నాన్ స్టాప్ నవ్వులే నవ్వులు!
‘ఎఫ్3’ మూవీ లో నాన్ స్టాప్ నవ్వుల కోసం మళ్ళీ మళ్ళీ థియేటర్ కి వెళ్ళడం గ్యారెంటీ: సునీల్ ఇంటర్వ్యూ
నా సినీ ప్రయాణం విలక్షణంగా సాగుతుంది. మొదట కమెడియన్ గా చేశాను. తర్వాత హీరో. నాలో వున్న హిడెన్ ట్యాలెంట్ డ్యాన్స్ ని బయటపెట్టాను. ఇంత లావు వున్న నేను సిక్స్ ప్యాక్ చేశాను. తర్వాత విలన్ గా మారాను. పుష్పలో నా వయసుకు మించిన పాత్ర చేశాను. నేను ఏది చేసినా ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. వారు ఆదరించడం వల్లనే నా ప్రయాణం ఇంత విలక్షణంగా సాగింది. నన్ను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.ఎఫ్ 3 లోకి ఎలా వచ్చారు ?
‘కామెడీ రాసే వాళ్ళు తగ్గిపోయారు. మనం కలసి చేస్తే బావుంటుంది కదా” అని ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడితో చెప్పా. ”తప్పకుండ చేద్దాం అన్నగారు.. మీ ‘సొంతం’ సినిమా పదేపదే చూస్తుంటా. మీ టైమింగ్ లోనే మాట్లాడుతుంటాం. మనం కలసి చేద్దాం” అన్నారు అనిల్. చెప్పినట్లే ఎఫ్ 3లో మంచి పాత్ర ఇచ్చారు. ఎఫ్ 3లో వింటేజ్ సునీల్ ని చూస్తారు.
ఎఫ్ 3 మీ పాత్ర సినిమా అంతటా వుంటుందా ?
సినిమా అంతా వుంటుంది. ఐతే ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ సోలో పెర్ఫార్మెన్స్ కి అవకాశం వుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి గ్రూప్ కామెడీగా వుంటుంది. నేను వరుణ్ తేజ్ ఒక బ్యాచ్, వెంకటేష్ గారు , రఘుబాబు ఒక బ్యాచ్, తమన్నా ఫ్యామిలీ ఒక బ్యాచ్, పృద్వీగారు, స్టంట్ శివ ఒక బ్యాచ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ఒక బ్యాచ్, వెన్నల కిషోర్, రాజేంద్రప్రసాద్ గారు ఒక బ్యాచ్.. మళ్ళీ అందరం కలసి ఒక బ్యాచ్.. అందరం కలసి తర్వాత కామెడీ మాములుగా వుండదు. నాన్ స్టాప్ నవ్వులే. ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్3లో వుంటుంది.
ఎఫ్2 – అంటే ఫన్ & ఫ్రస్ట్రేషన్.. మరి ఎఫ్3 అంటే మీరేం చెప్తారు ?
ఫన్ & ఫ్రస్ట్రేషన్..మూడు రెట్లు (నవ్వుతూ). ఐతే ఫ్రస్ట్రేషన్ లో కూడా ఫన్ వుంటుంది. ఫ్యామిలీ అంతా థియేటర్ కి వెళ్లి గట్టిగా నవ్వుకొని మళ్ళీ వెళ్దాం అనుకునే సినిమా ఎఫ్ 3.
వరుణ్ తేజ్ గారి కాంబినేషన్ లో చేశారు కదా..ఆయనలో మీకు నచ్చిన బెస్ట్ క్యాలిటీ ?
వరుణ్ తేజ్ అప్పియరెన్స్ చుస్తే రష్యా సినిమాలో కూడా హీరోగా పెట్టేయొచ్చు. హాలీవుడ్ కటౌట్ ఆయనది. ఆలాంటి అప్పియరెన్స్ వున్న వరుణ్ గారు.. ఒక మిడిల్ క్లాస్ రోల్ చేయడం సర్ప్రైజింగా అనిపిస్తుంది. చాలా మంచి వ్యక్తి. చిన్నప్పటి నుంచి తెలుసు. హీరో అయిన తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదు. ‘అన్నా’ అని పిలుస్తారు. వరుణ్ గారిలో చాలా ఫన్ వుంది. ఈ సినిమాతో అది బయటికి వచ్చింది. దీని తర్వాత ఆయన నుండి ఫన్ ఓరియంటడ్ సినిమాలు కూడా వస్తాయి.
ఎఫ్3 లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి ?
ఎఫ్ 3, పుష్ప .. ఒకే సమయంలో షూట్స్ లో పాల్గొన్న. రెండూ డిఫరెంట్ రోల్స్. ఒక కామెడీ , రెండు విలనీ. పొద్దున్న కామెడీ చేసి రాత్రికి విలనీ చేయడం కాస్త ఛాలెజింగ్ అనిపించింది.
ఎఫ్3 తో సునీల్ ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని ఇవ్వబోతున్నారంటే?
ప్రేక్షకులు ఇదివరకటి సునీల్ ని చూస్తారు. ఇప్పుడు అంతా నేచురల్ కామెడీ అంటున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేచురాలిటీ లొకేషన్ పై ఆధారపడివుంటుంది. మా ఊరికి వెళితే యాసతో ఇంకా వెటకారంగా మాట్లాడతారు. అక్కడ పరిస్థితులు అలా వుంటాయి. ఇక్కడకి వచ్చేసరికి యాస కొంచెం తగ్గుతుంది. ఐతే అది అసహజం అనుకుంటే .. హిందీ సినిమాలు చూసి హాలీవుడ్ వాళ్ళు అసహజం అనుకుంటారు. తండ్రిపోయి మనం ఏడుస్తుంటే ఆ సీన్ చూసి హాలీవుడ్ ప్రేక్షకుడు .. వీళ్ళకేమైనా మానసిక రోగం వచ్చిందా అనుకుంటాడు. పరిస్థితులు ప్రాంతాలు బట్టి మార్పు వుంటుంది. సినిమా అనేది అల్టిమెట్ గా వినోదం. కష్టపడి పని చేసిన తర్వాత మనిషి రిలాక్స్ అవ్వాలి. అలా రిలాక్స్ అవ్వాలంటే కామెడీ సినిమాలే ఎక్కువ రావాలి. ప్రతి రోగానికి మందు నవ్వు. నేను అదే నమ్ముతా.
ఇప్పుడు కామెడీ సినిమాలు చేసే దర్శకులు తగ్గిపోయారు కదా.. ఆర్టిస్ట్ గా మీ మీద ఎలాంటి ప్రభావం వుంటుంది?
నామీద కంటే ప్రేక్షకుల మీద ఆ ప్రభావం ఎక్కువ వుంటుంది. నవ్వించే సినిమాలు చేయడం అంత తేలిక కాదు. నవ్వించడం కూడా అంత తేలిక కాదు. సరదాగా నవ్వుకొని వుంటే ఇమ్యునిటీ పెరుగుతుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు కదా.. సో.. కామెడీ సినిమాలు ఎక్కువ రావాలి. ప్రేక్షకులని నవ్వించాలి. సీరియస్ పాత్రలతో పోల్చుకుంటే కామెడీ చేయడమే కష్టం. అన్ని జోనర్ సినిమాలూ రావాలి. కానీ కామెడీ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటాను.
సీరియస్ రోల్స్ ఈజీ అంటున్నారు. కలర్ ఫోటోలో చాల సెటిల్ గా చేశారు.. దీనికి కూడా క్రాఫ్ట్ మీద కంట్రోల్ కావాలి కదా ?
నిజమే. అయితే ఆ క్రెడిట్ ఇప్పుడు వస్తున్న యంగ్ దర్శకులకు దక్కుతుంది. నా సినిమాలు స్కూల్ , కాలేజీ డేస్ లో చూశారు. ఇప్పుడు వాళ్ళు అప్డేటడ్ వర్షన్. నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలా వచ్చిందే కలర్ ఫోటో.
విలన్ అవుదామని ఇండస్ట్రీ కి వచ్చారు. పుష్ప లో చేసిన పాత్ర మీ డ్రీమ్ ని పూర్తి చేసిందని భావిస్తున్నారా ?
అవును. ‘పుష్ప; నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. నా కెరీర్ లో మర్చిపోలేని పాత్ర అది. పుష్ప 2లో కూడా నా పాత్ర వుంటుంది.
సంపూర్ణ నటుడు అయ్యారని అనుకుంటున్నారా ?
లేదండీ. ఇది మహా సముద్రం. కమల్ హాసన్ గారి నాలుగు సినిమాలు చూస్తే చాలు. అందులో మనం ఇంకా చేయలేనివి వంద కనిపిస్తాయి. ఐతే విలక్షణ పాత్రలు చేసే అవకాశం వచ్చింది.
ఇతర భాషల నుంచి అవకాశాలు వస్తున్నాయా ?
తమిళ్, కన్నడ, బాలీవుడ్ నుంచి విలన్ పాత్ర సంప్రదించారు. బాలీవుడ్ నుంచి కొన్ని కామెడీ రోల్స్ కూడా ఆఫర్స్ వచ్చాయి. రెండు ఓకే చేశాం. త్వరలోనే వివరాలు చెప్తాం.
ఎఫ్3లో తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ ముగ్గురు హీరోయిన్స్ .. వీరిలో మీరు గమనించిన బెస్ట్ క్యాలిటీస్ ?
తమన్నా గారు హైలీ ఎనర్జీటిక్, ఇంటిలిజెంట్.మెహ్రీన్ లో తెలియని అమాయకత్వం వుంటుంది. సోనాల్ చౌహాన్ చాలా సెన్సిబుల్, షార్ఫ్.
ఎక్కువ కామెడీ సినిమాలు రావాలని కోరుకుంటున్నారు కదా .. మీ వరకూ ఏం ప్లాన్స్ చేస్తున్నారు ?
నిజానికి నేను ప్లాన్ చేయడం మానేశాను. నా కోసం నేచర్ ఏం ప్లాన్ చేస్తుందో గుర్తిస్తున్నాను. కామెడీ చేయమన్నా ఓకే, పదహారేళ్ళ అమ్మాయికి ఫాదర్ గా చేయమన్నా ఓకే. అయితే వచ్చిన అవకాశానికి న్యాయం చేయడానికి వంద శాతం కష్టపడతాను. ఐతే నా వరకూ కామెడీ చేసి నవ్వించడమే ఇష్టం.
ఒక పాత్ర చెప్పినపుడు మీ వెటకారం, బాడీ లాంగ్వెజ్ జోడిస్తారా ? లేదా దర్శకుడు చెప్పినట్లు మౌల్ద్ అవుతారా ?
కొన్ని మనల్ని అనుకోని రాస్తారు. కొన్ని మనం ఏమైనా చేస్తామని రాసి తెస్తారు. నా వరకూ అవతలి నుండి ఏదైనా వస్తేనే రియాక్షన్ వస్తుంది. ఏదైనా స్పాంటినియస్ గా రావాల్సిందే. అంతేకాని కూర్చుని అమరకావ్యాలు రాసే టైపు కాదు. ప్లాన్ చేస్తే ఒక్క ముక్కరాదు (నవ్వుతూ).
ఎఫ్ 3 ట్రైలర్ లో మీరు చెప్పిన ‘ఆడాళ్ళు బంగారు చూస్తే సైకోలు అయిపోతారు’ డైలాగ్ బాగా పేలింది. నిజ జీవితంలో మీ వైఫ్ కి ఏ సందర్భాల్లో బంగారం కొనిచ్చారు.. రియాక్షన్ ఏంటి ?
ఒకసారి కొని తీసుకెళ్ళాను. ”మీకు నచ్చిన డిజైన్ తీసుకురావద్దు, మళ్ళీ మాకు నచ్చక ఎక్స్ చేంజ్ చేసుకోవడం పెద్ద తలనొప్పి. డబ్బులు ఇచ్చేయండి చాలు. నచ్చింది కొనుక్కుంటాం” అన్నారు. తర్వాత ఎప్పుడు తీసుకెళ్లలేదు( నవ్వుతూ) చీరలు విషయంలో కూడా ఇదే జరుగుతుంది.
మీ స్నేహితుడు త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు ?
తన కొత్త సినిమాలో నేను వుంటాను. అవకాశం వున్న ప్రతి చోట నన్ను పెట్టాలని ప్రయత్నిస్తుంటారు. ఆఖరికి ‘భీమ్లా నాయక్’ సాంగ్ లో కూడా పెట్టారు ( నవ్వుతూ)
దర్శకుడు అనిల్ రావిపూడిగారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ కామెడీ చేస్తున్నాం.. ఈ మధ్య నెట్ ప్రాక్టీస్ తప్పింది కదా .. చిన్న భయం వుంటుంది. అయితే దర్శకుడు అనిల్ రావిపూడిని చూస్తే ఆ భయం పోయింది. అనిల్ గ్రేట్ ఆల్ రౌండర్. తన కాలేజీ డేస్ లో మాకులానే స్టేజ్ షోలు చేసి వచ్చాడు. అనిల్ లో గ్రేట్ ఆర్టిస్ట్ వున్నాడు. అతనే చేసి చూపిస్తాడు. నా టైమింగ్ నా కంటే అనిల్ కే బాగా తెలుసు. ఛార్లీ చాప్లీన్ లా యాక్ట్ చేసే పోటీలో ఛార్లీ చాప్లీన్ కే సెకండ్ ప్రైజ్ వచ్చినట్లు.. నా టైమింగ్ ని అంతలా పట్టేశారు. ఎలాంటి పరిస్థితిలో కూడా నవ్వుతూ ఉంటాడు. ఎంతమంది స్టార్ కాస్ట్ తో ఈ మధ్య కాలంలో ఎవరూ సినిమా తీయలేదు. ఒకవేళ తీసిన ఇంతమంది ఆర్టిస్ట్ లకి వేరే సినిమాలకి సర్దుబాటు చేస్తూ తీయలేదు. అనిల్ ని చూసిన వెంటనే ఒక పాజిటివ్ ఎనర్జీ, స్మైల్ వస్తుంది. అది నాకు బాగా నచ్చింది. ఆయన సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే. ఆయన ఎంత ఎనర్జిటిక్, పాజిటివ్ గా ఉంటారో ఆయన సినిమాలు కూడా అలానే వుంటాయి.
ఎఫ్ 3లో వెంకటేష్ , వరుణ్ తేజ్ ఫెర్ఫార్మేన్స్ ఎలా ఉండబోతుంది ?
వెంకటేష్ గారి టైమింగ్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎఫ్ 3లో ఆయన స్టీల్ ది షో. వరుణ్ తేజ్ గారిని ఇప్పటివరకూ ఇంత కామెడీ చేసిన రోల్ లో చూసి వుండరు. ఎఫ్ 3 గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నాన్ స్టాప్ గా నవ్వుతూనే వుంటారు. ఈ సినిమాకి ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్ వుంటారు.
డబ్బే మనిషిని శాసిస్తుందని ఎఫ్ 3 ట్రైలర్ లో చూపించారు కదా .. దీనికి మీరేం చెప్తారు ?
కళియుగం లో డబ్బే మనిషిని శాసిస్తుంది కదా.. డబ్బే అన్నిటికి మూలమైపోయింది. అయితే నేను హ్యూమన్ రిలేషన్స్ కి ప్రాధాన్యత ఇస్తా. నాకు వ్యాపారం చేతకాదు. డబ్బు లెక్కలు అంతగా రావు. బాత్ రూమ్ కట్టాలన్నా కోటి రూపాయిలు వేసేయవచ్చు ( నవ్వుతూ) ఏం వ్యాపారం చేసిన ఎంతో కొంత అబద్దం ఆడాలి. అది మళ్ళీ మన పిల్లలకి తగులుతుందని భయపడి నవ్వించి డబ్బులు సంపాదించాలని ఇక్కడి వచ్చా.
కొత్త ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు?
మెగాస్టార్ చిరంజీవి గారి గాడ్ ఫాదర్, రామ్ చరణ్ -శంకర్ గారి సినిమా చేస్తున్నా. మరో 13 చిన్న , మీడియం సినిమాలు కూడా వున్నాయి. అందరికీ అందుబాటులో వుండాలని నిర్ణయించుకున్నా. ఒక నాలుగు పెద్ద సినిమాలు చేస్తే మరో పది చిన్న సినిమాలు చేయాలని భావిస్తున్నాను. (Story: నాన్ స్టాప్ నవ్వులే నవ్వులు!)
See Also:
ఎఫ్ 3లో నాది చాలా సర్ప్రైజింగ్ రోల్..!
ఇక నుంచి హైదరాబాద్‌లో 24 గంటలు బస్సులు
మాజీ మంత్రిపై ఎస్సీ ఎస్టీ కేసు
భర్తను ముక్కలుగా నరికి.. కూర వండేసింది!
స్విమ్మింగ్ పూల్‌లోనే అత్యాచారం
ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీ ట్రైలర్ అదుర్స్!
‘సర్కారు వారి పాట’కు బ్లాక్ బస్టర్ టాక్!
సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!
పిజ్జా రెండు ముక్కలు తిన్నాడు…గుండె ఆగింది!
అధికారులపై పెట్రోల్ దాడి-వైరల్ వీడియో
కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!
మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!
మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!
తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు
భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్!
అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు
17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి
డ్యాన్స్ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
9 Hours is the next offering on Hotstar Specials
Sarkaru Vaari Paata Received Unanimous Blockbuster Talk