UA-35385725-1 UA-35385725-1

సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!

సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!

Sarkaru Vaari Paata: చిత్రం: సర్కారువారి పాట, నటీనటులు: మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌, వెన్నెల కిషోర్‌, సముద్రఖని, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి, నదియా, అజయ్‌, బ్రహ్మాజీ తదితరులు, సంగీతం: తమన్‌, సినిమాటోగ్రఫీ: ఆర్‌.మది, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేశ్‌, నిర్మాత: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, రచన, దర్శకత్వం: పరశురామ్‌, విడుదల తేదీ: 12-05-2022.

Sarkaru Vaari Paata Review
Sarkaru Vaari Paata Review

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సినిమా అంటేనే అదొక లెఖ్క. అన్ని వర్గాలను అలరించే రీతిలో కథాంశాలను ఎంచుకోవడంలో ఆయన మ్యాగ్జిమమ్‌ ముందుంటారు. అందుకే ఒక్కడు సినిమా తర్వాత గడిచిన ఇన్నేళ్లుగా ఫ్లాప్‌ సినిమాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. సర్కారువారి పాట కూడా ఆ కోవలో వచ్చిన సినిమానే. కరోనా కారణంగా ధియేటర్‌లో మహేశ్‌ సినిమా లేక అభిమానులకు ఏమీ పాలుపోవడం లేదు. చివరకు సర్కారువారి పాట వారికి పండగ వాతావరణాన్ని కలిగించింది. రెండున్నరేళ్ల కిందట ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం విడుదలైంది. అందుకే మహేశ్‌బాబు మూవీ కోసం ఈస్థాయి నిరీక్షణ తప్పలేదు. ‘సర్కారువారి పాట’ పోస్టర్లు, ప్రచార చిత్రాలు పదేళ్ల క్రితం విడుదలైన ‘పోకిరి’ నాటి మహేశ్‌బాబును గుర్తు తెస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా పోకిరిలాంటి మూవీ కోసం పదేళ్లు ఆగాల్సివచ్చిందని మహేశ్‌బాబు పదేపదే అనడంతో దీనిపై అంచనాలు మరీ పెరిగాయి. సర్కారువారి పాట సినిమా ఎలా వుంది? మహేశ్‌బాబు నటన ఎలా వుంది? అభిమానుల అంచనాలను దర్శకుడు అందుకున్నారా? పాన్‌ ఇండియా మూవీగా ఇది క్లిక్‌ అవుతుందా? ఓసారి సమీక్షలోకి వెళ్దాం.

Sarkaru Vaari Paata Review
Sarkaru Vaari Paata Review

కథేంటో ముందుగా తెలుసుకుందాం

అప్పు ఆడపిల్ల లాంటిదని హీరో అంటే, అప్పు సెటప్పులాంటిదని విలన్‌ అంటాడు. ఇలా అప్పు చుట్టూ తిరిగే ఒక కొత్త కథాంశాన్ని దర్శకుడు ఎంచుకుంటాడు. స్టోరీలైన్‌ పెద్దగా లేకుండానే కథనాన్ని అల్లుకుంటూ పోతాడు. మహేశ్‌ (మహేశ్‌బాబు) తెలుగోడే అయినప్పటికీ, అమెరికాలో ప్రైవేట్‌ ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తుంటాడు. అందరికీ అప్పులిస్తుంటాడు. తన దగ్గర అప్పు తీసుకున్నవాళ్లు ఎంతటివాళ్లయినా సరే వాళ్ల నుంచి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టడు, నిద్రపోడు. అయితే అతను అనుకోకుండా హీరోయిన్‌ కళావతి ట్రాప్‌లో పడతాడు. అమెరికాలోనే చదువు కోసమని వెళ్లిన కళావతి (కీర్తిసురేష్‌) మద్యానికీ, జూదానికి బానిసై మహేశ్‌ దగ్గర ఏదో ఒక అబద్ధం చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవ్వరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేశ్‌ తొలి చూపులోనే కళావతిపై మనసుపడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం బయటపడుతుంది. అయినా మహేశ్‌ అప్పు విషయంలో వెనక్కితగ్గడు కదా! అందుకే తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్‌ (సముద్రఖని) దగ్గరికి బయల్దేరతాడు. స్టోరీ అమెరికా నుంచి విశాఖపట్నానికి చేరుతుంది. పది వేల డాలర్ల అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేశ్‌, ఇక్కడికొచ్చాక ప్లేటు ఫిరాయిస్తాడు. రాజేంద్రనాథ్‌ తనకి ఇవ్వాల్సింది పదివేల డాలర్లు కాదని, పది వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని అంటాడు. కళావతి కూడా షాకవుతుంది. ఆ పదివేల కోట్ల కథ ఆసక్తిగా మారుతుంది. ఆ డబ్బును తిరిగి వసూలు చేశాడా? అసలు మహేశ్‌ ఎవరు? అతను అమెరికా ఎందుకు వెళ్లాడు? కథానేపథ్యమేంటి? తదితర విషయాలన్నింటినీ ధియేటర్‌ తెరపై చూడటమే ఉత్తమం.

Sarkaru Vaari Paata Review
Sarkaru Vaari Paata Review

ఇంతకీ సినిమా ఎలా ఉందంటే…?

బ్యాంకింగ్‌ వ్యవస్థ నేపథ్యం ఈ కథకు బలం. ఇటీవల కాలంలో ప్రైవేటు ఫైనాన్స్‌ వ్యాపారం సామాన్యుడిని వేధిస్తున్నది. దాన్నే దర్శకుడు స్టోరీలైన్‌గా మలచుకున్నాడు. సమకాలీన సమస్యని స్పృశిస్తూ సాగే కథ కావడంతో ప్రతి ఒక్కరికీ ఇది దగ్గరగా వున్నట్లు అన్పిస్తుంది. బ్యాంకు రుణాలు, చెల్లింపుల విషయంలో మధ్య తరగతివాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి?ఆ వ్యవస్థపై పెద్దోళ్ల ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని దర్శకుడు ప్రత్యేకించి బలంగా చెప్పదలచుకున్నాడు. ఈ సమస్యను పెద్ద హీరోతోనే చెప్పిస్తే జనాలకు ఎక్కుతుందని దర్శకుడు గ్రహించినట్టున్నాడు. ముందుగా కథ ఇండియాలోనూ, ఆ తర్వాత అమెరికాకు, అక్కడి నుంచి తిరిగి ఇండియాకు మారుతుంది. మహేశ్‌ గతాన్ని ఆవిష్కరిస్తూ సినిమా ప్రారంభమైనా, అసలు కథ అమెరికాలో మొదలవుతంది. అప్పులిచ్చే ఫైనాన్షియర్‌గా మహేశ్‌, చదువుకునే అమ్మాయిగా కళావతి ఇంట్రడ్యూస్‌ అవుతారు. వాళ్లిద్దరికీ, వెన్నెల కిషోర్‌కీ మధ్య సన్నివేశాలు సరదగా సాగిపోతాయి. 90 శాతం జోకులు హిట్టవుతాయి. ఈ నేపథ్యంలో సాగే పాటలు కూడా ఆకట్టుకుంటాయి. ఈ రకంగా మంచి పాటలు, ఫైట్లు, హాస్యంతో.. ఫస్టాఫ్‌ ముగిసిపోతుంది. అప్పు వసూలు చేయడం కోసం మహేశ్‌ ఇండియాకి బయల్దేరడం దగ్గరి నుంచే అసలు కథ మొదలవుతుంది. పది వేల డాలర్లు వసూలు చేయడం కోసం హీరో ఇండియాకి రావడమా అనే సందేహం వచ్చినా…ఆ పాత్ర విధానమే అలా ఉంటుందని అర్థం చేసుకోవాలి. సినిమాలో అలా చాలా సన్నివేశాలు లాజిక్‌ లేకుండానే సాగుతాయి. కాకపోతే ఈ సినిమాలో లాజిక్కులు గురించి అడక్కూడదు. మాస్‌ సినిమా ఇలాగే వుంటుంది. లాజిక్కుల గురించి మాట్లాడుకుంటే, రాజమౌళి సినిమాలేవీ చూడలేం. కమర్షియల్‌ సినిమాలకు లాజిక్కులుండవు. ఆర్ట్‌ సినిమాలు ఎవరూ చూడరు. అందువల్ల లాజిక్కుల గురించి ప్రశ్నించకూడదు. మహేశ్‌ స్టయిల్‌కు అనుగుణంగా కథ రాసుకొని, హీరోని ఎలివేట్‌ చేసుకుంటూ దర్శకుడు పరశురామ్‌ కథను ముందుకు తీసుకుపోయిన శైలి స్పష్టంగా కన్పిస్తుంది. నిజానికి కథలో ఎలాంటి మ్యాజిక్కు లేకపోయినా, రాజేంద్రనాథ్‌ నేపథ్యాన్ని ఆవిష్కరించగానే కథ హీటెక్కుతుంది. కథను ప్రేక్షకులు ముందే ఊహించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ద్వితీయార్థంలో హీరోహీరోయిన్ల సన్నివేశాలు ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉండవు. సామాన్యుడిని ఇబ్బందిపెడుతున్న బ్యాంకింగ్‌ వ్యవస్థ, ఈఎంఐలు, జనం ఆర్థిక విషయాలు, మనుగడ ద్వితీయార్థంలో చూపిస్తారు. ఇవన్నీ చాలా బాగున్నాయి. కథనంలో తేడా వున్నా…విషయం నచ్చుతుంది.

పెర్ఫార్మెన్స్‌ ఎలా వుందో చూద్దామా?

Sarkaru Vaari Paata Review
Sarkaru Vaari Paata Review

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. డైలాగ్‌ డెలివరీ ఇరగదీస్తుంది. మంచి టైమింగ్‌తో ఆకట్టుకుంటాడు. కళావతిగా కీర్తిసురేష్‌ తన అందంతో కట్టిపడేసి, మహేశ్‌కి తగ్గ జోడీ అనిపించింది. మహేశ్‌ పాత్ర రిచ్‌గా వుంటుంది. అందులో అతని కామెడీ మూవ్‌మెంట్లు, స్టయిల్‌, ఫైట్లు అద్భుతంగా వుంటాయి. కీర్తిసురేష్‌ ఆకతాయి అమ్మాయిగా కొత్తగా కనిపిస్తుంది. అందానికి అందం, నటనకు నటన ప్రత్యేకతను చూపిస్తుంది. ఫస్టాఫ్‌ కీర్తి పెర్ఫార్మెన్స్‌కు పూర్తిస్థాయి అవకాశం వుంటుంది. సెకండాఫ్‌లో పెద్దగా ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత లేదని చెప్పవచ్చు. మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ల కెమెస్ట్రీ సూపర్‌గా వుంది. సముద్రఖని ప్రతినాయకుడిగా కనిపించినా…ఆరంభశూరత్వంలా అతని పాత్ర వుంటుంది. ఆ తర్వాత హీరో దెబ్బకు అతని ఎలివేషన్‌ మరుగున పడిపోతుంది. హీరోనే మొత్తంగా కమ్మేస్తాడు. వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు, నదియా, తనికెళ్ల భరణి తదితరులు పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు. సాంకేతిక సిబ్బంది పనితీరు విషయంలో సంగీతం, కెమెరా పనితనం నచ్చాయి. మది కెమెరా పెర్ఫార్మెన్స్‌ అందరికీ నచ్చుతుంది. ఇక ఎస్‌ఎస్‌ తమన్‌ పాటల్లో రెండు పాటలు ముందుగానే జనాల్లోకి వెళ్లిపోయాయి. ధియేటర్‌కొచ్చేసరికి కళావతి, మ..మ..మహేశా పాటలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోరు అదిరిపోయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సహజంగానే ఏ దర్శకుడైనా స్టార్‌లతో సినిమా తీస్తే కచ్చితంగా తన కథ కన్నా స్టార్‌ బలాన్నే నమ్ముకుంటాడు. కొన్ని సందర్భాల్లో కథ బాగున్నా స్టార్‌ బలం లేకుంటే అంశం జనాల్లోకి పోదు. దర్శకుడు పరశురామ్‌ ఎంచుకున్న కథకు మహేశ్‌బాబు సరైన వ్యక్తి అని తీసినట్లుగా ఆఖరి ఫ్రేము వరకు కన్పిస్తుంది. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. పూర్తి ఎంటర్‌టైన్‌మెంటు కోసం ఈ సినిమా చూడాల్సిందేనని చెప్పవచ్చు. ఓటీటీ కోసమో, టీవీ కోసం ఎదురుచూడకుండా వెంటనే చూసేయాల్సిన వినోదాత్మక మూవీ అని గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్‌గా ఆలోచిస్తే…సర్కారువారి పాట ఫుల్‌ సమ్మర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. (Story: సర్కారువారి పాట అసలు రివ్యూ…వీడియోతో సహా!)

రివ్యూ…వీడియో

See Also: 

అధికారులపై పెట్రోల్ దాడి-వైర‌ల్ వీడియో

కేసీఆర్‌పై మోదీ కక్షసాధింపు షురూ!

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు కారణమిదే!

మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళనే!

చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు

పవర్‌స్టార్‌..ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో చెప్పాలి!

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?

ఆ భయంతోనే జగన్‌ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు

దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత

అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1