Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!
వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఒక్కొక్కరుగా కటకటాలపాలు
రెడ్‌బుక్‌తో గజ..గజ..!
ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి జైలుపాలు
మరికొందరు కీలక నేతలపై కేసులు
న్యూస్ తెలుగు/అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్‌ఆర్‌సీపీ నేతల అవినీతి చిట్టా ఒకొక్కక్కటీ వెలుగులోకి తీస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అవినీతిమయం, దోపిడీ, దౌర్జన్యాలు, నోటి దురుసు, సామాజిక మాధ్యమాల్లో విచ్ఛలవిడిగా వ్యాఖ్యలు చేయడం..ఎలాగైతేనే అన్ని రకాలా కూటమి పార్టీల నేతలను అప్రతిష్టపాల్జేసిన వారిపై రెడ్‌బుక్ దూసుకొస్తోంది. మంత్రి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో చెప్పిన తరహాగానే..అధికారంలోకి వచ్చాక చట్టబద్ధంగా వాటిని అమలు చేస్తున్నారు. చాలా మంది ముఖ్య వైసీపీ నేతలు జైలు పాలయ్యారు. మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో పోసోని కృష్ణమురళి అరెస్టుతో వైఎస్‌ఆర్‌సీపీలో మరింత ఆందోళన పెరిగింది. ఈనెల 26వ తేదీన హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో పోసోని కృష్ణమురళీని చెడ్డీపై ఉండగానే పోలీసులు అరెస్టు చేసి..ఏపీలో ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించడం చర్చానీయాంశంగా మారింది. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోల్ అయ్యాయి. రాజకీయ పార్టీల మధ్య విధ్వేషాలు, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోసానిపై ఏపీలోని ఓబులావారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నాయకుడు జోగినేని మణి పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ..ఫిర్యాదు ఆధారంగా పోసానిపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోసాని కృష్ణమురళీ వ్యవహారశైలితో ఈ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు ఆయనపై కూటమి పార్టీల నేతలు కేసులు పెట్టారు. ఎట్టకేలకు పోసానిని అరెస్టు చేసి..వైద్య పరీక్షల అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దీని ఆధారంగా మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉంటారు. ఇప్పటికే తాను రాజకీయాలకు స్వస్తి చెప్పినట్లు పోసాని ప్రకటించినప్పటికీ, ఆయనపై ఉన్న కేసులతో అరెస్టు చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
పోసాని అరెస్టుపై స్పందించిన మాజీ సీఎం జగన్
పోసాని కృష్ణమురళీ అరెస్టుపై మాజీ సీఎం, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఆయన భార్యకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని, ఇప్పటికే వైసీపీ లీగల్ టీమ్ తరపున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అక్కడకు వెళ్లి న్యాయపరమైన సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారని తెలిపారు. కూటమి ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంభిస్తోందని జగన్ విమర్శించారు. పోసాని అరెస్టు అప్రజాస్వామికమని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తప్పుపట్టారు. అరెస్టయిన నేతలను జైళ్లకు వెళ్లి జగన్ పరామర్శించారు. ఈవీఎం కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైలులో జగన్ పరామర్శించారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను గుంటూరు జైలుకు వెళ్లి కలిశారు. ఇటీవల విజయవాడ జిల్లా జైలులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారు. ఆయా పరామర్శల అనంతరం తన పార్టీ నేతలపై అన్యాయంగా కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని జగన్ మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు..వంశీపై మరిన్ని కేసులు
వైఎస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. గోరంట్ల మాధవ్‌కు నోటీసులు ఇవ్వడంపై వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఆయన వికృతమైన చేష్టలు చేశారన్న ఆరోపణలపై కొన్ని వీడియోలు సామాజిక మాద్యమాల్లో ట్రోల్ అయ్యాయి. వాటిపై అప్పటి ప్రతిపక్ష టీడీపీ పెద్దఎత్తున వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై దాడి చేశారు. ఇదే అదునుగా గోరంట్ల మాధవ్‌కు ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ దక్కలేదు. అయినప్పటికీ ఆయన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వరుసగా ఒక్కొక్కరిపై కేసుల నమోదుతో వారికి దిక్కుతోచడం లేదు. ఇప్పటికే అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో వంశీకి మరింతగా ఉచ్చు బిగిస్తున్నట్లుగా తెలుస్తోంది. విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న వంశీని ఇటీవల పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకుని విచారించారు. ఆ విచారణలో ఆయన ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిసింది. కస్టడీ ముగియడంతో ఆయన్ని తిరిగి జైలుకు తరలించారు. మరోసారి కస్టడీ కోరుతూ కోర్టును పోలీసులు ఆశ్రయించనున్నారు. వంశీ తనకు బెయిల్ ఇవ్వాలంటూ న్యాయస్థానాలను ఆశ్రయించినప్పటికీ, అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇలా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఒక్కొక్కరూ జైళ్లకు వెళ్లడంతో ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. వారికి మనోధైర్యం కల్పించే పనిలో అధినేత జగన్ నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో రానున్న శుక్రవారం పోలీసులు ఎవరిని అరెస్టు చేస్తారా? అన్న అంశంపై ఆసక్తి పెరిగింది. గోరంట్ల మాధవ్ అరెస్టుకు దాదాపు రంగం సిద్ధమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయనతోపాటు మరో వైసీపీ నేతను అరెస్టు చేసేందుకు పోలీసులు ఫైళ్లు తిరగేస్తున్నట్లుగా తెలిసింది. ఏదేమైనప్పటికీ, వారానికో, రెండు వారాలకో ఒక అరెస్టు ఖాయమని ఖరారైంది. (Story: Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!)
Follow the Stories:
ఏపీ బడ్జెట్ ఎలా ఉండబోతున్నదంటే?
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
జగన్..జస్ట్ ఫైవ్ మినిట్స్! అలా వచ్చి..ఇలా వెళ్లి..!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)
వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైరస్!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?