UA-35385725-1 UA-35385725-1

కొత్త ఆర్థిక మంత్రి అత‌నే!

కొత్త ఆర్థిక మంత్రి అత‌నే!

అమ‌రావ‌తి : కొత్త మంత్రివ‌ర్గంపై ఊహాగానాలు ఇంకా ఊరేగుతూనే వున్నాయి. సెక్ర‌టేరియ‌ట్ ప‌రిస‌ర ప్రాంతాల్లో అడుగుపెడితే చాలు…ఏదో ఒక క‌బురు…! అది నిజం కావ‌చ్చు. కాక‌పోవ‌చ్చు. ఊహాగాన‌మో, గాలిక‌బురో…మొత్తానికి అధికారులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయ‌కుల్లో మంత్రివ‌ర్గం కూర్పుపై మాటామంతీ త‌ప్ప వేరే టాపిక్కే లేదు. ఏపీలో ఇప్పుడు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ గురించి త‌ప్ప ఇంకే అంశం గురించీ మాట్లాడుకోవ‌డం లేదు. ఆర్ ఆర్ ఆర్ మూవీ కూడా టాప్ స్టోరీల నుంచి తెర‌మ‌రుగైంది. కొత్త‌గా ఆర్థిక మంత్రి గురించి అంతా ముచ్చ‌టించుకుంటున్నారు. బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి నిష్క్ర‌మ‌ణ త‌ప్ప‌దంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. క్యాబినెట్ స‌మావేశం ముగియ‌క‌ముందే, మంత్రివ‌ర్గం రాజీనామా ప్ర‌క్రియ పూర్త‌యిందంటూ గాలివార్త‌లు వ‌చ్చాయి. నిజానికి క్యాబినెట్‌లో 30 అంశాల‌పై చ‌ర్చ జ‌రిగిన మీద‌టే క్యాబినెట్ ప్ర‌స్తావ‌న మొద‌లైంది. అస‌లు విష‌యానికొస్తే, అప్పుల ఊబి నుంచి ఏపీని కాపాడ‌టానికి త‌న వంతుగా విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసిన బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఉద్వాస‌న త‌ప్పేలా లేదు. దీంతో బుగ్గ‌న వారసుడు ఎవ‌రనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం. శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన మాజీ రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి, నంద్యాల‌కు చెందిన శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డిల‌లో ఒక‌రికి మంత్రి ప‌ద‌వితోపాటు ఆర్థిక శాఖ ద‌క్కుతుంద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఇప్పుడు మంత్రిప‌ద‌విపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. అత‌ని సోద‌రుడు ధ‌ర్మాన కృష్ణ‌దాస్ ప్ర‌స్తుతం ఉప ముఖ్య‌మంత్రిగా వున్నారు. ఆయ‌న స్థానంలోనే ప్ర‌సాద‌రావుకు ప‌ద‌వి వ‌స్తుంద‌ని చెపుతున్నారు. అత‌నికి మంత్రి ప‌ద‌వి వ‌స్తే క‌చ్చితంగా ఆర్థిక శాఖే వ‌స్తుంద‌ని అత‌ని స‌న్నిహితులు న‌మ్ముతున్నారు. శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి కూడా జ‌గ‌న్‌కు ఎంతో విశ్వ‌స‌నీయునిగా వున్నారు. ఒక ద‌శ‌లో ఆయ‌న జైలుకు కూడా వెళ్లి వ‌చ్చారు. ఆయ‌న శాస‌న‌మండ‌లి ఉప‌నాయ‌కునిగా ప‌నిచేసి వున్నారు. ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డికి ఆర్థిక మంత్రిగా చేసిన అనుభ‌వం కూడా వుంది. ఆయ‌న‌కు ప‌ద‌వి వ‌స్తే క‌చ్చితంగా ఆర్థిక శాఖ ద‌క్కుతుంద‌న్న‌ది చాలామంది న‌మ్మ‌కం. ఏదేమైన‌ప్ప‌టికీ, ఈ ముగ్గురిలో ఒక‌రు బుగ్గ‌న వార‌సుడు అవుతార‌న్న‌ద‌ని అంటున్నారు. కాక‌పోతే, వీరికి ముందుగా మంత్రి ప‌ద‌వులు ద‌క్కాలి క‌దా! (Story: కొత్త ఆర్థిక మంత్రి అత‌నే!)

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

మంత్రుల్లో ఆ న‌లుగురూ సేఫ్‌!

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఉగాది పచ్చడి ఆరోగ్యకరమేనా?

మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానంలో మంత్రి ఎవరో తెలుసా?

మాకొద్దీ మంత్రిగిరీ! Special Story)

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

జ్వరం టాబ్లెట్‌ రూ. 100

క్యాబినెట్‌ విస్తరణ ముహూర్తం కుదిరింది!

ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1