UA-35385725-1 UA-35385725-1

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

హైదరాబాద్‌: భారతదేశంలో ఇప్పుడు రాజమౌళి అంటేనే సినిమా…సినిమా అంటేనే రాజమౌళి అన్నట్టుగా మారిపోయింది. ఒకప్పుడు బాలీవుడ్‌ మాత్రమే భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం వహించేంది. బెంగాల్‌ దర్శకుడు సత్యజిత్‌రే ఈ పరిస్థితిని తారుమారు చేసి, ప్రాంతీయ సినిమాల ప్రాభవాన్ని నిలిపాడు. సత్యజిత్‌రే చనిపోయిన తర్వాత ఆ స్థాయి సినిమాలు ప్రాంతీయ భాషల నుంచి రావడం లేదు. కాకపోతే, రోజులు మారిపోయిన తర్వాత అవార్డు సినిమాలంటేనే ప్రాంతీయ సినిమాలనే భావన కూడా మారిపోయింది. బాక్సాఫీసు వద్ద ఏ సినిమా రికార్డులు బద్దలు కొడుతుందో అదే గొప్ప సినిమా. దీంతో ప్రాంతీయ భావనలు కొట్టుకుపోయాయి. అదికూడా రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత బాక్సాఫీసు రికార్డులే భారత జాతీయ సినిమాగా మారిపోయింది. దీంతో బాలీవుడ్‌ సినిమాల ప్రాధాన్యత తగ్గిపోయింది. అక్కడి కథలు కూడా అంత గొప్పగా వుండటం లేదు. అమీర్‌ఖాన్‌, షారూఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌ వంటి హీరోలు సైతం గొప్ప కథల గురించి అన్వేషించాల్సి వస్తున్నది. రాజమౌళి బాహుబలి రిలీజ్‌ అయిన తర్వాత బాలీవుడ్‌, టాలీవుడ్‌ అనే తేడా లేకుండా తెలుగు హిట్‌ సినిమాలన్నీ హిందీలోకి డబ్‌ అవుతున్నాయి. అలాగే, పాన్‌ ఇండియా పేరుతో సినిమాల నిర్మాణం మొదలైంది. వివిధ భాషల్లో సినిమాను చిత్రీకరించడంతోపాటు భారతీయులు నివసిస్తున్న ఇతర దేశాల్లో సైతం సినిమాను ఒకేసారి రిలీజ్‌ చేయడమే పాన్‌ ఇండియా టార్గెట్‌. ఫలితంగా తెలుగు రాష్ట్రాల మార్కెట్‌తోపాటు ఇతర మార్కెట్లను కూడా కొల్లగొట్టడమన్నమాట! దీన్ని అలవాటు చేసింది రాజమౌళినే. ఆనాటి నుంచి ప్రముఖ హీరోల సినిమాలన్నీ దాదాపుగా పాన్‌ ఇండియా స్థాయిలోనే నిర్మితమవుతున్నాయి. దీని వల్ల ఖర్చు కూడా ఎక్కువవుతుంది. ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్ప సినిమా టాప్‌`10 ఇండియా బాక్సాఫీసు హిట్‌ చిత్రాల్లో చోటు చేసుకున్నది. ఇది పాన్‌ ఇండియా పుణ్యమే. దీని వల్ల తెలుగు సినిమా బడ్జెట్‌కు అవధులు లేకుండా పోతోంది. వంద కోట్లు, రెండొందల కోట్లు కాస్తా… రూ.500 కోట్లు, రూ.1000 కోట్లు అయిపోతోంది. ఆర్‌.ఆర్‌.ఆర్‌కు అక్షరాలా రూ.500 కోట్లకుపైగానే ఖర్చు పెట్టారు. తాజాగా రాజమౌళి కనీసం 800 కోట్ల రూపాయలతో తన తదుపరి చిత్రాన్ని తీయడానికి రంగం సిద్ధం చేశారు. నిర్మాతలు కూడా అందుకు సిద్ధమై వున్నారు.
ఇంతకీ ఏ సినిమా?
ఎస్‌ఎస్‌ రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో తీస్తున్న విషయం అందరికీ తెల్సిందే. ఎంత డబ్బు ఖర్చుపెట్టినా దాన్ని ఎలా రాబట్టుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు. ఆర్‌ఆర్‌ఆర్‌ తాజా కలెక్షన్లు చూసే మనకు ఈ విషయం అర్థమైపోతుంది. మూడు రోజుల్లోనే ఆ సినిమాకు పెట్టిన ఖర్చంతా వచ్చేసింది. ఎంత ఖర్చయినా నిర్మాతలు వెనుకంజ వేయడం లేదు. ఇప్పుడు మహేష్‌ బాబు సినిమాకి అక్షరాలా రూ.800 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు చిత్ర పరిశ్రమ వర్గాల భోగట్టా! సహజంగానే ఆర్‌ఆర్‌ఆర్‌ తరవాత మహేష్‌బాబుతో సినిమా చేయబోతున్న రాజమౌళి తన కథను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమా కథేమిటి? ఏ జోనర్‌? అనే విషయాలపై ఏనాటినుంచో చర్చ జరుగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమకు కౌబాయ్‌ సినిమాలతోపాటు ఈస్టమన్‌కలర్‌, 70ఎంఎం, ఇతర ఎన్నో సాంకేతిక అంశాలను పరిచయం చేసిన సూపర్‌స్టార్‌ కృష్ణ జేమ్స్‌బాండ్‌ తరహా సినిమాలను కూడా తెలుగుకు పరిచయం చేశారు. ఆ కోవలో వచ్చిన సినిమాలే గూఢచారి 117 వంటి సినిమాలు. ఇప్పుడు మహేష్‌బాబును కూడా ఎస్‌ఎస్‌ రాజమౌళి ‘జేమ్స్‌బాండ్‌’గా చూపిస్తాడని ఇన్‌సైడ్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జేమ్స్‌బాండ్‌ తరహా కథతో ఆఫ్రికన్‌ లేదా అమెజాన్‌ అడవుల్లో భారీగా చిత్రీకరించడానికి రాజమౌళి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. హాలీవుడ్‌ తరహాలో ఈ కథ వుండబోతున్నది. అలాగే చిత్రీకరణ కూడా ఆ స్థాయిలోనే వుంటుంది. అందుకు కనీసం రూ.800 కోట్ల బడ్జెట్‌ అవుతుందని అంచనా. ఇది చివరి క్షణాల్లో పెరగొచ్చు కూడా. ఇండియన్‌ సినిమా బాక్సాఫీస్‌ స్టామినా రూ.2000 కోట్లు అని రాజమౌళి ఇదివరకే రుజువుచేశారు. అందువల్ల రూ.800 కోట్లు ఖర్చుపెట్టినా ఆ మాత్రం డబ్బును రాబట్టుకోవడం పెద్ద కష్టం కాదన్నది రాజమౌళి ఆలోచన. పైగా దీన్ని ఆంగ్లంలోనూ తీసి, హాలీవుడ్‌లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అదే జరిగితే, భారత సినీ చరిత్రలోనే అదొక గొప్ప చిత్రమవుతుంది. ఇదొక రికార్డు కూడా. సినీ చరిత్రను రాజమౌళి మారుస్తారా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే! (Story: రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు)

See Also: ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల తుఫాన్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1