Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రాయనపాడు చెరువుని ఆక్రమిస్తే స‌హించంః దోనేపూడి శంకర్

రాయనపాడు చెరువుని ఆక్రమిస్తే స‌హించంః దోనేపూడి శంకర్

0

రాయనపాడు చెరువుని ఆక్రమిస్తే స‌హించంః దోనేపూడి శంకర్

న్యూస్‌తెలుగు/విజ‌య‌వాడ: రాయన పాడు చెరువును అక్రమణకు గురికాకుండా పరిరక్షించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మరియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ మండలం రాయన పాడు చెరువు అన్యాక్రాంతమవుతున్న నేపథ్యంలో ఆ చెరువును సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తరతరాలుగా ఆయకట్టు రైతులకు మరియు చెరువు ఆధారంగా ఏర్పడిన స్థానిక దళిత మత్స్య సొసైటీ సభ్యులకు జీవనాధారంగా ఉన్న ఈ చెరువును ఆక్రమణ గురికాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ చెరువు 300ఎకరాలు విస్తరణలో ఉందని కొంత మంది పెత్తందార్లు ఈ చెరువును వివిధ కారణాలతో ఆక్రమణ చేస్తున్నరన్నారు.ఈ చెరువు ఆధారంగా సుమారు 100 మంది దళిత మత్స్యకారులు సోసైటి ఏర్పాటు చేసుకుని జీవనం పొందుతున్నారన్నారు. ఈ చెరువు అక్రమణ గురైతే ఒకవైపు రైతులు మరోవైపు దళిత మత్స్యకారులు జీవనాధారం కోల్పోయి వీధిన పడే అవకాశం ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రాయనపాడు చెరువును పరిరక్షించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ,దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బుట్టి రాయప్ప,డి హెచ్ పి ఎస్ విజయవాడ నగర అధ్యక్షులు సంగుల పేరయ్య,కౌలురైతుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పెయ్యల వెంకటేశ్వరరావు, సిపిఐ రాయనపాడు గ్రామ కార్యదర్శి బత్తుల సత్యనారాయణ, రాయనపాడు దళిత మత్స్య సోసైటి కార్యదర్శి బోళ్ళ రవి,సోసైటి సభ్యులు మల్లాది వెంకటేశ్వరరావు,మందా ఏసుపాదం, తదితరులు పాల్గొన్నారు. (Story: రాయనపాడు చెరువుని ఆక్రమిస్తే స‌హించంః దోనేపూడి శంకర్)

Just Look:

ఆ చేప కన్పిస్తే..సునామీనే!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version