UA-35385725-1 UA-35385725-1

మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి: ఏ పార్టీలో చేరుతారంటే?

మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి: ఏ పార్టీలో చేరుతారంటే?

Lagadapati Rajagopal: ఒకప్పుడు స్టార్‌ పొలిటీసియన్‌. నిత్యం వివాదాల్లోనూ, చర్చల్లోనూ ఉండే లగడపాటి రాజగోపాల్‌ దాదాపు మూడేళ్ల క్రితం రాజకీయాలకు గుడ్‌బై చెప్పినట్లు ప్రకటించారు. కానీ అవసరమో, అత్యవసరమో, లేదా ఇంకే పార్టీ ఒత్తిడో కారణం తెలియదు గానీ…లగడపాటి మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు పక్కా సమాచారం. ఆనాడు రెండు తెలుగు రాష్ట్రాలకు చిరపరిచితమైన లగడపాటి రాజగోపాల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీలో సంచలన నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విజయవాడ ఎంపీగా వుంటూ పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత అతని పరిస్థితి తారుమారైంది. రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికైన లగడపాటి ఆ తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నంత పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీకి పూర్తిగా దూరమైన ఆయన వైసీపీకి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేసి తెలుగుదేశం పార్టీ మనిషిగా ముద్రపడ్డారు. నిజానికి ఆయన టీడీపీకి కూడా అనుకూలం కాదు. ఏదేమైనా, పరిస్థితులు ఆయనను రాజకీయాలకు దూరం చేశాయి. ఎన్నికల సమయంలో ఎగ్జిట్‌పోల్స్‌తో అందరి నోళ్లలోనూ వుండేవారు. రెండోసారి కేసీఆర్‌ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని నమ్మకంగా చెప్పారు. కానీ కేసీఆర్‌ రెండోసారి సీఎం అయ్యారు. అనుకున్నట్లుగానే లగడపాటి రాజకీయాలకు దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని కూడా ఆయన ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలో స్పష్టం చేశారు. ఆయన అంచనాలు, ఎగ్జిట్‌ పోల్స్‌ తలకిందులయ్యాయి. సుదీర్ఘ విరామం తర్వాత లగడపాటి తన ఛరిస్మాను మరోసారి చూపించాలని అనుకుంటున్నట్లుగా తెలిసింది. ఇటీవల కాలంలో ఆయన వైఎస్‌ఆర్‌సీపీకి దగ్గరయినట్లు సమాచారం. విజయవాడ ఎంపీ స్థానం ప్రతిసారీ వైసీపీకి సంక్లిష్టంగానే మారుతూ వచ్చింది. లగడపాటి వస్తే టీడీపీ హవాను ఈ నియోజకవర్గంలో కొట్టిపడేయవచ్చని జగన్‌ ఆశిస్తున్నట్లు సమాచారం. లగడపాటి కూడా వైసీపీ నేతలు ఇచ్చిన ఆఫర్‌కు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకుల్లో ఒకరిగా వెలుగొందిన ఉపేంద్ర అల్లుడిగా లగడపాటి రాజగోపాల్‌ రాజకీయాల్లోకి వచ్చినా, ఆ తర్వాత తన సొంత వైఖరి, భిన్నమైన వ్యక్తిత్వంతో అటు మీడియాకు, ఇటు జనానికి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో మళ్లీ అదే పంథాతో తన ప్రత్యేకతను నిలుపుకోవాలని, విజయవాడ సీటును వైసీపీకి అప్పగించాలని లగడపాటి పట్టుదలగా వున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, జగన్‌ మోహన్‌రెడ్డి ఆయన చేరికకు అనుకూలమా కాదా అన్నది మొదట్లో సందేహం వ్యక్తమైనప్పటికీ, అట్నుంచి కూడా సానుకూల దృక్పథం వుండటంతో వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి లగడపాటి రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. లగడపాటి తిరిగి రాజకీయాల్లోకి వస్తే అది వైసీపీకి మంచి బలమే అవుతుందని అంచనా వేస్తున్నారు. రాజగోపాల్‌ త్వరలోనే జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటారని చెపుతున్నారు. సో… రాజగోపాల్‌ రీ ఎంట్రీ ఎప్పుడుంటుందో వేచిచూద్దాం. (Story: మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి: ఏ పార్టీలో చేరుతారంటే?)

See Also: 

జనసైనికులపై చేయిపడితే…సహించేదిలేదు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

భద్రాచలానికి రైలు…ఏపీని టచ్‌ చేయదు!

ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1