Homeవార్తలుఅమెజాన్ పే ‘ఇంపాజిబుల్ ట్రావెల్ డీల్స్ 2026’లో భారీ తగ్గింపులు

అమెజాన్ పే ‘ఇంపాజిబుల్ ట్రావెల్ డీల్స్ 2026’లో భారీ తగ్గింపులు

హోటల్ బుకింగ్‌లపై 65%, విమాన టికెట్లపై 30% వరకు తగ్గింపులను ప్రకటించిన అమెజాన్ పే

నవంబర్ 12 నుంచి ప్రయాణీకులు దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్ల బుకింగ్‌లతో పాటు హోటల్ రిజర్వేషన్లపై ప్రత్యేక ఆఫర్లను, అదనపు క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలను పొందవచ్చు.

బెంగ‌ళూరు, నవంబరు 10, 2026: అమెజాన్ పే తన ప్రముఖ సేల్ ఈవెంట్ ‘ఇంపాజిబుల్ ట్రావెల్ డీల్స్’ను మరోసారి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 12 నుంచి 26, 2026 వరకు 15 రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. ఈ సందర్భంగా దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లతో పాటు హోటల్ బుకింగ్‌లపై ప్రయాణీకులకుప్రత్యేక తగ్గింపులు, ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ మెగా సేల్‌లో భాగంగా విమాన టికెట్లపై 30% వరకు, హోటల్ బుకింగ్‌లపై 65% వరకు తగ్గింపులను పొందవచ్చు.

ఈ సేల్‌లో భాగంగా పలు ప్రముఖ అంతర్జాతీయ గమ్యస్థానాలకు ఆకర్షణీయమైన ప్రారంభ ధరలకే విమాన టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి బ్యాంకాక్‌కు ₹12,299 నుంచి, ముంబై నుంచి దుబాయ్‌కు ₹13,999 నుంచి, కోల్‌కతా నుంచి హో చి మిన్ సిటీకి ₹15,599 నుంచి టికెట్ ధరలు ప్రారంభమవుతాయి. ఇక దేశీయ ప్రయాణాల విషయానికొస్తే, ముంబై నుంచి గోవాకు ₹3,099 నుంచి, బెంగళూరు నుంచి కొచ్చికి ₹4,199 నుంచి, ముంబై నుంచి ఢిల్లీకి ₹6,099 నుంచి విమాన టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

హోటల్ బుకింగ్‌లపై ప్రయాణీకులు 5-స్టార్ హోటళ్లలో 65% వరకు తగ్గింపుతో బస చేసే అవకాశాన్ని పొందవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా దుబాయ్‌లోని దుసిత్ థానీ (Dusit Thani Dubai)లో ₹6,649 నుంచి, సింగపూర్‌లోని కార్ల్టన్ సిటీ హోటల్ (Carlton City Hotel Singapore)లో ₹15,089 నుంచి బస చేసేందుకు వీలుంది. అలాగే, గోవాలోని హోటళ్లలో ₹4,899 నుంచి, కొచ్చిలోని హోటళ్లలో ₹3,549 నుంచి బుకింగ్‌లు అందుబాటులో ఉన్నాయి.

“భారతీయ కుటుంబాలు మునుపెన్నడూ లేనంతగా ప్రయాణాలకు ఆసక్తి చూపిస్తున్నాయి. ‘ఇంపాజిబుల్ ట్రావెల్ డీల్స్ 2026’ ద్వారా వారి ప్రయాణ ఖర్చులను మరింత తగ్గించాలనుకుంటున్నాము. గోవాలో వారాంతపు విహారయాత్ర అయినా, దుబాయ్‌కు అంతర్జాతీయ పర్యటన అయినా, అమెజాన్ పేలో సులభమైన బుకింగ్ సదుపాయంతో విమాన టికెట్లు, హోటల్ బుకింగ్‌లపై గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. ఈ ఏడాది మరిన్ని విమానయాన సంస్థలు, హోటల్ భాగస్వాములతో కలిసి, పండుగలు, సెలవుల సీజన్‌లో ప్రయాణీకులు వారి కలల గమ్యస్థానాలకు ప్రయాణించే ప్రణాళికలను సాకారం చేసుకోవడాన్ని మరింత సులభతరం చేస్తున్నాము,” అని గిరీష్ కృష్ణన్, ఎక్స్‌పీరియన్స్ అండ్ రివార్డ్స్ డైరెక్టర్, అమెజాన్ పే పేమెంట్స్ తెలిపారు.

సేల్ వ్యవధిలో ప్రయాణీకులు విమాన టికెట్లపై 15% వరకు, హోటల్ బుకింగ్‌లపై 45% వరకు తక్షణ తగ్గింపులను పొందవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రైమ్ సభ్యులు విమాన, హోటల్ బుకింగ్‌లపై అదనంగా 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ప్రైమ్ సభ్యత్వం లేని సభ్యులకు 3% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంతేకాకుండా, బస్ టికెట్ బుకింగ్‌లపై 17% వరకు తగ్గింపుతో పాటు, ₹100 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.

ఈ సేల్ నవంబర్ 12, 13 తేదీల్లో ప్రత్యేక ఎర్లీ బర్డ్ ఆఫర్లతో ప్రారంభం కానుంది. ఈ ఆఫర్లను కస్టమర్లు అందరూ పొందవచ్చు. ఇందులో భాగంగా విమాన టికెట్ల బుకింగ్‌పై 10% క్యాష్‌బ్యాక్ (గరిష్ఠంగా ₹500 వరకు), హోటల్ బుకింగ్‌లపై 10% క్యాష్‌బ్యాక్ (గరిష్ఠంగా ₹10,000 వరకు), అలాగే ₹250 కంటే ఎక్కువ విలువైన బస్ టికెట్ బుకింగ్‌లపై ₹100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. నవంబర్ 14 నుంచి విమాన, హోటల్ బుకింగ్‌లపై ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్లు తొలిసారిగా అమెజాన్ పే ట్రావెల్ సేవలను వినియోగించే ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

అమెజాన్ పే ట్రావెల్ బుకింగ్ సేవ ద్వారా ప్రయాణీకులు ప్రపంచవ్యాప్తంగా 4,000 నగరాల్లో సేవలందిస్తున్న 1,100కు పైగా విమానయాన సంస్థలతో పాటు, భారతదేశంలోని లక్షకు పైగా హోటళ్లు, ప్రపంచవ్యాప్తంగా 70 లక్షలకు పైగా హోటల్స్‌లో బుకింగ్‌లు చేసుకోవచ్చు. ఈ సేవలో ప్రయాణీకులకు 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, తక్కువ రద్దు రుసుములు, నచ్చిన సీట్లను ఎంచుకునే సదుపాయం, ఎంపిక చేసిన బుకింగ్‌లపై భోజన సదుపాయం, ‘ఇప్పుడే బుక్ చేసుకోండి.. తర్వాత చెల్లించండి’ వంటి సౌకర్యవంతమైన చెల్లింపు ఎంపికలు కూడా లభిస్తాయి. ఈ ప్రత్యేక ఆఫర్లను పొందాలనుకునే కస్టమర్లు Amazon.in వెబ్‌సైట్‌ను సందర్శించి, అమెజాన్ పేలోని ట్రావెల్ విభాగం ద్వారా తమ బుకింగ్‌లు చేసుకోవచ్చు. (Story: అమెజాన్ పే ‘ఇంపాజిబుల్ ట్రావెల్ డీల్స్ 2026’లో భారీ తగ్గింపులు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments