UA-35385725-1 UA-35385725-1

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు కారణమిదే!

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు కారణమిదే!

10th Exams Paper Leakage: ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల చైర్మన్‌ పొంగూరు నారాయణను ఆంధ్రప్రదేశ్‌ సీబీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. టెన్త్‌ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణను అరెస్టు చేయడం కలకలం రేపింది. ఈ వివాదం కొత్త మలుపు తిరిగినట్లయింది. అయితే దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ కక్షసాధింపు చర్యగా నారాయణను అరెస్టు చేశారా? లేక నిజంగానే నారాయణ పాత్ర లీకేజీలో వుందా అన్నది తేలాల్సివుంది. నారాయణను, ఆయన సతీమణి రమాదేవిని నారాయణ కారులోనే హైదరాబాద్‌ నుంచి అధికారులు ఏపీకి తరలించారు. సాయంత్రం 6 గంటల సమయానికి కారు కడప జిల్ల దాటింది. అయితే.. తెలంగాణ, ఆంధ్రా సరిహద్దులో నారాయణ తరలింపు వ్యవహారం వివాదాస్పదమైంది. చిత్తూరు పోలీసులు తెలంగాణ పోలీసులకు చెప్పకుండానే ఆయనను అదుపులోకి తీసుకొని, ఆంధ్రాకు తరలించడానికి రంగం సిద్ధం చేశారు. ఈ విషయం తెలిసిన తెలంగాణ పోలీసులు ఆ వాహనాన్ని ఆపారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గర ఏపీ సీఐడీ అధికారులను తెలంగాణ పోలీసులు నిలిపివేశారు. ప్రస్తుతం తెలంగాణ పోలీసులతో ఏపీ సీఐడీ అధికారులు చర్చించారు. నారాయణ అరెస్ట్‌పై తమకు ముందుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదని సీఐడీని పోలీసులు ప్రశ్నించారు. అయితే.. ఈ క్రమంలో తమ దగ్గరనున్న నారాయణ అరెస్ట్‌ వారెంట్‌ను పోలీసులకు.. ఏపీ సీఐడీ చూపగా ఈ వివాదం ఇంతటితో ముగిసింది. కాగా.. ఈ చర్చలు ముగియడంతో నారాయణను ఏపీ తరలింపునకు సీఐ బాలరాజు అనుమతిచ్చారు. అనంతరం ఏపీ పోలీసులు ఆయనను చిత్తూరుకు తరలించారు.

నారాయణ అరెస్టుకు కారణాలు వివరించిన చిత్తూరు ఎస్పీ

Chittoor SP Pressmeet: నారాయణను హైదరాబాద్‌ నుంచి చిత్తూరుకు తరలించిన వెంటనే జిల్లా ఎస్పీ నిశాంత్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, నారాయణ అరెస్టు వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని పరోక్షంగా చెప్పారు. అలాగే, ఆయన సతీమణిని అరెస్టు చేసినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండిరచారు. తాము ఆమెను అరెస్టు చేయలేదని, కాకపోతే నారాయణతోపాటు ఆమె కూడా అదే వాహనంలో చిత్తూరుకు చేరుకున్నారని వివరించారు. అంతకుముందు లీకేజీ కేసులో అరెస్టు అయిన వారంతా నారాయణతో కలిసి పనిచేసేవాళ్లేనని తెలిపారు. టెన్త్‌ ప్రశ్న పత్రాల లీకేజీని పకడ్బంధీగా నిర్వహించిన కేసులో నారాయణ పాత్ర పూర్తిగా వుందని తేల్చిచెప్పారు. ఆయన పాత్ర లేకుండా ఆయనను అరెస్టు చేయడం సాధ్యం కాదని చెప్పారు. పైగా ఆయన నారాయణ విద్యాసంస్థల చైర్మన్‌ అని అన్నారు. అందుకే అరెస్టు చేశామన్నారు. ‘‘నారాయణలో అడ్మిషన్స్‌ పెంచుకునేందుకు వీలుగా ఈ విద్యాసంస్థల యాజమాన్యం పథకం ప్రకారం మాల్‌ ప్రాక్టీసుకు పాల్పడుతుంది. ముందుగా నారాయణలో విద్యార్థులను రెండు విభాగాలుగా విభజిస్తారు. వారు ఏ సెంటర్లలో పరీక్ష రాస్తారో తెలుసుకుంటారు. హెడ్డాఫీసు నుంచి కీ రాగానే, దాన్ని పరీక్ష కేంద్రాల్లో తాము ముందుగానే నియమించుకున్న తమ మనుషులతో సమన్వయం చేసుకుంటారు. సమాధానపత్రాలను బయటి నుంచి లోపలికి పంపించి, పద్ధతి ప్రకారం మాల్‌ప్రాక్టీసుకు పాల్పడుతారు. ఇన్విజిలేట‌ర్ల‌కు డ‌బ్బులిచ్చి లొంగ‌దీసు కుంటారు. ఎగ్జామ్ హాలులో పేప‌రు ఇవ్వ‌గానే వాట్సాప్‌లో ప్ర‌శ్న‌ప‌త్రం బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. వెంట‌నే ఆన్స‌ర్లు లోప‌లికి వెళ్లిపోతాయి…ఇదీ క‌థ‌! అయితే ఈసారి వారు తొందరపడి ముందుగానే ప్రశ్నపత్రాలను లీక్‌ చేయడంతో అసలు విషయం బట్టబయలైంది. నారాయణ, తదితర నిందితులపై ఐపీసీ సెక్షన్లు 408, 409 కింద కేసులు పెట్టాం. కేసు రుజువైతే వారికి పదేళ్ల దాకా జైలుశిక్ష పడుతుంది’’ అని ఎస్పీ నిశాంత్‌ రెడ్డి వివరించారు. గత నెల 27వ తేదీన చిత్తూరులో ఆంగ్ల పరీక్ష పత్రం లీకేజీ అయిన విషయం విదితమే. ఆ తర్వాత కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ పేపరు లీకేజీలయ్యాయి. (Story: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌కు కారణమిదే!)

See Also: 

మీడియా రంగాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళనే!

చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు

పవర్‌స్టార్‌..ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో చెప్పాలి!

మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితేమిటి?

ఆ భయంతోనే జగన్‌ అందరి కాళ్లూ పట్టుకుంటున్నారు

దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత

అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1