పర్యవేక్షణ నిల్..ఫలహారం పుల్!
కార్పొరేషన్ ఖజానాకు నష్టం..అయినా పట్టని వైనం
విజయవాడ పట్టణ ప్రణాళిక శాఖకు ఆమ్యామ్యాలే టార్గెట్టా?

తెలుగు న్యూస్/విజయవాడ: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని పట్టణ ప్రణాళిక శాఖలో పర్యవేక్షణ కొరవడిరది. ఫలితంగా కార్పొరేషన్ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతున్నా ఏ ఒక్కరికీ పట్టడంలేదనే విమర్శలు వస్తున్నాయి. పర్యవేక్షణ సక్రమంగా చేయలేని వారికి ఆ శాఖ ఉన్నతాధికారులు మాత్రం పరిధిని విస్తారంగా అప్పగించి ఫలహారాన్ని పుల్‌గా పంచుకుంటున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కార్పొరేషన్‌కు నష్టం వాటిల్లే అనధికారిక నిర్మాణాలకు అడ్డేలేకుండా పోయింది. సూర్యారావుపేట, గవర్నర్‌పేట, గాంధీనగర్, సీతారామపురం, మాచవరం, రామలింగేశ్వరనగర తదితర ప్రాంతాల్లో మునుపెన్నడూలేని విధంగా ఇబ్బడి ముబ్బడిగా అనధికారిక భవన నిర్మాణాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. గజం లక్షల్లో పలికే కమర్షియల్ ప్రాంతాలైన ఆయా ప్రాంతాల్లో నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతులు తీసుకోకుండా అనధికారికంగా పైఅంతస్తులు నిర్మిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వీటిని ఎవరు పర్యవేక్షిస్తారు..? పర్యవేక్షించలేని అధికారులను ఆ శాఖ ఉన్నతాధికారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారు..? అని స్థానికులు ప్రశ్నించటంతో పాటు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కంటే ముందుగా స్పందించి అనధికారిక నిర్మాణాలను తొలగించాల్సిన అధికారులకు స్థానికంగా ఫిర్యాదులు కోకొల్లలుగా అందుతున్నా అటువైపు తొంగి చూడకపోవటం ఆ శాఖాధికారులపై వస్తున్న అనుమానాలకు మరింత బలాన్నిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కార్పొరేషన్‌కు నష్టం కలిగించే అనధికారిక భవన నిర్మాణాలపై ఇప్పటికైనా నగరపాలక సంస్థ కమిషనర్ చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
అనధికారిక భవన నిర్మాణాలు ఇలా..
గజం లక్షల విలువచేసే కమర్షియల్ ప్రాంతమైన సూర్యారావుపేట విజయ ఆసుపత్రి సమీపంలో ప్లాన్‌కు విరుద్ధ్దంగా దానిపై అనధికారికంగా అదనపు ప్లోర్ నిర్మిస్తున్నట్లు తెలిసింది. గాంధీనగర్ పాపట్ల వారి వీధిలో టౌన్‌ప్లానింగ్ నుంచి స్టిల్ట్GజీG2కు అనుమతులు తీసుకుని పైన అనధికారిక అంతస్తు నిర్మిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గవర్నర్‌పేటలోని కాంగ్రెస్ ఆఫీసు రోడ్డులో ఒక అనధికారిక ఫ్లోర్, సూర్యారావుపేట డోర్నకల్ రోడ్‌లో శ్రీఅక్షరాంభికా సమేత అక్షేశ్వరస్వామి టెంపుల్ వద్ద మరో అనధికారిక బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నట్లు తెలిసింది. 25వ డివిజన్ సీతారామపురం నెహ్రూ రోడ్‌లో స్టిల్ట్GజీG2కు అనుమతులు తీసుకుని మరో అదనపు ఫ్లోర్ నిర్మిస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 24వ డివిజన్ పాపయ్య వీధిలో స్టిల్ట్GజీG4కు అనుమతులు తీసుకుని పైన అనధికారికంగా మరో అంతస్తు నిర్మిస్తున్నట్లు సమాచారం. మాచవరం హిందీ కాలేజీ వీధిలో మరో అనధికారిక అంతస్తు నిర్మిస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 15వ డివిజన్ రామలింగేశ్వరనగర్‌లోని స్వర్గపురి రోడ్డులో ఆంజనేయస్వామి గుడి వద్ద జీG2కు టౌన్‌ప్లానింగ్ నుంచి అనుమతులు తీసుకుని పైన అనధికారిక ఫ్లోర్ నిర్మిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లోని అనధికారిక భవన నిర్మాణాలను పరిశీలించి తక్షణం అనధికారిక నిర్మాణాలపైన, నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకుని నగరపాలక సంస్థకు ఆదాయాన్ని సమకూర్చాలని స్థానికులు కోరుతున్నారు. (Story: పర్యవేక్షణ నిల్..ఫలహారం పుల్!)
Follow the Stories:
జగన్ చుట్టూ కోటరీ ఎవరు?
Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!