UA-35385725-1 UA-35385725-1

బుడమేరు గండిని ఎలా పూడ్చారు? గేబియన్‌ బాస్కెట్‌ అంటే ఏమిటి?

బుడమేరు గండిని ఎలా పూడ్చారు? గేబియన్‌ బాస్కెట్‌ అంటే ఏమిటి?

బుడమేరు 3వ గండి పూడ్చివేతలో ఇండియన్‌ ఆర్మీ పాత్ర..!
ఇండియన్‌ ఆర్మీ ఫార్ములా ‘‘గేబియన్‌ బాస్కెట్‌’’ ఇదే కీలకం..!

(గమనిక: ఈ వ్యాసాన్ని ప్రొఫెషనల్‌ జర్నలిస్టు ఏపూరి రాజారత్నం కోరా కోసం రాశారు. (పాఠకుల అవగాహన, ప్రయోజన నిమిత్తం ‘కోరా’ నుంచి ఈ వ్యాసాన్ని స్వీకరించడం జరిగింది)

బుడమేరు మూడవ గండి పూడ్చివేతకు ముందు..
అమరావతి: ఇప్పుడు బుడమేరు అనేది ఆంధ్రప్రదేశ్‌లో అయితే పెద్ద చర్చగా మారింది.బుడమేరు కారణంగానే విజయవాడలో కొన్ని ప్రాంతాలు పెద్ద ఎత్తున ముంపుకు గురి కాబడ్డాయని తెలుస్తుంది.ఏది ఏమైనప్పటికీ బుడమేరుకి మూడు గండ్లు పడ్డాయని, రెండు గండ్లు పూడ్చిన విషయం పెద్దగా బయటకు రాలేదు.మరి మూడవ గండి విషయం ఎందుకు ఇంతగా ప్రచారం జరిగిందనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

బుడమేరుకు పడిన మూడు గండ్లలో రెండు గండ్లు 10-15మీటర్లు ఉంటే….కొండపల్లి శాంతి నగర్‌ సమీపంలో పడిన బుడమేరు మూడవ గండి 90 మీటర్ల పైగా ఉన్నట్లు తెలుస్తుంది.ఇక ప్రమాదకరంగా మారిన ఈ మూడవ గండి విషయంలో ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరించి గండి పూడ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేసి అసాధ్యం అనుకున్న బుడమేరు మూడవ గండి కూడా పూడ్చి సక్సెస్‌ అయ్యింది ప్రభుత్వం.

మూడవ గండి పూడ్చడం ఓ..సవాలుగా..!!

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరులో 60 వేల క్యూసెక్కులకు పైగా వరదనీరు రావడం తో బుడమేరు డైవర్షన్‌ ఛానల్‌కు మూడు చోట్ల గండ్లు పడ్డాయనేది ఏపీ ప్రభుత్వం గ్రహించింది. అయితే ముంపు ప్రారంభం అయిన సమయంలోనే సీఎం చంద్రబాబు ఆదేశాలతో నీటిపారుదల శాఖ అధికా రుల ఆధ్వర్యంలో రెండు గండ్లుపూడ్చడం జరిగింది.ఇక మూడవ గండి పూడ్చడం అనేది ప్రభుత్వా నికి ఉన్న అవకాశాలను బట్టి ఇదో పెద్ద సమస్యగా మారింది.అయినా ఎక్కడా మరో ఆలోచన లేకుండా ఏ మాత్రం ఆలస్యం గానీ, నిర్లక్ష్యం గానీ చేయకుండా మూడో గండిని ఏజెన్సీలు, ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పూడ్చివేయడం చేశాయి. సీఎం చంద్రబాబు, ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడిని బుడమేరు కట్టకు కట్టేసి గండిని పూడ్చేపని చేయించారు.ఈ గండిని పూడిపించే విధానంలో ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయకుండా చెన్నైకు చెందిన 6వ బెటాలియన్‌ మరియు సికింద్రాబాద్‌కు చెందిన రెజిమెంటల్‌ బెటాలియన్‌ ఆర్మీ సిబ్బంది సుమారు 125 మంది జవాన్లతో గండి పూడ్చివేత చేయించడం జరిగింది.

ఆర్మీ వల్లనే మూడవ గండి పూడ్చివేత సాధ్యం..

సుమారు వంద మీటర్ల వెడల్పు కలిగిన గండి పూడ్చివేత విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర య్యాయి.అయినప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఆ గండిని పూడ్చడమే లక్ష్యంగా పెట్టుకుంది.దీనితో పనులు ఇండియన్‌ ఆర్మీ ఇంజనీర్లు చేతిలోకి వెళ్ళాక అక్కడ పనులు మరింత వేగం పుంజుకున్నాయి. ఇనుప జాలీల్లో రాళ్లను నింపి గండి పూడ్చివేత పూర్తి చేశారు ఆర్మ్‌ జవాన్లు. ఒక్కొక్కటి 522 మీటర్ల పరిమాణంఉండే గాబియన్‌ బాస్కెట్‌లను ముందుగా ఒకదానిపై ఒకటి పెట్టి వాటిల్లో రాళ్లను నింపి మూడవ గండికి అడ్డుకట్టగా వేయడం జరిగింది. 90 మీటర్లు ఉన్న మూడో గండిలో 40 మీటర్ల వెడల్పు గండిని శుక్రవారం నాడే పూడ్చివేశారు. ఇక శనివారం సాయంత్రానికి గండి మొత్తం పూడ్చడంతో విజయవాడలో బుడమేరు వరద తగ్గిందని, ఇక ఇళ్లలో చేరిన బురదను ప్రజలు పరిశుభ్రం చేసుకుంటున్నారు. పారిశుద్ధ్య, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం నుంచి ఇంటింటికీ వాహనాల ద్వారా నిత్యావసరాల పంపిణీ చేస్తున్నారు.

మూడవ గండిని పూడ్చడంలో ‘గేబియన్‌ బాస్కెట్‌’ కీలకం..
బుడమేరు మూడవ గండి పూడ్చివేతలో వాడిన గేబియన్‌ బాస్కెట్స్‌..

గేబియన్‌ బాస్కెట్‌ అనేది వైర్‌ మెష్‌ లేదా ఇతర పదార్థాలతో తయారు చేయబడిన ఒక కంటైనర్‌ లాంటిది. దీనిని నిర్మాణం, ఇంజనీరింగ్‌ మరియు ల్యాండ్‌స్కేపింగ్‌లో ఉపయోగిస్తారు. గస్థిరమైన నిర్మాణం లేదా అవరోధాన్ని సృష్టించడానికి ఇది సాధారణంగా రాళ్ళు, నేల లేదా ఇతర పదార్థాలతో నిండి ఉంటుంది.

గేబియన్‌ బాస్కెట్‌ వల్ల ఉపయోగాలు..

1.కోత నియంత్రణ: వాలులు, గట్టలు లేదా నదీతీరాల్లో నేల కోతను నిరోధించడం.
2.నిలుపుదల గోడలు: మట్టి లేదా ఇతర పదా ర్థాలను నిలువరించడానికి అలంకరణ లేదా క్రియాత్మక గోడలను సృష్టించడం.
3.వరద నియంత్రణ: నీటిని కలిగి ఉండటం లేదా ప్రవాహాన్ని మళ్లించడం ద్వారా వరదల నుండి ప్రాంతాలను రక్షించడం.
4.ల్యాండ్‌స్కేపింగ్‌: ప్లాంటర్‌లు, తోట గోడలు లేదా సరిహద్దులు వంటి అలంకార లక్షణాలను జోడిరచడం.

‘‘గేబియన్‌’’ అనే పదం ఇటాలియన్‌ పదం ‘‘గబ్బియోన్‌’’ నుండి వచ్చింది, దీని అర్థం ‘‘పెద్ద పంజరం’’.గేబియన్‌ బుట్టలు తప్పనిసరిగా బలమైన మరియు సౌకర్యవంతమైన నిర్మాణాన్ని సృష్టించడానికి పదార్థాలతో నిండిన వైర్‌ బోనులు. (Story: బుడమేరు గండిని ఎలా పూడ్చారు? గేబియన్‌ బాస్కెట్‌ అంటే ఏమిటి?)

  • Writer: ఏపూరి రాజారత్నం, ప్రొఫెషనల్‌ జర్నలిస్టు (పాఠకుల అవగాహన, ప్రయోజన నిమిత్తం ‘కోరా’ నుంచి స్వీకరణ)
  • Credit : Epuri Rajaratnam (Quora)

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1