Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌రాక్ష‌స‌త్వం ఆవ‌హించిన వేళ‌...!

రాక్ష‌స‌త్వం ఆవ‌హించిన వేళ‌…!

రాక్ష‌స‌త్వం ఆవ‌హించిన వేళ‌…!

  • రంపంతో కిరాత‌కంగా బాలిక‌ను కోసి చంపిన దుండ‌గుడు
  • ప‌ట్ట‌ప‌గ‌లు పాఠ‌శాల‌లోనే ఘ‌ట‌న‌
  • విద్యార్థిని గోపికపై విచక్షణారహితంగా దాడి
  • రక్తపు మడుగులో విగతజీవిగా బాలిక‌
  • మరో విద్యార్థిని లక్ష్మికి కాళ్లకు తీవ్ర గాయాలు
  • అనంత‌పురం జిల్లా రాప్తాడు ఉన్నత పాఠశాలలో సంఘటన

న్యూస్‌తెలుగు/రాప్తాడు: మాన‌వ‌త్వం మ‌రిచిన వేళ‌…రాక్ష‌స‌త్వం ఆవహించిన క్ష‌ణాన‌..ఓ న‌ర‌రూప‌రాక్ష‌సుడు ప‌దో త‌ర‌గ‌తి బాలిక‌ను రంపంతో క్రూరంగా కోసికోసి చంపిన ఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలో భ‌యోత్పాతాన్ని సృష్టించింది. స్కూలు ప్రాంగణంలో ప్రార్థన చేసుకుని తరగతి గదిలోకి వచ్చిన విద్యార్థులు ఒకరినొకరు పలకరించుకుంటూ కూర్చున్న స‌మ‌యంలో ఆ రాక్ష‌సుడు ఈ ఊచ‌కోత‌కు పాల్ప‌డ్డాడు. అనంత‌పురం జిల్లా రాప్తాడు మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన ముదగ నరసమ్మ, వెంకటరాముడు దంపతుల కుమార్తె గోపిక పదవ తరగతి చదువుతోంది. ప్రైవేటు చేర్పించి ఖర్చులు భరించలేక ద్రాక్ష తోటల కోత‌కు వెళ్లేవారు. గోపిక సోదరుడు ఇందు వర్ధన్ భవన నిర్మాణాల కడ్డీల పనికి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో 10వ తరగతి తరగతి గదిలో మొదటి పీరియడ్ పూర్తి కాగానే రెండో పీరియడ్ ప్రారంభమైంది. అయితే అత్యంత బాధాకరమైన హృదయవిదారక ఘటన శుక్రవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో ఈ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాలలో టీచరు పాఠాలు చెబుతుండగానే ఉన్నఫలంగా ఓ దుండగుడు పాఠశాల గేటు తోసుకుని మొద్దులు కోసే రంపం బ్లేడుతో వడివడిగా అడుగులు వేసుకుంటూ పదవ తరగతి గదిలోకి చొరబడ్డాడు. వెనువెంటనే చార్జింగ్ తో నడిచే ఆ రంపం బ్లేడు యంత్రాన్ని స్టార్ట్ చేసి గదిలోని విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేశాడు. అడ్డొస్తే చంపేస్తానంటూ విద్యార్థులను, క్లాస్ టీచరును బెదిరించాడు. మీరెవరు అని అడిగేలోపే మానవత్వం మరిచిన నరరూప రాక్షసుడు హేమంత్ గోపిక అనే విద్యార్థినిపై దాడిచేసి కోసేశాడు. చెట్లు కోసే ఆ రంపం మిషన్‌తో మొహం మీద, చేతులమీద విచక్షణారహితంగా కోశాడు. దీంతో విద్యార్థిని గోపిక రక్తపు మడుగులో సొమ్మసిల్లి పడిపోయింది. మరో విద్యార్థిని లక్ష్మీ కాళ్లకు గాయాలయ్యాయి. కొంతమంది విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. విద్యార్థులు తేరుకునేలోపే దుండగుడు హేమంత్ ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏం చేయాలో దిక్కు తెలియని విద్యార్థులు, ఉపాధ్యాయినులు పరుగు పరుగున పాఠశాల ప్రాంగణంలోకి బోరున విలపిస్తూ వచ్చారు. విద్యార్థిని ప్రాణాపాయ స్థితిలో ఉంది… ఎవడో దుండగుడు వచ్చి రంపంతో దాడి చేశాడు అని గేటు వద్దకు వచ్చి కాపాడండి కాపాడండి అంటూ పెద్దగా కేకలు వేశారు. పాఠశాల ముందు వైపు వెళ్తున్న కొంతమంది స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థినిని అంబులెన్స్ లో మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా కొంతమంది ఉపాధ్యాయులు ఎన్నికలు డ్యూటీకి కూడా వెళ్లడంతో సిబ్బంది తక్కువగా ఉన్న సమయం చూసి కొన్ని రోజులుగా దుండగుడు హేమంత్ రెక్కీ నిర్వహించి పాఠశాలలోకి చొరబడినట్లు తెలుస్తోంది.

రంగంలోకి క్లూస్ టీమ్‌
ఇదిలాఉండ‌గా, రాప్తాడు ఉన్నత పాఠశాలలో జరిగిన దాడి ఘటనను జిల్లా ఉన్నతాధికారులు సీరియస్ గా పరిగణించింది. పదవ తరగతి విద్యార్థిని గోపికపై జరిగిన తరగతి గదికి చేరుకున్న క్లూస్ టీమ్, ఫింగర్ ఫ్రింట్స్ టీమ్ పాఠశాల గదిలో అణువణువు పరిశీలించింది. మొత్తం 8 బాగాలుగా డివైడ్ చేసి పాయింట్స్ ను సేకరించింది.
చర్మపు ముక్కలు, వెంట్రుకలు పుస్త‌కాలపై రక్తపు మరకలు, తలుపులకు ఫ్రింగర్ ఫ్రింట్స్, రంపం ప్రింట్స్ , నమూనాలను ఫోరెనిక్స్ క్లూస్ టీమ్ సేకరించింది. అలాగే డాగ్ స్వాడ్ తో కూడా పాఠశాల ఆవరణం మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. రంపం బ్లేడ్ కు సంబంధించిన కవర్ ను డాగ్ స్వాడ్ పరిశీలించింది. సిఐలు శ్రీకాంత్ యాదవ్, కరుణాకర్, కౌలుట్లయ్యలు పోలీసు సిబ్బందితో కలిసి పాఠశాలకు చేరుకుని ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించారు.

నిందితుని కోసం పోలీసుల గాలింపు
అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని గోపికపై దాడికి పాల్పడిన నాగలూరు హేమంత్ పై పోలీసులు గాలింపు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు వివిధ మార్గాల్లో అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.

పాఠశాల భద్రతపై తల్లిదండ్రుల అనుమానాలు
రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకున్న ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఫైర్ అయ్యారు. పాఠశాలలో కనీస భద్రత లేదంటూ నిట్టూర్చారు. ప్రైవేటు పాఠశాలలో లక్షల పోసి చదివించలేక కూలినాలీ చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే ఇదేనా మాకు ఇచ్చే బహుమతి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలలకు వస్తే వారు వివరాలు సేకరించాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యంపై లేదా అని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా విద్యాధికారులు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. (Story: రాక్ష‌స‌త్వం ఆవ‌హించిన వేళ‌…!)

Top Stories You Can See

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments