Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రాజ‌ధాని ప‌నుల ప్రారంభానికి డేట్ ఫిక్స్‌! మోదీ చేతుల మీదుగానే!

రాజ‌ధాని ప‌నుల ప్రారంభానికి డేట్ ఫిక్స్‌! మోదీ చేతుల మీదుగానే!

0

రాజ‌ధాని ప‌నుల ప్రారంభానికి డేట్ ఫిక్స్‌! మోదీ చేతుల మీదుగానే!

ఏప్రిల్‌ 15-20 మధ్య ముహూర్తం ఖ‌రారు
40వేల కోట్ల పనులకు టెండర్ల ఆమోదం
ఏపీ ప్రజల కల సాకారం
సీఎం చంద్రబాబు నేతృత్వంలో పనులు

న్యూస్‌ తెలుగు/అమరావతి: రాష్ట్ర ప్రజల ఆశాజనకమైన అమరావతి రాజధాని పనులు శరవేగంగా ముందుకు సాగ‌నున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అండదండలతో ఈ పనులకు ప్రణాళికలు రూపొందించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏపీసీఆర్డీఏ) ఇప్పటికే సమగ్ర ప్రణాళికను రూపొందించింది. మొత్తం రూ.62,000 కోట్ల అంచనా వ్యయంతో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్మాణ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది. ఐదేళ్లపాటు నిర్వీర్యంగా ఉన్న పనులు ఇక దూసుకుపోనున్నాయి. అందుకు అవసరమైన టెండర్ల దాఖలకు ఏపీసీఆర్డీఏ పిలిచింది. రాజధానిలో ప్రధాన ఘట్టంగా ఉన్న పనులను తొలి విడతలో చేపట్టనున్నారు. రాజధాని పనుల ప్రారంభానికి ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి 20 తేదీల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి శంకుస్థాపన చేయనున్నారు. 2015 అక్టోబర్‌ 21న అమరావతికి ప్రధాని మోదీ తొలిసారి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా మరోసారి పున:ప్రారంభ పనులకు తేదీని చంద్రబాబు ప్రభుత్వం ఖరారు చేసింది. మళ్లీ ఏప్రిల్‌ 15 నుంచి 20వ తేదీ మధ్య రాష్ట్రానికి మోదీ రానున్నారు. ఈ పనులతో రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మోదీతోపాటు అనేక మంది కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఒక్కసారిగా రాజధానిలో పనులు ప్రారంభమైతే మళ్లీ ఆయా ప్రాంతాల్లో భూముల విలువలు భారీగా పెరగనున్నాయి. దానికితోడుగా రాజధానికి ప్రాథమికంగా రూపురేఖలు వచ్చే అవకాశముంది.

40వేల కోట్ల పనులకు టెండర్లు

అమరావతి రాజధానిలో రూ.40 వేల కోట్ల పనులకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. మూడేళ్లలో పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించిన పనులపై మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ ప్రధాన దృష్టి పెట్టారు. ఈ పనులకు సంబంధించి ప్రపంచ బ్యాంకులు, ఆసియన్‌ డవలప్‌మెంట్‌ బ్యాంక్‌ సంస్థలు, నాబార్డు బ్యాంకులు రుణ సాయం కల్పించాయి. ప్రజాధనంతో రాజధానిని నిర్మించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇటీవల రాజధానికి కేటాయించిన రుణాలు రాష్ట్ర అప్పుల పరిధిలోకి రావని కేంద్రం ఒక లేఖ ద్వారా స్పష్టం చేసిన విషయం విదితమే. ఇది సెల్ఫ్‌ రాజధానిగా రూపుదిద్దుకుంటోందని, దీన్ని ద్వారా వచ్చే సంపదతో అభివృద్ధికి శ్రీకారం చుడతామని చెబుతున్నారు. అందుకే ప్రతిష్టాత్మకమైన ఈ పనుల ప్రారంభానికిగాను మోదీని ఆహ్వానిస్తున్నారు. రాజధానితో సహా రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రాజధాని నిర్మాణంతో దేశంతోపాటు ప్రపంచ దృష్టినే ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి పి.నారాయణ, అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాజధాని నిర్మాణ పనులు వేగవంతంగా ముందుకు సాగేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లల్లో నిమగ్నమైంది.

అడ్డంకులు అధిగమించిన కూటమి

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని పనులను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. ఒక్క పనీ పూర్తి చేయకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టకేలకు కూటమి ఘన విజయం సాధించడంతో రాజధాని నిర్మాణ పనులకు మార్గం ఏర్పడింది. నాడు 2015 అక్టోబర్‌లో విజయదశిమి నాడు రాజధాని పనులకు ప్రధాని మోదీ చేతుల మీదుగానే ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఆ సమయంలో చాలా వరకు పనుల ప్రారంభోత్సవాలకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కృషి చేసింది. రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం వ్యూహాత్మకంగా మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. ఎక్కడి పనులను అక్కడే నిలిపివేసింది. దీంతో పెద్దఎత్తున అమరావతి రాజధాని రైతులు ఉద్యమించారు. రైతుల ఉద్యమానికి టీడీపీ, జనసేన‌, బీజేపీ తదితర పార్టీలు సంఫీుభావం తెలిపాయి. ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతే ఏకైక రాజధాని అని మేనిఫెస్టోలో కూటమి పొందుపరిచింది. ఆ హామీ మేరకు పనుల ప్రారంభానికి కసరత్తు చేస్తోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా రాజధానికి పూర్తిస్థాయిలో అండగా నిలిచింది. కేంద్రం చొరవ వల్లే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు రూ.15వేల కోట్ల రుణాన్ని అత్యంత వేగంగా మంజూరు చేశాయి. హడ్కో కూడా రూ. 11వేల కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపాయి. దీంతో అమరావతి పనులకు ఇక ఎక్కడా అడ్డంకులు లేకుండా ముందుకు దూసుకుపోనున్నాయి. (Story: రాజ‌ధాని ప‌నుల ప్రారంభానికి డేట్ ఫిక్స్‌! మోదీ చేతుల మీదుగానే!)

Follow the Stories:

జగన్‌ చుట్టూ కోటరీ ఎవరు?

Friday Fear: మ‌రో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!

రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు

కొత్త రేషన్‌ కార్డులొస్తున్నాయి!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్ విప్ల‌వం: లాభ‌మా? న‌ష్ట‌మా?

వైసీపీకి ఇంటా, బయటా పోరు

హెల్మెట్ కొత్త రూల్స్‌!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version