ ఇంకోసారి చేద్దామా’ అంటారు. ఈ సినిమాలో ఆయన మరింత అందంగా కనిపిస్తారు. డ్యాన్స్ విషయానికి వస్తే సర్కారు వారి పాటలో సరికొత్త మహేష్ బాబు గారిని చూస్తారు. మహేష్ గారి డ్యాన్సులకి వంద మార్కులు వేస్తా.

మీ పిల్లల్ని కూడా ఈ రంగంలో ప్రోత్సహిస్తున్నారా ?ఈ మధ్య డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. కానీ పాప ప్యాషన్ డిజైన్ అవుతానని అంటుంది. బాబు డాక్టర్ అంటున్నాడు. ఏం కావాలో ఛాయిస్ వాళ్ళకే ఇచ్చేశా.

పాన్ ఇండియా సినిమాలు ఎక్కువయ్యాయి కదా ? ఇది కొరియోగ్రఫీలో కూడా వుంటుందా ?కొరియోగ్రఫీకి అలా ఏం వుండదు. ఇప్పుడు పాన్ ఇండియా అని అంటున్నారు కానీ ‘టాపు లేచిపోద్ది’ పాటని ప్రపంచ వేదికలపై ప్రదర్శించారు. ‘పుష్ప’ మూమెంట్స్  కూడా పాన్ వరల్డ్ లో సందడి చేశాయి కదా. మూమెంట్ యునిక్ , క్యాచిగా వుంటే జనాలు ద్రుష్టిని ఆకట్టుకుంటుంది.

టీమ్ ఇండియా క్రికెటర్లు, ఆస్ట్రేలియా ఆటగాళ్ళు మీ మూమెంట్స్  రీల్స్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంటుంది ?చాలా హ్యాపీగా వుంటుంది. వాళ్ళు చేస్తే రీచ్ ఇంకా ఎక్కువగా వుంటుంది. సర్కారు వారి పాట ట్రైలర్ ని కూడా ఆసిస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ రీల్ చేశారు. మన సినిమా గురించి ఇలా ప్రపంచం మాట్లాడుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది.

ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవి- మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సాంగ్ ని ఫ్యాన్స్ ఇంకా ఎక్కువగా అంచనా వేశారు కదా ?ఆచార్య సాంగ్ ఎంత డిమాండ్ చేసిందో అంతా చేశాం. కథలో సందర్భాన్ని బట్టే కొరియోగ్రఫీ వుంటుంది.

కొరియోగ్రాఫేర్ గా మీ  డ్రీమ్ ఏమిటి ?చిరంజీవి గారికి, ప్రభు మాస్టర్ కి చేయాలని అనుకున్నాను. ఆ టార్గెట్ రీచ్ అయ్యింది.  రాజమౌళిగారితో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి చేయాలని వుంది.

కొత్త స్టెప్స్ ని కంపోజ్ చేయడానికి ఎలాంటి సాధన చేస్తుంటారు ?ఒక లిరిక్ కి ఐదు, ఆరు  స్టెప్స్ వేస్తాం. అందులో ది బెస్ట్ అనుకున్నది పిక్ చేస్తాం. కొన్నిసార్లు మనం అనుకున్న స్టెప్ కంటే వేరేది జనాలకి బాగా నచ్చుతుంది.

మీరు పని చేసిన హీరోల్లో తక్కువ టైంలో మూమెంట్స్ నేర్చుకునే హీరో ఎవరు?ఎన్టీఆర్ గారు ఒక్కసారి కూడా రిహర్సల్ కి రాలేదు.  ఆయన స్పాట్ లో చేసేస్తారు. మిగతా హీరోలు కూడా ఒక సారి చెప్పిన వెంటనే మూమెంట్ పట్టేస్తారు.

మీ అంచనాలు తప్పిన పాట ?జైలవకుశ లో ట్రింగ్ ట్రింగ్ సాంగ్. చాలా కొత్తగా చేశాం. చాలా ఆదరణ పొందుతుందని భావించాం. కానీ అది అనుకున్నంత కనెక్ట్ కాలేదు.

ఒక డ్యాన్స్ మాస్టర్ గా మీకు నచ్చే హీరో ?నేను పని చేసి ప్రతి హీరో నాకు దేవుడితో సమానం. నన్ను నమ్మి పాట ఇస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టడానికి కష్టపడి పని చేయడం ఒక్కటే నాకు తెలుసు.

కోరియోగ్రఫీ విషయంలో ఇంకా చెన్నై మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉందా ?లేదు. ఇప్పుడు అంతా మన వాళ్ళకే ఇస్తున్నారు.  నేను వచ్చిన కొత్తలో అక్కడ అనుభవం వున్న వారికి ఇచ్చేవాళ్ళు. ఇందులో నిర్మాతల తప్పులేదు. కోట్లు పెట్టి సినిమా చేస్తున్నారు. కొత్తవారితో రిస్క్ చేయలేరు కదా. ఇప్పుడు కూడా ఇక్కడ కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే అలోచించాల్సిందే.

ఇతర భాషల సినిమాలు చేస్తున్నారా ?శింబు, శివకార్తికేయన్ సినిమాలు చేస్తున్నా. బాలీవుడ్ విషయానికి వస్తే గతంలో ప్రభుదేవ మాస్టర్స్ సినిమాలు చేశాను సల్మాన్ ఖాన్ రాధే కి కూడా పిలిచారు. కానీ నాకే కుదరలేదు.

ప్రభుదేవా స్వతహాగా డ్యాన్స్ మాస్టర్. ఆయన్ని  ఒప్పించడం అంత తేలిక కాదు కదా ?ప్రభు మాస్టర్ గారితో వర్క్ చాలా కూల్ గా వుంటుంది. ఆయనకి నచ్చితే మరో మాట అనరు. ఆయన్ని చూసి ఇండస్ట్రీకి వచ్చాం. ఆయనతో కలసి వర్క్ చేయడం గ్రేట్ ఫీలింగ్.

ప్రభుమాస్టర్ దర్శకత్వం కూడా  చేస్తున్నారు .. మరి మీరు ఎప్పుడు చేస్తున్నారు ?ప్రస్తుతానికి దర్శకత్వ ఆలోచనలు లేవు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ?చిరంజీవి గారు మైత్రీ మూవీ మేకర్స్ సినిమా, రవితేజ గారి ధమాక సినిమాలకి చేస్తున్నా. (Story: మహేష్ బాబు గారి సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి)

See Also: 

ప్రభుదేవా కొరియోగ్రఫీలో మెగాస్టార్ దద్దరిల్లిపోయే పాట!

వివాహేతర సంబంధమే కారణమా?

నైట్‌క్లబ్‌లో రాహుల్‌ గాంధీ.. వీడియో వైరల్‌

కేసీఆర్‌కు 20కిమించి సీట్లు రావు

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

కేఏ పాల్‌పై దాడి

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!

హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1