కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ టీజర్ విడుదల
Sammathame: ఎస్.ఆర్. కళ్యాణమండపం ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం `సమ్మతమే. గోపీనాథ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యూజీ ప్రొడక్షన్స్ బేనర్ పై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. ఆదివారం నాడు చిత్ర టీజర్ విడుదలైంది. రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో ఎం.ఎల్.ఎ. రవీందర్ కుమార్ రావత్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సమ్మతమే టీజర్ చూస్తుంటే దర్శకుడు గోపీనాథ్ చిన్న వయస్సులోనే బాగా తీశాడనిపించింది. ఈరోజే తన పుట్టినరోజుకూడా. సంగీతం బాగుంది. హీరోహీరోయిన్లు చక్కగా కుదిరారు. దర్శకుడిగా గోపీనాథ్ మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నానన్నారు.
దర్శకుడు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సినిమాలోని కృష్ణ సత్యభామ, బుల్లెట్ లా సాంగ్ ఆదరణ పొందాయి. మా టీమ్ మంచి సినిమా తీయాలనే తపనతో పనిచేశాం. జూన్ 24 న థియేటర్లలో చూసి ఆనందించండని పేర్కొన్నారు. హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ, నేను ఏ పాత్రైతే అనుకున్నానో దైవనిర్ణయంగా ఆ పాత్ర నాకు వచ్చింది. చక్కటి లవ్‌స్టోరీగా రూపొందింది. కిరణ్, గోపీనాథ్, నేను ముగ్గురం షార్ట్ ఫిలింస్ నుంచే వచ్చాం. శేఖర్ చంద్ర చక్కటి బాణీలు ఇచ్చారు. తర్వాత విడుదల కాబోయే ట్రైలర్ మరింత బాగుంటుందని అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, దర్శకుడు గోపీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా సినిమా నుంచి గ్లింప్స్, రెండు పాటలు విడుదలయ్యాయి. మంచి ఆదరణ పొందాయి. సినిమారంగంలోకి రావాలనే 2017లో హైదరాబాద్ వచ్చినప్పుడు పరిచం అయిన వ్యక్తి గోపీనాథ్. ఇద్దరం షార్ట్ ఫిలింస్ చేశాం. సినిమా తీయాలనే ప్రయత్నాలు చేశాం. ఆ తర్వాత నేను నటించిన `రాజావారు రాణివారు, `ఎస్.ఆర్. కళ్యాణమండపం` విడుదలయి సక్సెస్ కావడంతో ఈ సినిమాపై మరింత బాధ్యత పెరిగింది. దానితోపాటు బడ్జెట్ కూడా పెరిగింది. అయినా క్వాలిటీ విషయంలో రాజీపడకుండా దర్శకుడు కేర్ తీసుకున్నాడు. శేఖర్ చంద్ర సంగీతం చాలా బాగుంది. సతీష్ విజువల్స్ హైలైట్ అయ్యాయి. చాందినీ కూడా షార్ట్ ఫిలింస్ నుంచి వచ్చింది. మా జంట అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని అన్నారు.
సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ, ఈ సినిమా మొదలయ్యాక కిరణ్ రెండు సినిమాలు విడుదలయి విజయం సాధించాయి. ఈ సినిమాలో కృష్ణ సత్యభామ, బుల్లెట్లా సాంగ్స్ కు మంచి ఆదరణ దక్కింది. దర్శకుడు గోపీనాథ్ మొదటి సినిమా అయినా అన్ని విషయాల్లో మిస్టర్ ఫర్‌ఫెక్ట్ గా వున్నాడు. ప్రతి విషయాన్ని కేర్ తీసుకుని చేస్తున్నారు. టీజర్ చాలా ఆసక్తి కరం గా వుంది. చాందినీతో రెండో సినిమా చేస్తున్నాను. ఎడిటర్ విప్లవ్, సతీష్ కెమెరా పనితనం ఇందులో బాగా కనిపిస్తుంది అన్నారు.
నిర్మాత కంకణాల ప్రవీణ తెలుపుతూ, టీజర్‌కు వచ్చిన స్పందనలాగే సినిమాకూ వుంటుందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. సమ్మతమే అని ప్రేక్షకులూ అంటారని ఆశిస్తున్నానని తెలిపారు.
సమర్పకుడు కంకణాల వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఇంజనీరింగ్ చేస్తూనే గోపీనాథ్ షార్ట్‌ఫిలింస్ చేసేవాడు. మా కుటుంబంలో ఎవరికీ సినిమారంగంలో అనుభంలేకపోయినా తను ఇంట్రెస్ట్ చూపాడు. దర్శకుడిగా మంచి కథతో ముందకు వస్తున్నాడు. సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎడిటర్ విప్లవ్, కోడి దివ్య. కెమెరామెన్ సతీష్ మాట్లాడుతూ, చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
తారాగణం: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి తదితరులు.
టెక్నికల్ టీమ్ :
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి
నిర్మాత: కంకణాల ప్రవీణ
బ్యానర్: యూజీ ప్రొడక్షన్స్
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: సతీష్ రెడ్డి మాసం
ఎడిటర్: విప్లవ్ నైషదం
ఆర్ట్ డైరెక్టర్: సుధీర్ మాచర్ల
పీఆర్వో: వంశీ-శేఖర్ (Story: సమ్మతమే టీజర్ విడుదల)
See Also:
లైవ్‌లో రభస: హీరోని గెటవుట్ అన్న టీవీ9 యాంకర్!
సర్కారువారి పాట ట్రైలర్ అదిరింది! (Video)
జగన్ పథకానికి అంతర్జాతీయ పురస్కారం!
కదంతొక్కిన కార్మికన్న: సినీ పరిశ్రమలో తొలిసారి! (ఫోటోలు)
పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!
కలకలం రేపిన తీన్మార్ మల్లన్న కామెంట్స్!
భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్!
ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మర్డర్… పూటకో రేప్!
చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్!
ఎమ్మెల్యేపై దాడి! తీవ్ర ఉద్రిక్తత
హీరోయిన్‌పై రేప్ కేసు…పరారీలో యాక్టర్!
చదివింది మల్టీమీడియా…చేసేవి దొంగతనాలు!
అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు
17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి
మద్యం ప్రియులకు మరో మత్తకబురు!
డ్యాన్స్ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?
మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైరల్)
ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు
వర్క్ ఫ్రమ్ హోమ్ : పేలిన ల్యాప్‌టాప్
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్
రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?
ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?
కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!
ఎన్‌టీఆర్, చరణ్‌లలో డామినేషన్ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి