సుందరం–క్లేటాన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ లక్ష్మివేణు
Lakshmi Venu: భారతదేశపు సుప్రసిద్ధ ఆటో విడిభాగాల తయారీదారులలో ఒకటైన సుందరం క్లేటాన్ లిమిటెడ్ (ఎస్‌సీఎల్)కు మేనేజింగ్ డైరెక్టర్‌గా నేడు జరిగిన బోర్డ్ సమావేశంలో డాక్టర్ లక్ష్మి వేణు బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు సుందరం క్లేటాన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా డాక్టర్ వేణు బాధ్యతలు నిర్వర్తించారు.
దాదాపు ఓ దశాబ్ద కాలంగా సుందరం క్లేటాన్‌ను డాక్టర్ లక్ష్మి వేణు ముందుండి నడిపిస్తున్నారు. అంతర్జాతీయంగా సుందరం క్లేటాన్ విస్తరించడంలో అత్యంత కీలకమైన పాత్రను పోషించారామె. అంతేకాదు, వోల్వో, హ్యుందాయ్, డైమ్లెర్, కమ్మన్స్ లాంటి సంస్థలతో లోతైన సంబంధాలను నిర్మించడంలోనూ ఆమె అనన్యసామాన్యమైన పాత్రను పోషించారు.
సుందరం క్లేటాన్ ఛైర్మన్ శ్రీ ఆర్ గోపాలన్ మాట్లాడుతూ ‘‘వినియోగదారులను లోతుగా లక్ష్మి అర్థం చేసుకోవడంతో పాటుగా అంతర్జాతీయంగా వినియోగదారులతో బలమైన సంబంధాలు ఏర్పడటంలోనూ ఆమె కీలకంగా వ్యవహరించారు. ప్రపంచ శ్రేణి ఆటో విడిభాగాల తయారీదారునిగా సుందరం క్లేటాన్‌ను ఆమె తీర్చిదిద్దగలరనే విశ్వాసంతో ఉన్నాను’’ అని అన్నారు
సుందరం క్లేటాన్ ఆడిట్ కమిటీ ఛైర్మన్ అడ్మిరల్ పీజె జాకోబ్ (రిటైర్డ్) మాట్లాడుతూ ‘‘ఈ కష్టకాలంలో కూడా కంపెనీకి ఆమె అసాధారణ తోడ్పాటునందించారు. షాప్ ఫ్లోర్ నుంచి కంపెనీలో ఉన్నత స్థాయికి చేరడం వరకూ ఆమె పడిన కష్టానికి ప్రతిఫలమిది. కంపెనీని మరిన్ని ఉన్నత శిఖరాలను ఆమె చేర్చగలదని ఆశిస్తున్నాను’’ అని అన్నారు
సుందరం క్లేటాన్ ఛైర్మన్ ఎమిరిటస్ శ్రీ వేణు శ్రీనివాసన్ మాట్లాడుతూ ‘‘గత దశాబ్ద కాలంగా లక్ష్మి అంకితభావంతో కూడిన ప్రయత్నాలు, ఆమె దృష్టి వంటివి కంపెనీ నాణ్యత, లాభదాయకత, ఓఈఎంలతో సంబంధాలను నెరపడంలో తోడ్పడ్డాయి. ఇటీవల యుఎస్‌లో సంస్ధ కార్యకలాపాలు ప్రారంభించడంలో ఆమె కీలకపాత్ర పోషించారు.ఆమె నేతృత్వంలో సుందరం క్లేటాన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందగలదని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.
సుందరం క్లేటాన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మి వేణు మాట్లాడుతూ ‘‘ సుందరం క్లేటాన్ తరువాత దశ వృద్ధికి నేతృత్వం వహిస్తుండటాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాము. మాకు అత్యద్భుతమైన బృందం ఉంది. కలిసికట్టుగా సుందరం క్లేటాన్‌ను ఇండియా, అంతర్జాతీయంగా బలోపేతం చేయనున్నాము’’ అని అన్నారు. (Story: సుందరం–క్లేటాన్ ఎండీగా డాక్టర్ లక్ష్మివేణు)
See Also:
పరువుహత్యలో మరిన్ని నిజాలు వెలుగులోకి!
కేసీఆర్‌ను షర్మిళ అంతమాట అనేశారా!
‘అసని’ తుపాను ముప్పు: ‘అసని’ అంటే?
మేనమామతో అక్రమ సంబంధం.. భర్తను తాగించి…!
మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!
ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది!
ప్రభుదేవా కొరియోగ్రఫీలో మెగాస్టార్ దద్దరిల్లిపోయే పాట!
నైట్‌క్లబ్‌లో రాహుల్ గాంధీ.. వీడియో వైరల్
కేసీఆర్‌కు 20కిమించి సీట్లు రావు
తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు
లైవ్‌లో రభస: హీరోని గెటవుట్ అన్న టీవీ9 యాంకర్!
సర్కారువారి పాట ట్రైలర్ అదిరింది! (Video)
పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!
భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్!
చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్!
హీరోయిన్‌పై రేప్ కేసు…పరారీలో యాక్టర్!
చదివింది మల్టీమీడియా…చేసేవి దొంగతనాలు!
అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు
17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి
డ్యాన్స్ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్