UA-35385725-1 UA-35385725-1

జనసైనికులపై చేయిపడితే…సహించేదిలేదు

జనసైనికులపై చేయిపడితే…సహించేదిలేదు

Pavan Kalyan: జనసైనికులపై చేయిపడితే పర్యవసానాలు మామూలుగా వుండవని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరించారు. ఏలూరు జిల్లాలో కౌలురైతులకు ఆర్థిక సహాయం అందిజేసిన అనంతరం, చింతలపూడిలో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. ‘‘జనసైనికుల మీద పోలీసులు, వైకాపా గూండాలతో దాడి చేయించారు. వైకాపా నాయకులకు చెప్తున్నాను. నేను ఎంత మేర సహనం పాటిస్తానో నాకు తెలుసు. ఇక అవడం లేదనుకుంటే మాత్రం ఎలా అర్థమయ్యేలా చేప్పాలో కూడా నాకు బాగా తెలుసు. జనసైనికులపై చేయి పడితే మాత్రం సహించేది లేదు. గీతా సారాంశాన్ని నమ్మే వ్యక్తిని నేను. కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తాను. ప్రజలు ముఖ్యమంత్రి పదవి ఇస్తే చేసుకుంటూ పోతాను.. లేకున్నా ప్రజలకు దాసుడిగానే ఉంటాను. అధికారం వస్తే ఏం చేస్తానో చెప్పడం లేదు.. నాకున్నదాంట్లో ఎంత చేయగలనో చేస్తున్నాను. వైకాపా పాలన ఘోరంగా సాగుతోంది. దీన్ని మార్చే శక్తి కేవలం యువతకు మాత్రమే ఉంది. మీరు బాధ్యత తీసుకోకపోతే ఈ సమాజంలో మార్పు రాదు. కళ్లముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా నిలబడ్డా. ఓటమే గెలుపునకు పునాదని నమ్ముతా.. అందుకే నిలబడి ప్రజల కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్నాను’’ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతులను ఆదుకునేవారు లేకుండా పోయారని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఏం చేస్తోంది? ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు ఉపయోగించుకోవచ్చు కదా. ఎవరో వచ్చి ఏదో చేస్తారని మోసపోయేవాడిని కాదు నేను. నేను ఏం చేయగలనో అదే చేస్తున్నాను. అందుకే ప్రత్యేక నిధి పెట్టుకున్నాను’’ అని పవన్‌ పేర్కొన్నారు. కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం గుర్తించాలని.. వారికి అండగా ఉండాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. కౌలు రైతులు అధిక వడ్డీకి అప్పు తీసుకుంటున్నారని.. ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 80 శాతం మంది కౌలు రైతులే ఉన్నారని.. ఇప్పటివరకు 3 వేలకుపైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. (Story: జనసైనికులపై చేయిపడితే…సహించేదిలేదు)

See Also: 

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

భద్రాచలానికి రైలు…ఏపీని టచ్‌ చేయదు!

కూలీలకు గులాబీలతో స్వాగతం

మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఆ పార్టీ నేత పనే!

ఆ దర్శకుడి చేతిలో 5 పెద్ద సినిమాలు, స్టార్‌ హీరోలు

బ్రేకప్‌ చెప్పిన హీరోయిన్‌!

ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1