Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!

చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!

0
AP Telangana
AP and Telangana Politics

చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!

Andhra Politics: ఆంధ్రా రాజకీయాలు చాలా అలెర్ట్‌గా వుంటాయి. ఎవరు ఎవరిపై బురద జల్లుతారా అని నేతలు ఎదురుచూస్తూ వుంటారు. వైసీపీపైన టీడీపీ విరుచుకపడటానికైనా, టీడీపీని వైసీపీ ఎండగట్టడానికైనా గోతికాడ గుంటనక్కల్లాగ ఆ పార్టీల నేతలు కాపుకాస్తారు. ముఖ్యంగా ఆ రెండు పార్టీలకు చెందిన సోషల్‌మీడియా బృందాలు మాత్రం అప్రమత్తంగా వుండటంలో బోర్డర్‌లో మన సైనికునికన్నా గొప్పే అనుకోవాలి. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను కూడా ఏపీలో టీడీపీ తనకు అనుకూలంగా మలచుకొని వైసీపీపై విరుచుకుపడిరది. కేటీఆర్‌ హైదరాబాద్‌లో జరిగిన క్రెడాయ్‌ సమావేశంలో మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రం కన్నా మన రాష్ట్రం (తెలంగాణ) ప్రాతిపదిక సౌకర్యాల కల్పనలో ముందున్నదని చెప్పుకొచ్చారు. అక్కడ రోడ్లు సరిగా లేవని, మంచినీళ్లు, కరెంటు కొరత తీవ్రంగా వుందని, ఆ రాష్ట్రంతో పోల్చితే, తెలంగాణ సూపర్‌ అని కేటీఆర్‌ అన్నారు. నిజానికి కేటీఆర్‌ పొరుగు రాష్ట్రం (పక్క రాష్ట్రం) అనే మాట వాడారే తప్ప ఎక్కడా ఆంధ్రప్రదేశ్‌ అనే పదం ఉపయోగించలేదు. తెలంగాణకు పొరుగు రాష్ట్రమంటే దానర్థం ఒక్క ఏపీనేకాదు…అటువైపు ఉన్న కర్నాటక, ఇంకోవైపున ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలు కూడా తెలంగాణకు అంతోఇంతో సరిహద్దులు కలిగివున్నాయి. అయితే…సాధారణంగా ఏపీ తన పొరుగు రాష్ట్రమంటే తెలంగాణ అని, తెలంగాణ తన పొరుగు రాష్ట్రమంటే ఆంధ్రాగానే భావిస్తారు. కారణమేమిటంటే, ఈ రెండూ ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్రాలే కాబట్టి. పైగా రెండూ తెలుగు రాష్ట్రాలే కాబట్టి.
కేటీఆర్‌ ఆంధ్రా గురించి చెపుతున్నట్లుగా చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ తీవ్రంగా స్పందించింది. కేటీఆర్‌ వ్యాఖ్యలను దాదాపు వైసీపీ మంత్రులంతా తీవ్రంగా ఖండిరచారు. ఆంధ్రాలో అభివృద్ధి లేదనడం, అసలు కరెంటు, నీళ్లే లేవని చెప్పడం విచిత్రంగా వుందని, రోడ్లు సరిగా లేవని అనడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అవసరమైతే..రా…ఆంధ్రా అంతా తిప్పిచూపిస్తామంటూ సవాల్‌ కూడా చేశారు. కేటీఆర్‌ వ్యాఖ్యల పట్ల టీడీపీ వారు మాత్రం సంబరాలు చేసుకున్నారు. సరైన సమయంలో సరైన పాయింట్‌ దొరికిందంటూ వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. కేటీఆర్‌ సరిగ్గానే చెప్పారని, రోడ్లు అధ్వానంగా వున్నాయని దెప్పిపొడిచారు. విద్యుత్‌ సంక్షోభంలో పడిరదని, కృష్ణా, గోదావరి నదుల పక్కనే వున్న నగరాలకు సైతం మంచినీళ్లు సరిగా అందడం లేదని విమర్శలు చేశారు. టీడీపీ నేత నారా లోకేష్‌ ఇంకో ముందడుగు వేసి కేటీఆర్‌ వ్యాఖ్యలతో కూడిన వీడియోను ఏకంగా షేర్‌ చేశారు. కేటీఆర్‌ వీడియోను షేర్‌ చేయడం లోకేష్‌కు ఇదే తొలిసారి. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఇంకో ముందడుగు వేసి కేటీఆర్‌ అన్న వ్యాఖ్యలు నిజమేనని నిరూపిస్తూ చిత్తూరు జిల్లాలో పాడైన రోడ్ల వీడియోను షేర్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ పాలనను ఆంధ్రా టీడీపీ నేతలు ఒక దశలో పొగిడారు కూడా. ఆంధ్రా కంటే తెలంగాణలోనే ఇప్పుడు అభివృద్ధి బాగుందంటూ ప్రశంసించారు. మరోవైపు, కేటీఆర్‌ను విమర్శించిన ఆంధ్రా వైసీపీ నేతలపై తెలంగాణకు చెందిన టీఆర్‌ఎస్‌ మంత్రులు, నాయకులు ఎదురుదాడికి దిగారు. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకుంటున్నట్లు కేటీఆర్‌ ఏదో పొరుగు రాష్ట్రమని ప్రస్తావిస్తే…అది ఆంధ్రానే అన్నట్లుగా విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. పైగా కేటీఆర్‌ అన్నది అక్షరాల నిజమని, ఆంధ్రా కంటే తెలంగాణ అభివృద్ధి అద్భుతమని పేర్కొన్నారు. మొత్తానికి ఏడేళ్ల తర్వాత టీడీపీ, టీఆర్‌ఎస్‌ నేతలు ఒకేమాట మీద నిలబడటం ఇదే మొదటిసారి. కేటీఆర్‌ వ్యాఖ్యల విషయంలో ఇరు పార్టీల నేతలూ ఒక్కటయ్యారు. అప్పుడప్పుడూ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అద్భుతాలు జరుగుతూ వుంటాయన్నమాట! (Story: చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్‌!)

See Also: 

ఎమ్మెల్యేపై దాడి! తీవ్ర ఉద్రిక్త‌త‌

హీరోయిన్‌పై రేప్‌ కేసు…పరారీలో యాక్టర్‌!

ప్రద్మశ్రీ గ్రహీతకు ఏమిటీ ఖర్మ!

ఇంతకీ ఏమిటా రహస్య గది?

విడదల రజనీ గ్రాండ్‌ పార్టీలో ఎవరామె?

చ‌దివింది మ‌ల్టీమీడియా…చేసేవి దొంగ‌త‌నాలు!

కేసీఆర్ ఫ్రంట్ పేరు బీఆర్ఎస్!

కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండిచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌…ఎందుకంటే?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి: ఏ పార్టీలో చేరుతారంటే?

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

భద్రాచలానికి రైలు…ఏపీని టచ్‌ చేయదు!

ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version