ఏపీలో కారు కలకలం: సీఎం సీరియస్ : ఇద్దరు సస్పెన్షన్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడప్పుడూ ఇలాంటి విచిత్రమైన సంఘటనలు జరుగుతూ వుంటాయి. సీఎం కాన్వాయ్‌కు కారు అవసరమని చెప్పి దారిలో పోతున్న ఒకతని కారును లాక్కెళ్లుపోయిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఒంగోలులో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో సీఎం కాన్వాయి కోసం కారు కావాలంటూ ఇన్నోవాలో కుటుంబ సభ్యులతో తిరుమల వెళ్తున్న వేముల శ్రీనివాస్ అనే భక్తుడి కారును ఆపి ఆర్టీఏ అధికారులు బలవంతంగా తీసుకెళ్లారు. ఏపీలో ఇలాంటివి కూడా జరుగుతాయా అని ఆంతా ఆశ్చర్యపోయారు. రాష్ట్రంలో రౌడీయిజం రాజ్యమేలుతుందా? లేక అధికారులు భయంభయంగా బతుకుతున్నారా? ఏంటో తెలియడం లేదని ప్రతిపక్ష నేతలు దుయ్యబట్టారు.
అర్థరాత్రి పిల్లలతో ఇబ్బంది పడతామని చెప్పినా వినిపించుకోకుండా కారును తీసుకెళ్లడంతో అర్థరాత్రి రోడ్డుపై శ్రీనివాస్ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ ఘటనపై పలు విమర్శలు రావడం.. సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ ఘటనకు బాధ్యులైన హోంగార్డు పి. తిరుపతిరెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎ.సంధ్యను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీచేసింది.
పల్నాడు జిల్లా వినుకొండ నుండి వేముల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఇన్నోవాలో వెళ్తున్నారు. బుధవారం రాత్రి 10గంటలకు అద్దంకి బస్టాండ్ వద్ద కారు ఆపి టిఫన్ చేసేందుకు దిగారు. ఒంగోలు ఆర్టీఏ పోలీసులు ఇన్నోవా వద్దకువెళ్లి సీఎం కార్యక్రమానికి కాన్వాయ్ కోసం డ్రైవర్ పాటు కారు కావాలంటూ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా అవాక్కయిన వేముల శ్రీనివాస్ మేము తిరుపతికి దర్శనకోసం వెళ్తున్నామని, తమది ఈ ప్రాంతం కాదని, తమను ఇబ్బంది పెట్టొద్దని ఆర్టీఏ పోలీసులను వేడుకున్నప్పటికీ.. మరో వెహికిల్ కూడా లభించే పరిస్థితి లేదంటూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము ఇలా చేయాల్సి వస్తుందంటూ డ్రైవర్‌తో సహా ఇన్నోవా కారును తీసుకెళ్లారు.
దీంతో వేమూరి శ్రీనివాస్ కుటుంబ సేప్టీ కోసం ఆర్టీసీ బస్టాండ్లోనే ఉంటే ఆర్టీఏ అధికారుల నుండి ఇంకేం ఇబ్బందులు వస్తాయేమోననే భయంతో తిరుపతికి అద్దెకు కారును మాట్లాడుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్దకు కాకుండా సిటీ శివారులోని హైవేపై ఉన్న సంఘమిత్ర హాస్పటల్ వద్దకు రావాలని డ్రైవర్‌కు సూచించడంతో, సంఘమిత్ర హాస్పటల్ వద్దకు అద్దె కారు రావడంతో కుటుంబ సమేతంగా నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లారు. ఈ విషయంపై బాధితుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కారు అద్దె చెల్లించేందుకు డబ్బులు లేక పోవడంతో తన బంధువులకు ఫోన్ చేసి డబ్బులను తమ అకౌంట్లోకి వేయించుకోవాల్సిన దుస్థితి తమకు ఎదురైందంటూ భాదితుడు శ్రీనివాస్ వాపోయారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ కావడంతో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. (Story: ఏపీలో కారు కలకలం: సీఎం సీరియస్ : ఇద్దరు సస్పెన్షన్)
See Also:
ఇలా అయితే…మళ్లీ మనం ప్రతిపక్షంలోనే!
ఈ సెలబ్రిటీల పెళ్లి మన స్టయిల్లో ఉంటుందట!
ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
పేద యువతులే టార్గెట్ : రియల్ వ్యాపారి వ్యభిచారం
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు
వర్క్ ఫ్రమ్ హోమ్ : పేలిన ల్యాప్‌టాప్
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన ప్రీ వెడ్డింగ్ షూట్.. చావుబతుకుల మధ్య కొత్త జంట
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
కేసీఆర్ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు
కేజీఎఫ్: ఛాప్టర్ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
విజయ్ ‘బీస్ట్’ మూవీ పెర్‌ఫెక్ట్ రివ్యూ!
ఇకపై హైదరాబాద్ శివారు భూములు బంగారమే!
పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్