జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి!
న్యూస్ తెలుగు/అమరావతి:మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించి గాంధీనగర్ జిల్లా జైలు నుంచి తిరిగి తాడేపల్లి బయలుదేరుతున్న సమయంలో ఒక అభిమాని తన కుమార్తెను తీసుకుని వైయస్ జగన్‌ను కలిసేందుకు వచ్చారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు ఉండడంతో ఆ రద్దీలో కలవలేననుకున్న చిన్నారి ఒక్కసారిగా ఏడ్చింది. దీనిని గమనించిన వైఎస్ జగన్ తన కాన్వాయ్ ఆపి ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని ముద్దాడారు. తనతో సెల్ఫీ దిగారు. దీంతో ఆ చిన్నారి ఆనందానికి హద్దుల్లేవు. తిరిగి వైఎస్ జగన్‌ను ముద్దాడి సంతోషంగా ఇంటికి వెళ్ళింది. (Story: జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి!)
Follow the Stories:
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?
ఇంటర్ విద్యార్థులకు పండుగలాంటి వార్త!
కల్తీ ఇలా.. కనిపెట్టేది ఎలా..?