రామ్‌గోపాల్‌వర్మకు ధియేటర్ల షాక్!
మా ఇష్టం సినిమాను ప్రదర్శించబోమని తేల్చిచెప్పిన యాజమాన్యాలు
ఓటీటీని ఆశ్రయించనున్న ఆర్జీవీ
హైదరాబాద్ : అందరికీ తన ప్రకటనలతో షాకింగ్‌లు ఇచ్చే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు సినిమా ధియేటర్లు ఊహించలేని విధంగా షాకిచ్చాయి. రామ్‌గోపాల్ వర్మ తీసిన చిత్రం మా ఇష్టం విడుదలకు సిద్ధంగా వుంది. అయితే ఐనాక్స్, పీవీఆర్ ధియేటర్లు ఈ మూవీని ప్రదర్శించడానికి నిరాకరించాయి. ఈ సినిమా తమ సూత్రాలు, నైతిక విలువలకు విరుద్ధమని తేల్చిచెప్పాయి. మిగతా ధియేటర్లు ఈ సినిమా తీసుకుంటాయో లేదో ఇంకా తేలలేదు. మా ఇష్టం సినిమా ఒక డేంజరస్ మూవీగా పరిగణిస్తున్నారు. ఇది ఎల్‌జీబీటీ మూవీ. అంటే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రన్స్‌జెండర్ (ఎల్‌జీబీటీ)ల కథాంశంతో తీసిన మూవీ. ఇద్దరు అందమైన అమ్మాయిలు సహజీవనం చేసే సినిమా ఇది. ఈ సహజీవనంలో బతకడమొక్కటే కాకుండా సెక్స్ కూడా వుంటుంది. ఇందులో నటించిన ఇద్దరు హీరోయిన్లు కూడా సాహసంతో ఈ సినిమా చేశారు. ఆర్జీవీ కూడా కొత్తదనంతో ఈ మూవీని తీసినప్పటికీ, అతని తెగింపు మరీ ఎక్కువైందని సినీ వర్గాలు చెపుతున్నాయి. దీనిపై రామ్‌గోపాల్ వర్మ స్పందిస్తూ, మా ఇష్టం సినిమాను ప్రదర్శించడానికి పీవీపీ, ఐనాక్స్ ధియేటర్లు నిరాకరించడం ఎల్‌జీబీటీ కుటుంబాన్ని తీవ్రంగా అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ఇదేమీ నిషిద్ధ సినిమా కాదని, తప్పుడు దృక్పథాలు కూడా లేవని, ఒక ఎల్‌జీబీటీ జంట ఎలా బతుకుతున్నదో చూపించామని, వారికి ప్రమాదం వాటిల్లినప్పుడు వారు స్పందించే తీరు ఎలా వుంటుందో ఇందులో చూపించామని, ఇందులో అసభ్యత కూడా పెద్దగా లేదని చెప్పారు. ఇతర ధియేటర్లు ఈ సినిమాపై ఇంకా స్పందించలేదు. అయితే పీవీపీ, ఐనాక్స్ చైన్‌లో ఉన్న ధియేటర్లు మాత్రమే మా ఇష్టం మూవీని ప్రదర్శించడానికి నిరాకరించాయని, మిగతా ధియేటర్లలో ఇది విడుదలవుతోందని సినీ వర్గాలు తెలిపాయి. అయితే ఒక ఓటీటీ సంస్థ దీన్ని తీసుకోవడానికి ముందుకు వచ్చినట్లు తెలిసింది. కాకపోతే రామ్ గోపాల్‌వర్మకే ఒక సొంత ఓటీటీ వ్యవస్థ వుంది. ఈనెల 8వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి వుంది. దీని విడుదలపై సినీవర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.
See Also: స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్
మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానంలో మంత్రి ఎవరో తెలుసా?
మాకొద్దీ మంత్రిగిరీ! Special Story)
రామ్‌చరణ్‌తో బిగ్ డీల్ నిజమేనా?
క్యాబినెట్ విస్తరణ ముహూర్తం కుదిరింది!
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు