నరాలు తెగే ఉత్కంఠ : చెన్నైని గెలిపించిన ధోనీ
IPL: నరాలు తెగే ఉత్కంఠ…ఆఖరి బంతి వరకూ గెలుపు ఎవరిదో తెలియని పరిస్థితి…హోరాహోరీ పోరులో చివరకు ముంబయి ఇండియన్స్ మరోమారు పరాజయం పాలైంది. చెన్నై సూపర్‌కింగ్స్ ఉత్కంఠపోరులో విజయం సాధించింది. ముంబయి వరుసగా ఏడవ పరాజయాన్ని చవిచూసింది. ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం జరిగిన కీలకమైన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ 3 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి155 పరుగులు చేయగా, చెన్నై సూపర్‌కింగ్స్ అంతే ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. చివరి బంతి వరకూ ఉత్కంఠ నెలకొన్నది. ఆఖరి బంతిని మహేంద్రసింగ్ ధోనీ బౌండరీకి తరలించడంతో చెన్నై జట్టు విజయం సాధించింది. ఒక బంతి నాలుగు పరుగులు చేయాల్సి వుండగా, ధోనీ ఆ బంతిని బౌండరీకి తరలించాడు. ధోనీ తన కెరీర్‌లో ఇలాంటి ఒత్తిళ్లను లెక్కలేనన్ని ఎదుర్కొన్నాడు. ఈ ఐపీఎల్‌లో ఇంత టైట్ మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి.
156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్ (0) వికెట్టును కోల్పోయింది. ఆ తర్వాత శాంట్నర్ (11) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో రాబిన్ ఉతప్ప (30), అంబటి రాయుడు (40)లు క్రీజ్ వద్ద నిలబడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వారు నిష్క్రమించాక మళ్లీ చెన్నై కష్టాల్లో పడిరది. ఆఖరులో ధోనీ (28 నాటౌట్), డ్వాయిన్ ప్రిటోరియస్ (22)లు రాణించి జట్టును గెలుపు దిశగా తీసుకువచ్చారు. అయినప్పటికీ, ఆఖరి ఓవర్ ఆరంభంలో ప్రిటోరియస్ అవుట్ కావడంతో సీఎస్‌కేకు దెబ్బపడిరది. అప్పటికి చెన్నై స్కోరు 139 పరుగులు. ఆఖరి 5 బంతుల్లో చెన్నై 17 పరుగులు చేయాల్సి వుంది. ఈ తరుణంలో బ్రేవో ఒక పరుగు తీసి ధోనీకి బ్యాటింగ్ ఇచ్చాడు. జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్‌లో ఆఖరి నాలుగు బంతులను ధోనీ వరుసగా 6, 4, 2, 4 పరుగులతో విజయానికి అవసరమైన 16 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ధోనీకి ఎవరూ సాటిలేరని, ధోనీ ధోనీయేనని మరోసారి నిరూపించుకున్నాడు. ముంబయి బౌలర్లలో డేనియల్ శామ్స్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఉనాద్కట్ రెండు వికెట్లు, మెరిడిత్ ఒక వికెట్టు సాధించారు.
అంతకుముందు సీఎస్‌కే టాస్ గెలిచి ముందుగా ముంబయి ఇండియన్స్‌కు బ్యాటింగ్ అప్పగించారు. అసలే తీవ్రమైన ఒత్తిడిలో వున్న రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు పరుగులేమీ చేయకుండా ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో జీరోలకే నిష్క్రమించారు. డేవాల్డ్ బ్రేవిస్ కూడా 4 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ (32), తిలక్ వర్మ (51)లు ఇన్నింగ్స్ పతనాన్ని నిలపగలిగారు. ముఖ్యంగా తిలక్‌వర్మ ఆఖరి బంతి వరకూ నిలిచి అజేయంగా వున్నాడు. అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను కొట్టిన చూడముచ్చటైన రెండు సిక్సర్లు కూడా అలరించాయి. ఉనాద్కట్ కూడా ఆఖరులో ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో 9 బంతుల్లోనే 19 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సీఎస్‌కే బౌలర్లలో ముఖేష్ చౌదరి మూడు వికెట్లు, బ్రేవో రెండు వికెట్లు, శాంట్నర్, తీక్షణలు చెరొక వికెట్టు సాధించారు. (Story: నరాలు తెగే ఉత్కంఠ : చెన్నైని గెలిపించిన ధోనీ)
See Also:
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రెండు రోజులుగా మానసిక వికలాంగురాలిపై…!
ఏపీలో కారు కలకలం: సీఎం సీరియస్ : ఇద్దరు సస్పెన్షన్
అమ్మాయి కావాలని కోరితే…ఇళ్లల్లో వచ్చి మహిళలను ఎత్తుకుపోతారా?
ఇలా అయితే…మళ్లీ మనం ప్రతిపక్షంలోనే!
ఈ సెలబ్రిటీల పెళ్లి మన స్టయిల్లో ఉంటుందట!
ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
పేద యువతులే టార్గెట్ : రియల్ వ్యాపారి వ్యభిచారం
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు
వర్క్ ఫ్రమ్ హోమ్ : పేలిన ల్యాప్‌టాప్
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. చావుబతుకుల మధ్య కొత్త జంట
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
కేసీఆర్ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు
కేజీఎఫ్: ఛాప్టర్ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
విజయ్ ‘బీస్ట్’ మూవీ పెర్‌ఫెక్ట్ రివ్యూ!
ఇకపై హైదరాబాద్ శివారు భూములు బంగారమే!
పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్