Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ Big Alert: వణికిస్తున్న కొత్త వైర‌స్‌!

Big Alert: వణికిస్తున్న కొత్త వైర‌స్‌!

0

వణికిస్తున్న కొత్త వైర‌స్‌!

వైర‌స్ పేరు..గులియన్‌ బారే సిండ్రోమ్ (జీబీఎస్‌)

గుంటూరులో తొలి మరణం
17 కేసుల నమోదుతో ప్రజల గజగజ
తెలుగు రాష్ట్రాల‌కు అతిపెద్ద ముప్పు

న్యూస్‌ తెలుగు/అమరావతి: తెలుగు రాష్ట్రాల ప్రజల్ని గులియన్‌ బారే సిండ్రోమ్‌ (జీబీఎస్‌) వైరస్‌ వణికిస్తోంది. ఇది క‌రోనా వైర‌స్‌ను త‌ల‌పింప‌జేస్తున్న‌ది. ఏపీ, తెలంగాణ‌లో ఒక వైపు బర్డ్‌ ఫ్లూతో ప్రజలు అల్లాడిపోతుండగా..మరోవైపు జీబీఎస్‌ విస్తరణ కలవరపాటు క‌లిగిస్తోంది. జీబీఎస్ బారిన పడిన ఓ మహిళ తొలి మరణం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది. ప్రభుత్వం ఈ వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సమయంలోనే మహిళ మృత్యువాతకు గురవవ్వడం వైద్యాధికారులకు సవాల్‌గా నిలిచింది. ఆదివారం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతోన్న కమలమ్మ అనే మహిళ జీబీఎస్‌ వ్యాధితో చనిపోయింది. రెండు రోజుల కిత్రం ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లిలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ వ్యాధి కలకలం రేగింది. ఆ గ్రామానికి చెందిన వృద్ధురాలు కమలమ్మకు ఈ వ్యాధి సోకడంతో.. తీవ్ర జ్వరంతో కాళ్లు చచ్చు పడిపోయి, తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమెను గుంటూరులోని జీజీహెచ్‌కు కుటుంబీకులు తరలించారు. కమలమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ వ్యాధి సోకి మరణించిన తొలి మహిళ కమలమ్మ కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైద్యాధికారుల బృందాలు ఆమె నివాస గ్రామానికి తరలివెళ్లి, అక్కడి ప్రజలకు పరీక్షలు నిర్వహించారు. దీంతో ఎవరికీ వ్యాధి లక్షణాలు లేవని ప్రాథమికంగా నిర్థారించారు.

ఏపీలో 17గులియన్‌ బార్రే సిండ్రోమ్‌ (జీబీఎస్‌) కేసులు నమోదు అయ్యాయని ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రకటించిన విషయం విదితమే. విజయనగరం, విజయవాడ, అనంతపురం జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదు కాగా, కాకినాడలో 4, గుంటూరు, విశాఖలో 5 చొప్పున జీబీఎస్‌ కేసుల్ని గుర్తించారు. లక్ష మందిలో ఒక్కరికి మాత్రమే జీబీఎస్‌ సిండ్రోమ్‌ సోకుతుందని, రోగ నిరోధక శక్తిని నశింపజేసేలా జీబీఎస్‌ సిండ్రోమ్‌ పనిచేస్తుందని, దీనికి ఇంట్రా వీనస్‌ ఇమ్యూనో గ్లోబిన్‌ ఇంజెక్షన్‌ చేయించుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా 8వేల వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచినట్లు వైద్యారోగ్యశాఖాధికారులు పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ వైద్యసేవ ఉచిత చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, జీబీఎస్‌ బాధితులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఇదే సమయంలో ఈ వ్యాధితో గుంటూరులో కమలమ్మ మృతి చెందడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో జీబీఎస్‌ వ్యాధి ఇప్పటికే తీవ్ర కలవరం పుట్టించింది. ఇటీవలనే ఈ వ్యాధి తెలంగాణలోకి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించింది. బర్డ్‌ ఫ్లూ, జీబీఎస్‌ వ్యాధులు ఏకకాలంలో రావడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. (Story: Big Alert: వణికిస్తున్న కొత్త వైర‌స్‌!)

Follow the Stories:

దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

లైసెన్సుల్లో గోల్‌మాల్‌!

రోజాకు జగన్‌ చెక్‌?

రిజిస్ట్రేషన్‌ శాఖలో డిజిట‌ల్ విప్ల‌వం: లాభ‌మా? న‌ష్ట‌మా?

ఇంటర్‌ విద్యార్థులకు పండుగలాంటి వార్త!

వైసీపీకి ఇంటా, బయటా పోరు

హెల్మెట్ కొత్త రూల్స్‌!

చంద్రబాబు చాణిక్యం ఫలించేనా?

ఇంజినీరింగ్‌ కాలేజీలపై నిఘా?

మావోల కింకర్తవ్యం?

నంబరు-2 రూటెటు?

కల్తీ ఇలా.. కనిపెట్టేది ఎలా..?

షుగ‌ర్ రాకుండా తినాల్సిన 5 ప‌దార్థాలు!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version