Homeవార్తలుఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాట్సాప్ బ్యాంకింగ్ చానల్ ప్రారంభం

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాట్సాప్ బ్యాంకింగ్ చానల్ ప్రారంభం

పరిశ్రమలోనే తొలిసారిగా ఉజ్జీవన్ వాట్సాప్ బ్యాంకింగ్ చానల్ 900 208 2121 ద్వారా నేరుగా సేవింగ్స్ అకౌంటును తెరిచే సదుపాయాన్ని ప్రవేశపెట్టిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

బెంగళూరు: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఉజ్జీవన్ ఎస్ఎఫ్‌బీ) భారతీయ బ్యాంకింగ్ పరిశ్రమలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా ఖాతాను తెరిచే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. దీనితో బ్యాంకు వాట్సాప్ బ్యాంకింగ్ చానల్ 900 208 2121 ద్వారా నేరుగా సేవింగ్స్ ఖాతాను తెరవచ్చు. విడిగా బ్యాంకింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అర్హులైన కొత్త కస్టమర్లు, వాట్సాప్ ద్వారా ఉజ్జీవన్ ఎస్ఎఫ్‌బీలో సేవింగ్స్ ఖాతాను తీసుకోవచ్చు.

దీని ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది. కొత్త కస్టమరు, బ్యాంకు యొక్క వాట్సాప్ చానల్ 900 208 2121కి ‘Hi’ మెసేజ్ చేసి, ‘ Open Savings Account’ ఆప్షన్‌ని ఎంచుకోవాలి. మొబైల్, PAN ధృవీకరణ తర్వాత వ్యక్తిగత వివరాలు ప్రీ-ఫిల్ కావడం ద్వారా కస్టమరు సీకేవైసీ లేదా ఆధార్ ధృవీకరించబడతాయి. ఆ తర్వాత సేవింగ్స్ ఖాతా వేరియంట్‌ను కస్టమరు ఎంచుకుంటారు. ఖాతాలో నిధులు వేస్తారు. వీడియో కేవైసీని పూర్తి చేస్తారు. వెరిఫికేషన్ అనంతరం ఖాతాను వాడుకోవడాన్ని కస్టమరు ప్రారంభించవచ్చు.

కస్టమర్లకు చిరపరిచితమైన, సురక్షితమైన మాధ్యమం ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ మరియు కస్టమర్ సర్వీసులను వారికి మరింత అందుబాటులోకి తేవాలన్న ఉజ్జీవన్ ఎస్‌ఎఫ్‌బీ వ్యూహంలో భాగంగా ఇది చేపట్టబడింది. వాట్సాప్ ద్వారానే ఆన్‌బోర్డింగ్ మరియు సాధారణ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల, కస్టమర్లు ప్రత్యేకంగా మరో కొత్త ఇంటర్‌ఫేస్ గురించి తెలుసుకోవడం లేదా విడిగా ఇంకో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడంలాంటి బాదరబందీ ఉండదు.

ప్రస్తుతం 15 లక్షల మందికి పైగా బ్యాంకు కస్టమర్లు ఉజ్జీవన్ ఎస్‌ఎఫ్‌బీ వాట్సాప్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాంను ఉపయోగిస్తున్నారు. బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఇటీవలి లావాదేవీలు, అకౌంట్ స్టేట్‌మెంట్లు, డిపాజిట్ సర్వీసులు, రుణ సమాచారం, సర్వీస్ రిక్వెస్ట్‌లు, బ్రాంచ్‌లు మరియు ఏటీఎం లొకేషన్లు మొదలైన వాటితో పాటు 50 పైగా బ్యాంకింగ్ సేవలను కస్టమర్లు పొందవచ్చు.

బ్యాంకు కొత్త కస్టమర్లను చేర్చుకోవడంలో అత్యంత వేగవంతంగా ఎదుగుతున్న మాధ్యమాల్లో వాట్సాప్ బ్యాంకింగ్ కూడా ఒకటిగా ఉంటోంది. బ్యాంకునకు వచ్చే 22 శాతం సర్వీస్ రిక్వెస్ట్‌లను ఉజ్జీవన్ యొక్క వాట్సాప్ బ్యాంకింగ్ నిర్వహిస్తోంది.

“కస్టమర్లకు బ్యాంకింగ్ మరింత సరళతరం కావడంతో పాటు మరింత అందుబాటులోకి వచ్చినప్పుడే ఆవిష్కరణలు మరింత అర్థవంతమైనవిగా మారతాయి. తమ రోజువారీ జీవితాల్లో భాగమైన మాధ్యమం ద్వారానే బ్యాంకు సేవలను కూడా పొందడంలో కస్టమర్లకు ఉజ్జీవన్ యొక్క వాట్సాప్ బ్యాంకింగ్ ఉపయోగపడుతుంది. వాట్సాప్ ద్వారా సేవింగ్స్ అకౌంటును డిజిటల్‌గా తెరిచే వెసులుబాటుతో సంప్రదాయ మాధ్యమాలతో పోలిస్తే కస్టమర్లకు మరింత సౌకర్యవంతమైన, సురక్షితమైన అనుభూతి లభిస్తుంది. బ్యాంకింగ్‌ను మరింత సమ్మిళితమైనదిగా మార్చే దిశగా ఈ వేదికను మేము మరింత పటిష్టం చేస్తాం” అని ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మధ్యంతర సీఈవో మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ Ms. కెరోల్ ఫుర్తాదో (Ms. Carol Furtado) తెలిపారు.

రాబోయే రోజుల్లో జనరేటివ్-ఏఐ-అసిస్టెడ్ సమాధానాలు, పలు అంచెల్లో ఉండే కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు మార్గదర్శకత్వం వహించడం, బహుళభాషల్లో సంప్రదింపులు, సందర్భోచితమైన ప్రోడక్టులకు సంబంధించిన విషయాలు, వాయిస్ ఆధారిత అసిస్టెన్స్ మొదలైన వాటి సాధ్యాసాధ్యాలను ఉజ్జీవన్ ఎస్ఎఫ్‌బీ పరిశీలించడం కొనసాగిస్తుంది.

ఉజ్జీవన్ ఎస్ఎఫ్‌బీ వాట్సాప్ బ్యాంకింగ్‌కు యాక్సెస్:

కస్టమర్లు 900 208 2121 నంబరును సేవ్ చేసుకుని వాట్సాప్‌ ద్వారా “Hi” అని మెసేజ్ చేయడం ద్వారా ఉజ్జీవన్ ఎస్ఎఫ్‌బీ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. (Story: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాట్సాప్ బ్యాంకింగ్ చానల్ ప్రారంభం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments