UA-35385725-1 UA-35385725-1

దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత

దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత

షహీన్‌బాగ్‌ అక్రమకట్టడాల కూల్చివేతలపై ఎదురుతిరిగిన జనం

Shaheen Bagh: దేశరాజధాని దిల్లీలో బీజేపీ బుల్డోజర్లు జనంపైకి బయలుదేరాయి. దిల్లీలోని షాహీన్‌బాగ్‌ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు బీజేపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు దక్షిణ దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎస్‌డీఎంసీ) చర్యలు ప్రారంభించింది. అయితే జనం తిరగబడ్డారు. పోలీసులు బలప్రయోగానికి సిద్ధపడ్డారు. అయితే వారు వెనక్కి తగ్గలేదు. దీంతో పారామిలటరీని కూడా దించారు. ఈ పరిస్థితుల్లో ఉద్రిక్తత నెలకొన్నది. నిజానికి దిల్లీలోని ఆప్‌ ప్రభుత్వానికి, ఈ కూల్చివేతలకు ఎలాంటి సంబంధం లేదు. అక్కడ ముస్లిమ్‌లు ఎక్కువమంది వున్నారన్న కారణంతో వారిని నిరాశ్రయులను చేయాలన్న ప్రత్యేక పథకంతో కేంద్రం ఈ చర్యలకు పూనుకున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారంనాడు షహీన్‌బాగ్‌ ప్రాంతానికి మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది బుల్డోజర్లను తీసుకొచ్చారు. అయితే ఈ కూల్చివేతను అడ్డుకుంటూ భారీ సంఖ్యలో ప్రజలు ఆందోళనకు దిగారు. దాదాపు లక్షమంది జనం అక్కడకు చేరుకోవడంతో షాహీన్‌బాగ్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఊహించని పరిస్థితి ఎదురుకావడంతో కేంద్రం అర్థసైనిక బలగాలను, సైనిక సిబ్బందిని రంగంలోకి దించింది. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో కూల్చివేత ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. బుల్డోజర్లను అక్కడి నుంచి వెనక్కి పంపించేశారు. సోమవారం ఉదయాన్నే షాహీన్‌బాగ్‌కు బుల్డోజర్లు, జేసీబీలను తరలించారు. అయితే వీటిని చూసిన స్థానికులు, ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ మద్దతుదారులు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. వాహనాలకు అడ్డుగా నిలబడి నిరసన చేపట్టారు. దీంతో ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కొంతమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆప్‌ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌ కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో అక్రమ కట్టడాలను తాము ఇప్పటికే తొలగించామని, అయినా బుల్డోజర్లను పంపించిన భాజపా రాజకీయాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఒక దశలో లాఠీఛార్జీకి పోలీసులు పూనుకున్నారు. కొంతమందికి గాయాలయ్యాయి కూడా. ఇటీవలనే జహంగీర్‌పురిలో అక్రమ కట్టడాల కూల్చివేతకు ఉత్తర దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చర్యలు చేపట్టడానికి యత్నించగా అక్కడ ఘర్షణలు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కూల్చివేత డ్రైవ్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. తాజాగా షాహీన్‌బాగ్‌ వద్ద కూల్చివేతలు చేపట్టాలని నిర్ణయించింది. ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. దిల్లీలోని పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాల కూల్చివేతకు ఎస్‌డీఎంసీ ఇటీవల యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసిన విషయం తెలిసిందే. (Story: దిల్లీలో జనంపైకి బుల్డోజర్లు..తీవ్ర ఉద్రిక్తత)

See Also: 

అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా

భార్య శవంతో 21 ఏళ్లు సహజీవనం!

పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!

80% కేసుల్లో భర్తలే నేరస్తులు

కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!

‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?

మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!

మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్‌…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!

వెంటాడి వేటాడి చంపాడు!

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్సయింది!

ప్రభుదేవా కొరియోగ్రఫీలో మెగాస్టార్ దద్దరిల్లిపోయే పాట!

వివాహేతర సంబంధమే కారణమా?

నైట్‌క్లబ్‌లో రాహుల్‌ గాంధీ.. వీడియో వైరల్‌

కేసీఆర్‌కు 20కిమించి సీట్లు రావు

తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు

లైవ్‌లో రభస: హీరోని గెటవుట్‌ అన్న టీవీ9 యాంకర్‌!

కేఏ పాల్‌పై దాడి

సర్కారువారి పాట ట్రైలర్‌ అదిరింది! (Video)

పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!

భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్‌!

చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!

హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1