Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ​ వినుకొండ రామలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ పనుల పరిశీలన

​ వినుకొండ రామలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ పనుల పరిశీలన

0

​ వినుకొండ రామలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ పనుల పరిశీలన

​ 7వ రోజుకు చేరుకున్న గిరి ప్రదక్షిణ రోడ్డు పనులు

 పనులను పరిశీలించిన పలువురు ప్రముఖులు

న్యూస్ తెలుగు/వినుకొండ :  వినుకొండ కొండ పైన వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థాన కొండ చుట్టూ జరుగుతున్న గిరి ప్రదక్షిణ రోడ్డు పనులు 7వ రోజుకు చేరుకున్నాయి. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా వినుకొండ పట్టణ ప్రభుత్వ ఏజీపీ, సీనియర్ న్యాయవాది ముప్పాల జ్ఞానేశ్వర్ రావు మాట్లాడుతూ.. స్వామివారికి చెందిన కొండ చుట్టూ ఉన్న స్థలమునందే ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉండడం శుభపరిణామమని, ఇది స్వామి వారి మహిమ అని పేర్కొన్నారు.ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్ల రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవకులు, గుంటూరు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ బాబా సేవకులుగా జెట్టి శ్రీనివాసరావు, జాజుల మాల్యాద్రి స్వామివారి సేవలో ఉన్నారని తెలిపారు. వేల తరబడి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్న సేవకులు, కొండపైన కూడా అన్నదాన బాధ్యతలు చేపట్టారని వివరించారు. వినుకొండ ప్రజలు, ఈ ప్రాంతం అంతా సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రోటరీ క్లబ్ ఆంధ్ర రీజియన్ జోనల్ చైర్మన్ ఆల శ్రీనివాసరావు, వినుకొండ రోటరీ క్లబ్ మెంబర్షిప్ డైరెక్టర్ బత్తుల శ్రీనివాసరావు ఈ కార్యక్రమానికి విచ్చేసి జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవకులు కనువాల వెంకటేశ్వర్లు, పిచ్చయ్య మరియు మహిళా సేవకులు పాల్గొన్నారు.(Story : ​ వినుకొండ రామలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ పనుల పరిశీలన )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version