ప్రద్మశ్రీ గ్రహీతకు ఏమిటీ ఖర్మ!
Padma Sri Awardee: భారత పద్మశ్రీ గ్రహీతకు మోదీ ప్రభుత్వ హయాంలో అనుకోని దుస్థితి ఎదురైంది. ప్రభుత్వ వసతి గృహంలో ఉంటున్న 90 ఏళ్ల ఒడిస్సీ నృత్యకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీతను కేంద్ర ప్రభుత్వం తన ఇంటి నుంచి బలవంతంగా ఖాళీ చేయించడంతో ఆ కుటుంబం అనూహ్యమైన రీతిలో నడిరోడ్డుపై నిలబడిరది. అ అమానవీయ ఘటన కన్నీళ్లు తెప్పిస్తున్నది. ప్రముఖ నృత్యకారుడు గురు మయుధర్ రౌత్ గత కొన్నేళ్లుగా ఢల్లీిలోని ఏషియన్ గేమ్స్ విలేజ్‌లో ప్రభుత్వం కేటాయించిన వసతి గృహంలో ఉంటున్నారు. ఆయనతోపాటు పలువురు ప్రముఖ కళాకారులు సైదÊ ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్నారు. అయితే వీరికి కేటాయించిన వసతుల్ని 2014లో రద్దు చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేయగా, ఈ కళాకారులంతా కోర్టును ఆశ్రయించారు. అయితే వీరు కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. కేసు ఓడిపోయింది. ఇక చేసేదేమీ లేక చాలామంది కళాకారులు బంగళాలను ఖాళీ చేసి వెళ్లిపోయారు. మిగిలిన వారిని ఏప్రిల్ 25లోగా ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే మయుధర్ రౌత్ తాను ఉంటున్న బంగళాను ఖాళీ చేయకపోవడంతో అధికారులు వచ్చి బలవంతంగా ఖాళీ చేయించారు. ఇంట్లోని సామానంతా రోడ్డున పడేశారు. ఆఖరికి పద్మశ్రీ పురస్కార పత్రం కూడా రోడ్డుపైనే పడవేశారు. ఇలా అతని సామాన్లను రోడ్డుపై కనిపించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీంతో కేంద్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. వారిని ఖాళీ చేయించాలన్న ఆర్డర్ వుండివుండవచ్చు. కానీ ఈ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరంగా వుందని విమర్శలు విన్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరుపై మయుధర్ కుమార్తె మధుమితా రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడాయన బ్యాంక్ ఖాతాలో కేవలం 3,000 రూపాయలు మాత్రమే వున్నాయని, ఆయన పరిస్థితి ఎలా వుంటుందో అర్ధం కావడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన నాట్యంతో ఎన్నో సేవలందించిన మా నాన్నకి ఇలాంటి అవమానం జరగడం బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు. నిజానికి ప్రభుత్వ వసతి గృహాల్లో ఉన్న 8 మంది కళాకారులకు ఇల్లు ఖాళీ చేయడానికి వారికి మే 2 వరకు గడువు ఇచ్చినట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అలాంటప్పుడు ఆ సమయం వరకు ఆగకుండా ఇలా ఒక గొప్ప వ్యక్తిని రోడ్డున పడేయడం ఎంత వరకు సబబు అని విమర్శలు విన్పిస్తున్నాయి. (Story: ప్రద్మశ్రీ గ్రహీతకు ఏమిటీ ఖర్మ!)
See Also:
విడదల రజనీ గ్రాండ్ పార్టీలో ఎవరామె?
చదివింది మల్టీమీడియా…చేసేవి దొంగతనాలు!
కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చిన ప్రశాంత్ కిశోర్…ఎందుకంటే?
అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు
మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి: ఏ పార్టీలో చేరుతారంటే?
17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి
భద్రాచలానికి రైలు…ఏపీని టచ్ చేయదు!
ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!
మద్యం ప్రియులకు మరో మత్తకబురు!
డ్యాన్స్ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?
మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైరల్)
ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు
వర్క్ ఫ్రమ్ హోమ్ : పేలిన ల్యాప్‌టాప్
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి