UA-35385725-1 UA-35385725-1

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రెండు రోజులుగా మానసిక వికలాంగురాలిపై…!

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రెండు రోజులుగా మానసిక వికలాంగురాలిపై…!

రెండు రోజులు ఆస్పత్రిలోనే నిర్బంధం, అత్యాచారం
ముగ్గురు నిందితుల అరెస్ట్‌
నిందితుల్లో ఇద్దరు ఆసుపత్రి కాంట్రాక్టు ఉద్యోగులు

Gang Rape: విజయవాడ నగరంలోని ప్రభుత్వాస్పత్రిలో ఘోరాతిఘోరం చోటుచేసుకున్నది. ఆసుపత్రికి చెందిన సిబ్బంది, మరో వ్యక్తితో కలిసి ఓ మానసిక వికలాంగురాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. రెండు రోజులపాటు ఎవరికీ తెలియకుండా హాస్పిటల్‌లోని ఓ గదిలో బంధించి లైంగికదాడికి పాల్పడ్డారు. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఆస్పత్రిలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న ఇద్దరు, మరో వ్యక్తి మానవత్వాన్ని మరచి మానసిక వికలాంగురాలిని రెండు రోజులు ఆస్పత్రిలోనే నిర్బంధించి లైంగికదాడికి పాల్పడినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ టి.కాంతిరాణా టాటా మీడియాకు తెలిపారు. ఈ కేసులో నిందితులు ముగ్గురిని అరెస్ట్‌ చేశామన్నారు. ఈ ముగ్గురూ ఒకరి తర్వాత ఒకరుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది.
ఈ ఘటన వివరాలు ఇలా వున్నాయి…
విజయవాడ నగరంలోని వాంబేకాలనీకి చెందిన ఓ యువతి(20) ఈ నెల 19వ తేదీ సాయంత్రం తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆమె మానసిక స్థితి సరిగా లేని కారణంగా తల్లిదండ్రులు ఆమె కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఆమె బుధవారం కూడా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు నున్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాస్పత్రిలో పెస్ట్‌ కంట్రోల్‌ కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్న వాంబేకాలనీకే చెందిన దారా శ్రీకాంత్‌(26)పై తమకు అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువతి అదృశ్యం అయినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో దారా శ్రీకాంత్‌ను పిలిపించి విచారణ చేయగా, ఈ నెల 19వ తేదీ రాత్రి ఆ యువతి ఆస్పత్రి వద్దకు వచ్చి తనను కలిసిందని, వెంటనే ఆటో ఎక్కించి ఇంటికి పంపించానని తెలిపాడు. అయితే, ఆమె ఇంటికి రాకపోవడం, శ్రీకాంత్‌పై అనుమానం పెరగడంతో సదరు యువతి తల్లిదండ్రులు బుధవారం రాత్రి ప్రభుత్వాస్పత్రికి చేరుకుని రెండో అంతస్తులో పెస్ట్‌ కంట్రోల్‌ కాంట్రాక్టు వారు సామగ్రి భద్రపరుచుకునేందుకు కేటాయించిన గది వద్దకు వెళ్లారు. ఆ గది తలుపులు మూసి లోపల గడియ పెట్టి ఉండటంతో గట్టిగా కొట్టారు. ఆ సమయంలో పవన్‌ అనే యువకుడితో ఆమె చాలా సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. ఆమెను బయటకు తీసుకువచ్చి తల్లిదండ్రులు ఆరా తీయగా రెండు రోజులుగా తనను ముగ్గురు నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డారని వివరించింది. తనకు ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీకాంత్‌ చెప్పడంతో మంగళవారం రాత్రి ఆస్పత్రి వద్దకు వచ్చానని తెలిపింది. ఆ రాత్రికి వారి గది వద్దకు తీసుకువెళ్లి భోజనం పెట్టి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శ్రీకాంత్‌ అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పింది. బుధవారం ఉదయం తనను ఆస్పత్రి వద్దే వదిలేసి శ్రీకాంత్‌ వెళ్లిపోయాడని, తాను అక్కడే ఒంటరిగా తిరుగుతుండటంతో అతని స్నేహితుడైన పెస్ట్‌ కంట్రోల్‌ కాంట్రాక్టు ఉద్యోగి అయిన సీతారాంపురానికి చెందిన చెన్నా బాబూరావు(23), ఆయన స్నేహితుడు వించిపేటకు చెందిన జారంగుల పవన్‌ కల్యాణ్‌(23) వచ్చి కలిశారని తెలిపింది. తమ వెంట వచ్చి గదిలో ఉండాలని, శ్రీకాంత్‌ను తీసుకువచ్చి పెళ్లి చేస్తామని నమ్మించారని వివరించింది. వారి మాటలు నమ్మి మళ్లీ రెండో అంతస్తులో ఉన్న ఆ గదికి వెళ్లగా నిర్బంధించి బాబూరావు, పవన్‌ కల్యాణ్‌ కూడా అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. దీంతో బాధితురాలిని ఆమె తల్లిందడ్రులు పోలీసుల వద్దకు తీసుకువెళ్లగా, అదృశ్యం కేసును రేప్‌ కేసుగా మార్పు చేశారు. వెంటనే బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి పంపించారు. గురువారం ఉదయం నిందితులను ముస్తాబాదా వెళ్లే దారిలో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. దిశ ఏసీపీ వీవీ నాయుడును విచారణ అధికారిగా నియమించామని, 15 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని వెల్లడించారు. (Story: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రెండు రోజులుగా మానసిక వికలాంగురాలిపై…!)

See Also: 

ఏపీలో కారు కలకలం: సీఎం సీరియస్‌ : ఇద్దరు సస్పెన్షన్‌

అమ్మాయి కావాలని కోరితే…ఇళ్లల్లో వచ్చి మహిళలను ఎత్తుకుపోతారా?

ఇలా అయితే…మ‌ళ్లీ మ‌నం ప్ర‌తిప‌క్షంలోనే!

ఈ సెలబ్రిటీల పెళ్లి మన స్టయిల్లో ఉంటుందట!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

పేద యువతులే టార్గెట్‌ : రియల్‌ వ్యాపారి వ్యభిచారం

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1