UA-35385725-1 UA-35385725-1

కేసీఆర్ ఫ్రంట్ పేరు బీఆర్ఎస్!

కేసీఆర్ ఫ్రంట్ పేరు బీఆర్ఎస్!

TRS: తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌) ప్లీన‌రీ బుధ‌వారంనాడు హైద‌రాబాద్‌లో విజ‌య‌వంతంగా ముగిసింది. టీఆర్ఎస్ అధినేత కే.చంద్ర‌శేఖ‌ర్‌రావు స్ఫూర్తిదాయ‌క‌మైన ప్ర‌సంగం చేసి కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్తేజితుల్ని చేశారు. త‌న‌దైన శైలిలో ప‌దునైన మాట‌ల తూటాల‌తో కేంద్ర ప్ర‌భుత్వంపై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. బీజేపీ పాల‌న‌లో దేశం క‌ష్టాల‌పాలైంద‌న్నారు. గ‌వ‌ర్న‌ర్ల‌ను త‌మ చెప్పు చేతుల్లో పెట్టుకొని నియంతృత్వ పాల‌న కొన‌సాగిస్తున్నార‌ని ఆరోపించారు. అప్ప‌ట్లో ఎన్టీఆర్‌పై గ‌వ‌ర్న‌ర్ల‌ను ప్ర‌యోగించి, దుర్మార్గ‌మైన పాల‌న సాగించార‌ని, ఇప్పుడు అదే రీతిలో మోదీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. మ‌తోన్మోదాన్ని రెచ్చ‌గొట్టే విధంగా మోదీ పాల‌న సాగుతోంద‌ని, దేశంలో అభివృద్ధి కుంటుప‌డుతోంద‌ని, మ‌త క‌ల్లోలాలు మాత్రం ఎన్న‌డూ లేనివిధంగా పెరిగిపోతున్నాయ‌ని అన్నారు. జాతిపిత మ‌హాత్మాగాంధీని విమ‌ర్శిస్తున్నార‌ని, ఇదే బీజేపీ వారు భార‌త స్వాతంత్య్రానికి ఇస్తున్న విలువ అని అన్నారు. మ‌రోవైపు గాంధీని చంపిన గాడ్సేను పొడుతున్నార‌ని, వారి నైజ‌మేంటో బ‌ట్ట‌బ‌య‌లైంద‌ని చెప్పారు. మోదీ పాల‌న కార‌ణంగా రైతులు క‌ష్టాల పాల‌య్యార‌ని చెప్పారు. దేశంలో అత్య‌వ‌స‌రంగా బీజేపీకి వ్య‌తిరేకంగా, ప్ర‌త్యామ్నాయంగా ఒక సంఘ‌ట‌న అవ‌స‌ర‌మ‌ని పిలుపునిచ్చారు. అయితే మ‌న‌కు కావాల్సింది రాజ‌కీయ ఫ్రంట్‌లు కాద‌ని, ప్ర‌త్యామ్నాయ అజెండా అని సూచించారు. ప్ర‌త్యామ్నాయ అజెండా ద్వారా ప్ర‌త్యామ్నాయ శ‌క్తి ఉద్భ‌విస్తుంద‌న్న‌ట్లుగా ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఒక‌ప్పుడు తెలంగాణ గురించి మాట్లాడితే తిన్న‌ది అర‌గ‌ట్లేదా అని త‌న‌ను తిట్టార‌ని, ఇప్పుడేమందో అంద‌రికీ తెలుసున‌ని అన్నారు. అలాగే జాతీయ ప్ర‌త్యామ్నాయంగా గురించి చెపుతుంటే అవ‌హేళ‌న చేస్తున్నార‌ని, కానీ అది అత్య‌వ‌స‌ర‌మ‌ని, వ‌చ్చి తీరుతుంద‌ని, హైద‌రాబాద్ కేంద్రంగా వ‌స్తే ఇంకా మంచిద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి త‌ర‌హాలోనే భార‌త రాష్ట్ర‌ స‌మితి (బీఆర్ఎస్‌) అనే ప్ర‌తిపాద‌న ఒక‌టి వ‌చ్చింద‌ని చెప్పారు. కాక‌పోతే రాజ‌కీయ అజెండాల కోసం అన్వేషించాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. (Story: కేసీఆర్ ఫ్రంట్ పేరు బీఆర్ఎస్!)

See Also: 

కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండిచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌…ఎందుకంటే?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి: ఏ పార్టీలో చేరుతారంటే?

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

భద్రాచలానికి రైలు…ఏపీని టచ్‌ చేయదు!

ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1