ఎమ్మెల్యేపై దాడి! తీవ్ర ఉద్రిక్తత
ఎమ్మెల్యేపై దాడి! ఏలూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
Attack on MLA: పూర్వ పశ్చిమగోదావరి జిల్లా ప్రస్తుత ఏలూరు జిల్లాలో శనివారంనాడు అనూహ్యమైన రీతిలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై.. సొంతపార్టీ నేతలే దాడి చేయడంతో ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైకాపా నాయకుడు గంజి ప్రసాద్ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన వైకాపా నాయకుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గోపాలపురం వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వెళ్లారు. ఈ క్రమంలో కొందరు వైకాపా కార్యకర్తలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గ్రామంలోని వైకాపాలో ఇరువర్గాలు ఉన్నాయని.. అందులో ఓ వర్గానికి ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడం వల్లే గంజి ప్రసాద్ హత్య జరిగిందని మరో వర్గం ఆరోపిస్తోంది. అందువల్లే ఎమ్మెల్యేపై దాడికి దిగినట్లు సమాచారం.
గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన వైకాపా ఎమ్మెల్యేను.. పార్టీలోని ఓ వర్గం అడ్డుకుంది. కొందరు కార్యకర్తలు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి చేశారు. వెంటనే పోలీసులు ఎమ్మెల్యేకు రక్షణగా నిలబడి.. పక్కకు తీసుకెళ్లారు. అయినా.. కొందరు వైకాపా నేతలు, కార్యకర్తలు వెంటపడి మరీ.. ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు. ఎమ్మెల్యే వెంకట్రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పోలీసులు ఆయనను ఉంచిన చోట ఆందోళనకు దిగారు. దీంతో.. గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాళ్లు రువ్వడంతో పోలీసులకు గాయాలయ్యాయి.
మొదటి నుంచీ జి కొత్తపల్లిలో ఒకే పార్టీలో రెండు వర్గాలుగా ఉంటున్నాయి. వీరంతా వైసీపీవారే. ఒక వర్గం మరోవర్గానికి చెందిన ఒక నాయకుడిని అతి కిరాతకంగా చంపివేశారు. ఎమ్మెల్యే ఒక వర్గం తో కుమ్మక్కయి ఈ హత్య చేయించాడటూ గ్రామస్తులు శవాన్ని చూడటానికి వచ్చిన ఎమ్మెల్యే పై దాడికి దిగారు. గ్రామస్తులు రాళ్లు విసురడంతో ఇద్దరు ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ఇంకా గ్రామస్తుల వలయంలో ఎమ్మెల్యే బయటకు రాలేని పరిస్థతి ఏర్పడింది. మరోవైపు పోలీస్ వాహనాలకు గ్రామస్తులు గాలి తీశారు. ఈ తోపులాటలో ఓ గ్రామస్తునికి చేయి విరిగింది. రాత్రి వరకు గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నది. (Story: ఎమ్మెల్యేపై దాడి! తీవ్ర ఉద్రిక్తత)
See Also:
హీరోయిన్‌పై రేప్ కేసు…పరారీలో యాక్టర్!
ప్రద్మశ్రీ గ్రహీతకు ఏమిటీ ఖర్మ!
విడదల రజనీ గ్రాండ్ పార్టీలో ఎవరామె?
చదివింది మల్టీమీడియా…చేసేవి దొంగతనాలు!
కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చిన ప్రశాంత్ కిశోర్…ఎందుకంటే?
అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు
మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి: ఏ పార్టీలో చేరుతారంటే?
17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి
భద్రాచలానికి రైలు…ఏపీని టచ్ చేయదు!
ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!
మద్యం ప్రియులకు మరో మత్తకబురు!
డ్యాన్స్ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?
మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైరల్)
ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు
వర్క్ ఫ్రమ్ హోమ్ : పేలిన ల్యాప్‌టాప్
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి