దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!
అవాక్కయిన భక్తులు
అధికారుల నిర్లక్ష్యానికి నిలువటద్దం
న్యూస్‌తెలుగు/విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు దర్శనమిచ్చని ఉదంతం కలకలం రేపింది. పవిత్రంగా భావించే అమ్మవారి లడ్డూలో వెంట్రుకలు ఉండటంతో భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. శనివారంనాడు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పంపిణీ చేసే పవిత్రమైన లడ్డూలో వెంట్రుకలు ఉన్నట్లు గుర్తించిన భక్తులు షాకయ్యారు. లడ్డూల తయారీలో దుర్గగుడి అధికారుల నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోంది. దుర్గగుడి లడ్డూల విషయంలో నాణ్యతలోపంపై ఎప్పటికప్పుడు విమర్శలు వస్తున్నప్పటికీ, అధికారుల తీరు మారటం లేదు. ఆ దిశగా వారి చర్యలు ఉండటం లేదు. తాజాగా లడ్డూలో ఏకంగా వెంట్రుకలు ఉండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ ఉదంతం వివాదాస్పదంగా మారింది. దీనిపై సమాధానం ఇవ్వడానికి దేవస్థానం అధికారులు నిరాకరించారు. ప్రసాదంలో వెంట్రుకలు ఒక్కోసారి పడవచ్చని ఓ ఉద్యోగి వ్యాఖ్యానించడంతో భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. ప్రతి రోజూ దేవస్థానంపై వేలాది లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు పంపిణీ అవుతుంటాయి. ఉచిత ప్రసాదాలు ఉండకపోయినప్పటికీ, భక్తులు వాటిని కొనుక్కుంటారు. శనివారం ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూలో వెంట్రుకలు ఉండటంతో అతను అవాక్కయ్యాడు. ఈ విషయం మీడియాకు పొక్కడంతో ఉదంతం వివాదాస్పదమయింది. అధికారులు మాత్రం మౌనం వహించారు. (Story: దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు!)
Follow the Stories:
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి
జైల్లో నా భర్తను.. టార్చర్ చేస్తున్నారు..!
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ విప్లవం: లాభమా? నష్టమా?
ఇంటర్ విద్యార్థులకు పండుగలాంటి వార్త!
కల్తీ ఇలా.. కనిపెట్టేది ఎలా..?