Home అవీఇవీ! వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!

0

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!

వయస్సు నూరేళ్లు
ధర రూ.35 లక్షలు
విదేశాల నుంచి దిగుమతులు

న్యూస్‌తెలుగు/చింతూరు: ప్రపంచ నర్సరీ రంగానికి పోటీపడే విధంగా తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటివరకు విదేశాల్లో ఉండే ప్రత్యేకమైన మొక్కలకు సంబంధించిన గింజలు, దుంపలు లేదా అంట్లు వంటి వాటిని మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాతావరణానికి అనుకూలంగా పెంచి ఉత్పత్తి మొదలు పెట్టే వారు. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్…ఎన్నో ఏళ్ళు సమయం పట్టేది. కాని ఇప్పుడు నేరుగా పెద్ద పెద్ద వృక్షాలనే ప్రత్యేక కంటైనర్లు ద్వారా ఈ నర్సరీలకు తీసుకొచ్చి అమ్మకానికి పెడుతున్నారు. అలాంటి అరుదైన చెట్లు ఇప్పుడు సందర్శకులను అలరిస్తున్నాయి.. అబ్బుర పరుస్తున్నాయి.
తాజాగా కడియపులంక శ్రీ శివాంజనేయ నర్సరీ రైతు మల్లు పోలరాజు మూడు రోజుల క్రితం విదేశాల నుంచి వీటిని తీసుకొచ్చారు. వింత వింత ఆకారాలలో ఉన్న ఈ భారీ వృక్షాలు అందర్నీ అబ్బుర పరుస్తున్నాయి. ఔరా అనిపిస్తూ ఫోటోలకు ఫోజులిప్పిస్తున్నాయి. వీటిని ప్రత్యేక కంటైనర్ ఉంచి 75 రోజుల క్రితం షిప్ లో వేస్తే చెన్నై వచ్చాయి. అక్కడ నుంచి ఈ నర్సరీకి తరలించారు. దక్షిణ అమెరికా దేశంలో విరివిగా ఉండే ఈ మొక్కలను స్పెయిన్, థాయిలాండ్ వంటి దేశాల్లో విక్రయాలు చేపడుతున్నారు. పెద్దపెద్ద పార్కులు, హోటల్స్, ధనవంతుల గార్డెన్స్ లోనూ వీటిని ప్రత్యేక ఆకర్షణ కోసం పెంచుతారు. వీటి వయసు వంద నుంచి నూట ఇరవై ఏళ్లు ఉంటాయి.


ఇక ఈ మొక్క ఖరీదు విషయానికి వస్తే ఒక్కొక్కటి రూ.35 నుంచి 40 లక్షలు ఉంటాయి. ప్రస్తుతం మోడులుగా కనిపిస్తున్న వీటికి చిన్నచిన్న కొమ్మలు వచ్చి రంగురంగుల పువ్వులు పూస్తాయి. అప్పుడు మరింత శోభాయమానంగా నీ మొక్కలు సందర్శకులను అలరిస్తాయి.ప్రపంచ నర్సిరీ రంగంలో ఏమాత్రం తీసి పోమని చాటి చెప్పడానికి వీటిని ఎక్కడకు తీసుకొచ్చినట్లు నర్సరీ రైతు మల్లు పోలరాజు తెలిపారు.
ఇంతకీ ఈ మొక్క పేరు చెప్పలేదు కదూ…స్థానికంగా “సిల్క్ ప్లోస్ ట్రీ”అంటారు. దీని శాస్త్రీయ నామం Chorisia speciosa.ఈ మొక్కలు కడియం నర్సరీలతో పాటు ఇటీవల హైదరాబాదు సమీపంలో 150 ఎకరాలలో ఏర్పాటు చేసిన పార్కులో ఉన్నాయి. అక్కడ ఉన్నాయి కదా అని ఇక్కడ మాదిరిగా వెళ్లిపోయి ఫొటోలు తీయించుకోవడానికి కుదరదండోయ్.. వీక్షకులు ఎవరైనా రూ.1800లతో టిక్కెట్ తీసుకుని లోపలకి వెళ్లాలట. (Story: వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!)

Follow the Stories:

దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్ విప్ల‌వం: లాభ‌మా? న‌ష్ట‌మా?

ఇంటర్‌ విద్యార్థులకు పండుగలాంటి వార్త!

వైసీపీకి ఇంటా, బయటా పోరు

హెల్మెట్ కొత్త రూల్స్‌!

చంద్రబాబు చాణిక్యం ఫలించేనా?

ఇంజినీరింగ్‌ కాలేజీలపై నిఘా?

మావోల కింకర్తవ్యం?

నంబరు-2 రూటెటు?

కల్తీ ఇలా.. కనిపెట్టేది ఎలా..?

షుగ‌ర్ రాకుండా తినాల్సిన 5 ప‌దార్థాలు!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version