Home అవీఇవీ! మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

0

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

హర్‌ఘర్‌ లఖ్‌పతితో సాధ్యం
ఎస్‌బీఐ రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌
సామాన్య ప్రజల పొదుపునకు మేలు
రోజకు రూ.86..నెలకు రూ.2500తో లక్షలాధికారి పక్కా
క్రేజీ స‌బ్జెక్ట్‌గా మారిన ఎస్‌బీఐ సేవింగ్స్ స్కీమ్‌

న్యూస్‌ తెలుగు/అమరావతి: మీరు..36 నెలల్లో లక్షాధికారి కావాలని కలలు కంటున్నారా?. అయితే ఇది మీ కోసమే. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) పిలుస్తోంది. ఎస్‌బీఐ ద్వారా అన్ని వర్గాలకు అనుకూలంగా ‘హర్‌ఘర్‌ లఖ్‌పతి’ అనే రికరింగ్‌ డిపాజిట్‌(ఆర్‌డీ) పొదుపు పథకాన్ని తీసుకొచ్చింది. ప్రతి ఇంటా లక్షాధికారి అనే నినాదంతో ఎస్‌బీఐ రికరింగ్‌ డిపాజిట్‌ను నూతనంగా ప్రవేశపెట్టింది. అన్ని ఎస్‌బీఐ బ్యాంకుల్లో వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా ఆర్‌డీ ఖాతాలు తెరచే సౌకర్యం కల్పించింది. ఇప్పటివరకు ఆర్‌డీ అంటే..పోస్టల్‌ శాఖకే పరిమితమయ్యేది. దానికి మించిన విధంగా సామాన్య, మధ్యతరగతి, ఆటో డ్రైవర్‌, చిన్న వ్యాపారా ఇలా..అందరూ లక్షలాధికారి కావాలన్న ఆశలకు అనుకూలంగా ఎస్‌బీఐ ఆర్‌డీని రూపొందించింది. ప్రతి నెలా చిన్న మొత్తంలో జమ చేస్తూ ఒకేసారి లక్ష రూపాయలు అందేలా ఎస్‌బీఐ హర్‌ ఘర్‌ లఖ్‌పతి రికరింగ్‌ డిపాజిట్‌ను ప్రవేశపెట్టింది. ప్రతి ఇంటిలో ఒక లక్షాధికారి ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ పథకానికి మంచి స్పందన లభిస్తోంది. ఎస్‌బీఐ రికరింగ్‌ డిపాజిట్‌ అనేది ఒక పొదుపు లాంటింది. దీని ద్వారా నెలనెలా తక్కువుగా డబ్బులు దాచుకోవచ్చు. ఖాతా ప్రారంభ సమయంలో ఎన్ని నెలలు, నెలనెల ఎంత కట్టాలనేదీ ముందే నిర్థారించుకోవాలి. అలా ప్రతినెలా జమయ్యే డబ్బులపై వడ్డీ లభిస్తుంది. మళ్లీ ప్రతి నెలా వడ్డీపైన వడ్డీ తోడవుతుంది. కాంపౌండింగ్‌ మ్యాజిక్‌తో తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడి అందుతుంది. ఎస్‌బీఐ తీసుకొచ్చిన హర్‌ఘర్‌ లఖ్‌పతి ఆర్‌డీ స్కీమ్‌లో మన దేశ ప్రజలందరు వ్యక్తిగతంగా గాని, సంయుక్త ఖాతాగాని తెరిచి ప్రవేశించవచ్చు. 10 ఏళ్లపైన వయసు ఉన్న మైనర్లు సైతం సొంతంగానే ఖాతా తీసుకోవచ్చు. అంతకన్నా వయసు తక్కువగా ఉంటే తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుల హామీతో ఖాతాకు అవకాశం కల్పిస్తారు.

లక్ష రూపాయలు రావాలంటే ఎంత కట్టాలి?

ఒక సాధారణ ఖాతాదారుడికి లక్ష రూపాయలు రావాలంటే ఎస్‌బీఐలో హర్‌ఘర్‌ లఖ్‌పతి పథకానికి ఈ విధంగా రికరింగ్‌ డిపాజిట్‌ చేయాలి. మూడేళ్ల కాలానికి నెల నెలా రూ.2,500 చెల్లించినట్లయితే వడ్డీ 6.75 శాతంతో మెచ్యూరిటీ తర్వాత చేతికి లక్ష రూపాయలు అందుతాయి. నాలుగేళ్ల వ్యవధిని ఎంచుకుని నెలకు రూ.1810 చెల్లించినట్లయితే వడ్డీ రేటు 6.75 శాతంతో మెచ్యూరిటీ తర్వాత చేతికి లక్ష రూపాయలు వస్తాయి. ఐదేళ్ల వ్యవధిని ఎంచుకుని సాధారణ కస్టమర్‌ నెలకు రూ.1407 చెల్లిస్తే రూ.6.50 శాతం వడ్డీతో చేతికి లక్ష రూపాయలు చేతికి అందుతాయి. 60 ఏళ్లపైబడిన పైబడిన సీనియర్‌ సిటిజన్లకు 3 ఏళ్ల కాలానికి నెలకు రూ.2480 కడితే 7.25 శాతం వడ్డీతో మెచ్యూరిటీ తర్వాత లక్ష రూపాయలు లభిస్తాయి. 4 ఏళ్లకుగాను నెలకు రూ.1791, ఐదేళ్లకు అయితే నెలకు రూ.1389 చొప్పున చెల్లిస్తే…మెచ్యూరిటీ తర్వాత లక్ష వస్తాయి. ఎస్‌బీఐ హర్‌ ఘర్‌ లక్షాధిపతి రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ మెచ్యూరిటీ పీరియడ్‌ 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఉంటుంది. ఖాతాదారులు తమకు నచ్చిన కాల వ్యవధి ఎంచుకుని డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. మెచ్యూరిటీకి ముందే డబ్బులు వెనక్కి తీసుకోవాలంటే రూ.5 లక్షలలోపు డబ్బులు ఉంటే వడ్డీలో 0.50 శాతం, రూ.5 లక్షలపైన అయితే వడ్డీ రేటులో 1 శాతం అపరాధ రుసుం పడుతుంది. 7 రోజుల కన్నా తక్కువగా ఉండే డిపాజిట్లకు ఎలాంటి వడ్డీ ఇవ్వరు. మరోవైపు.. నెల నెలా సమయానికి వాయిదాలు చెల్లించకపోతే 5 ఏళ్లలోపు టెన్యూర్‌ డిపాజిట్లకు ప్రతి రూ.100కు రూ.1.50 అపరాధ రుసుం వేస్తారు. 5 ఏళ్లపైన టెన్యూర్‌ ఉండే డిపాజిట్లు అయితే ప్రతి రూ.100కు రూ.2 చొప్పున అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ తీసుకొచ్చిన హర్‌ఘర్‌ లఖ్‌పతి పథకం పేద, మధ్యతరగతి వర్గాలు సులభంగా లక్షాధికారి అయ్యేందుకు తోడ్పడుతుంది. రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి. మీరు చక్రవడ్డీ ద్వారా అధిక లాభం పొందవచ్చు.

రోజుకు రూ.85 పొదుపుతో చేతికి లక్ష

ఎస్‌బీఐ హర్‌ఘర్‌ లఖ్‌పతి పథకంలో భాగంగా ఖాతాదారులు రోజుకు రూ.85 చొప్పున, అనగా నెలకు రూ.2,500 జమవుతుంది. ఇలా మూడేళ్లపాటు పొదుపు చేస్తే, మెచ్యూరిటీ నాటికి చేతికి లక్ష రూపాయలు వస్తుంది. వివాహాలు, ఇంటి కొనుగోళ్లకు ప్లాన్‌ చేసే వారికి ఇది మంచి అవకాశం. విద్యార్థుల చదువులకు, ఇతరత్రా అవసరాలకు మనం దాచుకునే ఈ సొమ్ము ఎంతో ఉపయోగపడుతుంది. కట్టిన దానికంటే వడ్డీ కలిసి అదనంగా తోడవుతుంది. మన కట్టే ప్రతి రూపాయికి ఎస్‌బీఐ భద్రతా నిలుస్తుంది. మరి చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనుకునే వారు వెంటనే ఎస్‌బీఐ హర్‌ఘర్‌ లక్‌పతి రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లో చేరండి. వారి ఆధార్‌, పాన్‌, ఫోటోల వివరాలు అందించాలి. ఖాతా ప్రారంభించే ముందు ఎంచుకునే కాలం, నెలకు ఎంత వాయిదా చెల్లించాలనేదీ ముందే ఒక అవగాహనకు రావాలి. ఒక్కసారి ఆర్‌డీ ప్రారంభించి నెలనెలా కట్టిన సొమ్ము..మూడేళ్ల మెచ్యూరిటీ అనంతరమే అది చేతికి వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం?. పూర్తి వివరాల కోసం సమీపంలోని ఎస్‌బీఐ బ్రాంచిని సంప్రదించండి. లేదా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ పథకంపై ఉన్న వివరాలను తెలుసుకోండి. (Story: మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?)

Follow the Stories:

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్ విప్ల‌వం: లాభ‌మా? న‌ష్ట‌మా?

ఇంటర్‌ విద్యార్థులకు పండుగలాంటి వార్త!

వైసీపీకి ఇంటా, బయటా పోరు

హెల్మెట్ కొత్త రూల్స్‌!

చంద్రబాబు చాణిక్యం ఫలించేనా?

ఇంజినీరింగ్‌ కాలేజీలపై నిఘా?

మావోల కింకర్తవ్యం?

నంబరు-2 రూటెటు?

కల్తీ ఇలా.. కనిపెట్టేది ఎలా..?

షుగ‌ర్ రాకుండా తినాల్సిన 5 ప‌దార్థాలు!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version