అనాధ శవానికి అంతక్రియలు..
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆదర్శ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ్యులు శనివారం అనాధ శవానికి అంతక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు పివి. సురేష్ బాబు మాట్లాడుతూ. వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి గత రెండు రోజుల క్రితం మృతి చెందారు. వినుకొండ పట్టణ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీలో ఉంచి మృతుని ఆచూకీ ప్రయత్నించిన ఆచూకీ లభించలేదు. సమాచారం తెలుసుకున్న ఆదర్శ ఫౌండేషన్ సభ్యులము ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పోలీసుల అనుమతితో మృతదేహాన్ని సందర్శించి అనాధ శవాన్ని స్వయంగా స్మశానానికి తరలించి అంతక్రియలు చేసినట్లు వారు తెలిపారు. ఎవరూ లేని ఈ అనాధ గత కొంతకాలంగా వినకొండ పట్టణంలోని హోటల్స్ లో పని చేసుకుంటూ జీవనం సాగించేవాడని, అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీస్ విచారణలో తెలిసిందన్నారు. ఆదర్శ ఫౌండేషన్ సభ్యులు మానవతా దృక్పథంతో ఇప్పటికి అనేక అనాధ శవాలకు అంతక్రియలు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పువ్వాడ కృష్ణ, షేక్ అక్బర్ బాషా, గుంటకల్ అంజి, షేక్. మాలిక్, సభ్యులు పాల్గొన్నారు.(Story : అనాధ శవానికి అంతక్రియలు.. )
