UA-35385725-1 UA-35385725-1

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా వచ్చిన కొత్త రోజుల్లో రెండు మూడు సినిమాల తర్వాత ఒకనాటి అమితాబ్‌ బచ్చన్‌ హిట్‌ జంజీర్‌ను రీమేక్‌ చేశారు. తెలుగులో కూడా అది తూఫాన్‌గా విడుదలైంది. నిజానికి ఆ సినిమా అట్టర్‌ఫ్లాప్‌ అయింది. అయితే ఆ ఫ్లాప్‌కు రామ్‌చరణ్‌ నటన కారణం కాదు. అది డైరెక్టర్‌ టేకింగ్‌ తప్పిదం. ఆ సినిమా రిలీజ్‌ అయినప్పుడు హిందీ మీడియా రామ్‌చరణ్‌ను ‘ఫేడ్‌ఫేస్‌డ్‌ హీరో’ అని అభివర్ణించింది. కావాలంటే ఇప్పుడు కూడా నెట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. కానీ అదే రామ్‌చరణ్‌ ఈనాడు బాలీవుడ్‌కు బంగారమయ్యాడు. అదే హిందీ మీడియా తప్పనిపరిస్థితుల్లో ఆయనను ఆకాశానికి ఎత్తుతోంది. ఒక మెగాస్టార్‌ కొడుకైనప్పటికీ, నటనలో ఆరితేరకపోతే, ఎంత గొప్ప వారసుడైనా తెరమరుగు కావాల్సిందే. కానీ రామ్‌చరణ్‌ ఎంతో కష్టపడి, అంచలంచెలుగా ఎదుగుతూ మగధీర, రంగస్థలం వంటి పెద్ద హిట్లతో టాప్‌ హీరోలలో ఒకరయ్యారు. మెగాస్టార్‌కు సరైన వారసునిగా పేరుతెచ్చుకున్నారు. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) దేశంలోనే అతిపెద్ద హిట్‌ చిత్రమైంది. ఈ సినిమా మ్యానియా యావత్‌ దేశాన్ని ఊపేస్తున్నది. దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్‌ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది. 5 రోజులకే కలెక్షన్ల సునామీ సృష్టించి రికార్డులను బద్దలుగొట్టింది. బాలీవుడ్‌ అవాక్కయింది. ఇక ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీ దశ మారి పోయింది. డివివి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్‌ తో నిర్మించిన విషయం తెలిసిందే. ఇది పాన్‌ ఇండియా సినిమా కావడంతో అన్ని చోట్ల సూపర్‌ హిట్‌ అయ్యింది. ఈ సినిమాలో నటించిన ఇద్దరు స్టార్‌ హీరో రామ్‌చరణ్‌, ఎన్టీయార్‌ (NTR) కోసం ఉత్తరాదిలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో ఈ ఇద్దరు స్టార్స్‌ అద్భుతమైన నటన కనబర్చి అందరిని ఆకట్టుకున్నారు. ఉత్తరాది ప్రేక్షకులు మన స్టార్స్‌పై మనసు పారేసుకుంటున్నారు. ఇక బాలీవుడ్‌ నిర్మాతలు ఈ ఇద్దరితో సినిమాలు తీయడానికి క్యూకడుతున్నారు. ఒక పెద్ద నిర్మాణ సంస్థ రామ్‌చరణ్‌తో రెండు సినిమాల కోసం బిగ్‌డీల్‌ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ డీల్‌ ఆఫర్‌ సహజంగానే మతిపోగొడుతుందట! ఎలాంటి పెద్ద ఆఫర్‌ను ఎవరూ కాదనలేరని, అయితే రామ్‌చరణ్‌ ఇంకా గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదని తెలిసింది. ఈ రెండు సినిమాల్లో ఒక సినిమా మల్టీస్టారర్‌ సినిమా అని, అందులో ఖాన్‌త్రయం (షారూఖ్‌, అమీర్‌, సల్మాన్‌)లో ఒకరు నటిస్తారని, వారితోపాటు రామ్‌చరణ్‌ వుంటారని, దీని కోసం బాలీవుడ్‌కు చెందిన ఒక ప్రముఖ దర్శకుడు రంగంలోకి దిగి ఇదివరకే తాను సిద్ధం చేసిన ఒక గొప్ప కథను తీసుకువచ్చారని సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. గతంలో రామ్‌ చరణ్‌ జంజీర్‌ సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేశాడు. అందులో ప్రియాంక చోప్రా హీరోయిన్‌. (Story: రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?)

See Also: క్యాబినెట్‌ విస్తరణ ముహూర్తం కుదిరింది!

ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1