కొత్త మంత్రులు : బీసీ 9, ఎస్సీ 6, కాపు, రెడ్డి 3, కమ్మ 1
అమరావతి : అమరావతిలో గురువారం జరిగిన చివరి క్యాబినెట్ సమావేశంలో అజెండాలోని అంశాలపై చర్చ తర్వాత మంత్రులు రాజీనామాలు చేశారు. ఈనెల 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాస్వీకారం ఉండటంతో 10వ తేదీ నాటికి జాబితా బయటకు వచ్చే అవకాశముంది. సామాజిక వర్గాలు, కొత్త జిల్లాల వారిగా కొన్ని పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. జగన్ వద్ద ప్లాన్ ఎ, ప్లాన్ బీలు ఉన్నప్పటికీ, సామాజిక వర్గాల ప్రాతిపదికగా మంత్రి పదవులిచ్చే ప్లాన్-ఏకు జగన్ ప్రయాటీ ఇస్తారని భావిస్తున్నారు. విచిత్రమేమిటంటే, గురువారంనాడు ఏ సామాజిక వర్గానికి ఎన్ని మంత్రి పదవులు వస్తాయో తెలియజేసే జాబితా, దాని సంఖ్య లీకైంది. ఈ లీకైన జాబితాగా పేర్కొంటూ మీడియా ప్రచారం మొదలుపెట్టింది. అందులో కొత్త క్యాబినెట్‌లో తొమ్మిది మంది బీసీలు, ఆరుగురు ఎస్సీలు, ముగ్గురు కాపులు, ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు, ఇద్దరు ఎస్టీలు, ఒక కమ్మ, ఒక మైనార్టీ వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే వైశ్య, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు చోటు ఉంటుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. వీటిలో చివరి నిముషంలో చిన్నచిన్న మార్పులు జరిగే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
బీసీల్లో ప్రస్తుత మంత్రులు గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణలను కొనసాగిస్తారన్న వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు కొలుసు పార్థసారథి, జోగి రమేష్, విడదల రజిని, ఉష శ్రీచరణ్, పొన్నాడ సతీష్, తమ్మినేని సీతారామ్, ధర్మాన ప్రసాదరావు పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ వర్గం నుంచి మేరుగ నాగార్జున, ఎలీజాతో పాటు మరికొందరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గంలో నెల్లూరు జిల్లా నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కర్నూలు నుంచి శిల్పా చక్రపాణి రెడ్డితో పాటు రోజా, చెవిరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కాపు సామాజిక వర్గంలో ముగ్గురికి ఛాన్స్ దక్కనుందట. గతంలో నలుగురు కాపులు మంత్రివర్గంలో ఉండగా ఈసారి మూడు తగ్గించినట్లు తెలుస్తోంది. వీరిలో దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్ తో పాటు సామినేని ఉదయభాను, అంబటి రాంబాబులో ఒకరికి ఇచ్చే అవకాశమంది. కమ్మ సామాజిక వర్గం నుంచి కొడాలి నాని స్థానంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. తమ్మినేని సీతారామ్‌కు మంత్రి పదవి వచ్చిన పక్షంలో కొత్త స్పీకర్ పదవికి కూడా కొన్ని పేర్లు విన్పిస్తున్నాయి. విశేషమేమిటంటే, గొప్ప సీనియర్ కాకపోయినా, పేర్ని నాని స్పీకర్ పదవి రేసులో ఉన్నట్లు సమాచారం. అలాగే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కూడా స్పీకర్ పదవికి ఎంపికయ్యే జాబితాలో వుండవచ్చని పుకార్లు విన్పిస్తున్నాయి. (Story: కొత్త మంత్రులు : బీసీ 9, ఎస్సీ 6, కాపు, రెడ్డి 3, కమ్మ 1)
See Also: మీడియాపై మంత్రి పేర్ని నాని ఉద్వేగపూరిత వ్యాఖ్యలు
మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
రామ్‌గోపాల్‌వర్మకు ధియేటర్ల షాక్!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్
మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానంలో మంత్రి ఎవరో తెలుసా?
రామ్‌చరణ్‌తో బిగ్ డీల్ నిజమేనా?
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు