మంత్రుల్లో ఆ నలుగురూ సేఫ్!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన కొత్త మంత్రి వర్గం కూర్పుపై ఏనాడో కసరత్తు పూర్తి చేసేశారని సీఎం సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎంత మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి, ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న అంశంపై ఇప్పటికే తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈనెల 7వ తేదీన ప్రస్తుత క్యాబినెట్ భేటీ అవుతుంది. ఆ సందర్భంగానే ఆ క్యాబినెట్ మొత్తం రాజీనామా చేస్తుంది. ఈనెల 11వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఈ లోగానే కొత్త మంత్రివర్గ సభ్యుల జాబితాను సీఎం రూపొందించుకోవాల్సి వుంటుంది. అయితే ఇప్పటికే సీఎం తన కొత్త క్యాబినెట్ టీమ్‌ను సిద్ధంగా చేసి ఉంచారని సమాచారం. కాకపోతే పాత మంత్రివర్గంలో ఎవరుంటారు? ఎవరు పోతారన్న అంశంపై స్పష్టత లేదు. ఇది చివరి వరకు సస్పెన్స్‌గానే వుంటుంది. రాజకీయ వర్గాల్లో మాత్రం ఇప్పుడున్న మంత్రివర్గంలో గల ఇద్దరు బీసీ మంత్రులు సేఫ్‌గా వుంటారని చెపుతున్నప్పటికీ, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ ఇద్దరితోపాటు మరో ఇద్దరు మంత్రులకు కూడా ఎలాంటి సమస్య లేదని తెలిసింది. ఏతావాతా తేలేదేంటంటే, ఇప్పుడున్న మంత్రివర్గంలో నలుగురు మంత్రులు మినహా మిగతావారి స్థానాలను ఇతర కొత్త వారు భర్తీ చేయనున్నారని స్పష్టమైన సమాచారం.
ఇంతకీ ఆ నలుగురు ఎవరు?
ఇప్పటివరకు రాష్ట్రంలో 13 జిల్లాలు వుండేవి. ఇప్పుడవి 26 జిల్లాలుగా రూపాంతరం చెందాయి. ఈ 26 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేలా మంత్రులు వుండాలని, తద్వారా అసలుసిసలు వికేంద్రీకరణకు ఊతమివ్వాలన్నది సీఎం జగన్ ఆలోచన. జిల్లాకొక మంత్రిని ఉంచడంతోపాటు పాత మంత్రులకు జిల్లాలో పార్టీ గెలుపు బాధ్యతలను అప్పగించడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి అధికారం కైవసం చేసుకోవాలన్నది వైసీపీ అధనేత ఆలోచన. రెండున్నరేళ్ల ముందే జగన్ ఒక పకడ్బంధీ ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. పన్నులు, భారాల వల్ల ప్రజల్లో వైసీపీ పట్ల స్వల్పంగా వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ, ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రజలు టర్న్ కావడం లేదు. అందువల్ల జగన్ ఈ రెండేళ్లలోనే మళ్లీ తమవైపు ప్రజలను తిప్పుకోవడానికి ప్లాన్ వేశారు. అందులో భాగంగానే కొత్త జిల్లాల ఏర్పాటు, ఆ జిల్లాలకు కొత్త మంత్రుల బాధ్యతలు, పాతమంత్రుల ఇన్‌ఛార్జిషిప్‌లు…ఇలా ఈ నెలలో ఒక విడత ప్యాకేజీని అమలు చేసే పనిలో సీఎం ఉన్నారు. అందుకే కొత్త మంత్రివర్గంలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యంతోపాటు సామాజికవర్గ సమీకరణలను కూడా సీఎం దృష్టిలో పెట్టుకోనున్నారు. అందుకే ఇద్దరు బీసీ మంత్రులు గుమ్మనూరు జయరామ్, వేణుగోపాలకృష్ణలను క్యాబినెట్‌లో కొనసాగించాలని ఆయన అనుకున్నట్లు తెలిసింది. వారితోపాటు పేర్ని వెంకట్రామయ్య (నాని), రాజేంద్రనాథ్‌రెడ్డి (ఆర్థికమంత్రి)లు మంత్రులుగా కొనసాగే అవకాశాలు పూర్తిగా కన్పిస్తున్నాయి. అయితే శాఖలు మారే అవకాశం వుందని భావిస్తున్నారు. ముగ్గురు నానీల్లో (ఆళ్ల నానీ, పేర్ని నానీ, కొడాలి నానీ) ఒక నానీయే మంత్రివర్గంలో మిగిలే అవకాశం వుందని అంటున్నారు. ఏదేమైనప్పటికీ, ఏ తేడా జరగాలన్నా ఈనెల 11వ తేదీ వరకు ఆగాల్సిందే! (Story: మంత్రుల్లో ఆ నలుగురూ సేఫ్!)
See Also: ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!
మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానంలో మంత్రి ఎవరో తెలుసా?
మాకొద్దీ మంత్రిగిరీ! Special Story)
రామ్‌చరణ్‌తో బిగ్ డీల్ నిజమేనా?
క్యాబినెట్ విస్తరణ ముహూర్తం కుదిరింది!
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు