UA-35385725-1 UA-35385725-1

మురళీ శర్మ కన్నడ రంగప్రవేశం

జె చంద్రు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న కబ్జా చిత్రంతో మురళీ శర్మ కన్నడ రంగప్రవేశం

Murali Sharma: మురళీ శర్మ తన కన్నడ అరంగేట్రం “కబ్జా”లో “వీర్ బహద్దూర్” అనే పాత్రను పోషిస్తున్నట్లు దర్శకుడు జె చంద్రు వెల్లడించారు.

ఈ చిత్ర తారాగణంలో ప్రముఖ నటులు ఉపేంద్ర, కిచ్చా సుదీప, శ్రియ శరణ్ ఉన్నారు. హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం మరియు మలయాళంలో న‌టించిన‌ మురళీ శర్మ ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలోకి “కబ్జా”తో అరంగేట్రం చేస్తున్నారు. చిత్రనిర్మాతలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల‌వైపు మొగ్గుచూపుతున్నారు. గతంలో కంటే మేక‌ర్స్ కంటెంట్‌పై ఎక్కువ నమ్మకంతో ఉన్నారు. ఇతర పాన్ ఇండియా చిత్రాలకు అనుగుణంగా “కబ్జా” కూడా వాటిలో ఒకటిగా రూపొందుతోంది. ఈ పీరియాడికల్ డ్రామా ప్రకటించినప్పటి నుంచి చిత్రంపై ప‌రిశ్ర‌మ‌లో క్రేజ్ ఏర్ప‌డింది.

మురళి శ‌ర్మ ఇప్ప‌టివ‌ర‌కు 200ల‌కుపైగా చిత్రాలలో నటించారు మరియు త‌న న‌ట‌న‌లో భిన్న‌మైన పార్శాల‌ను చూపిస్తూ ఎల్లప్పుడూ ప్రశంసలు అందుకున్నారు. త‌ను  ప్రధానంగా వెండితెర‌పై పోలీసు పాత్ర పోషించడంలో ప్రసిద్దిగాంచారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర దర్శకుడు జె చంద్రు మాట్లాడుతూ.. “మురళి శ‌ర్మ‌ తెలుగు, హిందీ ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందారు. `అల వైకుంఠపురములో` ఆయన చేసిన పాత్ర ఆయనకు ఎంతో పేరు ప్ర‌ఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. మా సినిమాలో కీలకమైన పాత్రలో నటించేందుకు ఆయనను సంప్రదించాలని నిర్ణయించుకుకోవ‌డానికి ఇదే కారణం. చిత్ర క‌థ‌లో రాజ బహద్దూర్ కుటుంబానికి చెందిన వీర బహద్దూర్ పాత్ర‌ను ఆయ‌న పోషిస్తున్నారు.

దీనిపై మురళి శ‌ర్మ స్పందిస్తూ, “నాకు కన్నడ మాట్లాడటం రాదు కాబట్టి నేను మొదట్లో కొంచెం భయపడ్డాను. క‌న్న‌డ‌లో న‌టించ‌డం అంద‌మైన అనుభూతి క‌లిగింది.  అందుకు క్రెడిట్ అంతా దర్శకుడు జె చంద్రుకే చెందుతుంది.  క‌థ‌లో కీల‌క‌మైన పాత్ర‌తోపాటు  పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్, ఇప్పికే కొన్ని చ‌క్క‌టి స‌న్నివేశాల్లో న‌టించాను.  అవి చాలా బాగా వచ్చాయి, పాత్ర‌ప‌రంగా దర్శకుడు సంతోషంగా ఉన్నాడు కాబట్టి నేనూసంతోషంగా ఉన్నాను  అన్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఒక భారీ షెడ్యూల్‌ను ఇటీవలే పూర్తిచేసిన‌ట్లు ఫిలిం మేక‌ర్స్‌ తెలిపారు. దీంతో దాదాపు 85% సినిమాను పూర్తి చేశాం. మరో భారీ షెడ్యూల్ చేయాల్సివుంది. త‌దుప‌రి షెడ్యూల్‌ దాదాపు 20 రోజుల షూటింగ్ చేయ‌నున్నాం. ఈ షెడ్యూల్లో మరికొందరు కొత్త నటీనటులు పాల్గొన‌నున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని తెలిపారు. (Story: మురళీ శర్మ కన్నడ రంగప్రవేశం)

See Also: 

లేజర్‌ కిరణాలతో విమానాల విధ్వంసం!

నలుగురు పిల్లల్ని కనాల్సిందే!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

మారణాయుధాలతో రౌడీలు హల్‌చల్‌ : 63 మంది అరెస్ట్‌

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. చావుబ‌తుకుల మ‌ధ్య‌ కొత్త జంట

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1