మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!
Gang Rape: మహిళలపై అత్యాచారాలకు అంతులేకుండా పోతున్నది. మగాళ్లు మృగాలుగా మారి బరితెగిస్తున్నారు. తాజాగా వెలుగుచూసిన అత్యాచారం గురించి వింటే కళ్లనీళ్లు రాకతప్పవు. కొంతమంది యువకులు ఒక మైనర్‌బాలికను బంధించి వరుసగా నాలుగు రోజులపాటు గ్యాంగ్‌రేప్ చేసి, వదిలిపెట్టారు. ఆ తర్వాత ఆ పాప పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అక్కడ కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా స్టేషన్ ఆఫీసర్ ఆమెను అత్యాచారం చేశాడు. ఇప్పుడిక ఆమె తన గోడును ఎక్కడ వెలిబుచ్చాలో అర్థం కాక ఆత్మహత్యకు ప్రయత్నించి, చివరకు ఎవరో ఇచ్చిన సలహాతో పోలీసు ఉన్నతాధికారులను కలిసింది. దీంతో న్యాయం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ అమానుషం చోటు చేసుకుంది. లలిత్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. గత నెల ఏప్రిల్ 22న 13 ఏళ్ల బాలికను నలుగురు యువకులు ప్రలోభ పెట్టి భోపాల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఒక గదిలో బంధించారు. నలుగురు కలసి నాలుగు రోజుల పాటు ఒకరు తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఆ తర్వాత.. తీవ్ర అపస్మారక స్థితిలో ఉన్న ఆ బాలికను ఆమె ఇంటి దగ్గర వదిలేసి నిందితులు పారిపోయారు. అప్పటికే తమ కూతురి ఆచూకీ కోసం వారు వెతుకుతున్నారు. బాధితురాలు జరిగిన దారుణాన్ని ఇంట్లో వారికి చెప్పింది. దీంతో వారు పోలీసు స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేశారు. అయితే, స్టేషన్ అధికారి (సీఐ రేంజి అధికారి) తిలకధారి ఆమెపై కన్నేశాడు. రెండోరోజు ఆమెను స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని స్టేషన్‌కు రప్పించాడు. ఆమె అత్త ముందే.. ఆమెను సెల్ లోనికి తీసుకెళ్లి రేప్ చేశాడు. దీంతో బాధితురాలు షాకైంది. ఆమె కుటుంబీకులు కూడా షాకయ్యారు. ఏం చేయాలో పాలుపోలేదు. ఇంతలో ఆ బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ కొందరు వారి చనిపోయే ముందు పోరాడమని సలహా ఇచ్చారు. దీంతో ఆమె, తన కుటుంబీకులతో కలిసి పోలీసు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి జరిగిన దారుణాన్ని తెలిపారు. దీంతో ఉన్నతాధికారులు సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారి(సీఐ స్థాయి అధికారి)పై సీరియస్ అయ్యారు. వెంటనే స్టేషన్ హౌస్ అధికారి తిలక్ ధారిని సస్పెండ్ చేశారు. ఘటనపై ఉన్నతస్థాయి అధికారుల ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటికే రేప్ చేసిన నలుగురు నిందితులలో ఒకరిని అరెస్టు చేసినట్లు లలిత్ పూరి ఎస్పీ నిఖిల్ పాఠక్ వెల్లడిరచారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు తీవ్రతరం చేశారు. (Story: మైనర్‌పై 4 రోజులు గ్యాంగ్‌రేప్…స్టేషన్‌కు వెళ్తే సీఐ కూడా…!)
In UP’s Lalitpur, a minor girl was allegedly gang-raped by four men. When she approached the local police, she was allegedly raped by the SHO. FIR registered against 6 named accused. SHO suspended, on the run: Nikhil Pathak, Lalitpur SP pic.twitter.com/It3Lrlbk95
— Piyush Rai (@Benarasiyaa) May 3, 2022
See Also:
ప్రభుదేవా కొరియోగ్రఫీలో మెగాస్టార్ దద్దరిల్లిపోయే పాట!
నైట్‌క్లబ్‌లో రాహుల్ గాంధీ.. వీడియో వైరల్
కేసీఆర్‌కు 20కిమించి సీట్లు రావు
తల్లితో అక్రమ సంబంధం.. వ్యక్తి మర్మాంగాన్ని కోసేసిన కూతురు
లైవ్‌లో రభస: హీరోని గెటవుట్ అన్న టీవీ9 యాంకర్!
సర్కారువారి పాట ట్రైలర్ అదిరింది! (Video)
పార్లమెంట్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ పట్టుబడిన ఎంపీ!
భర్తను బెదిరించి…భార్యపై గ్యాంగ్‌రేప్!
చేతులు కలిపిన టీడీపీ, టీఆర్‌ఎస్!
హీరోయిన్‌పై రేప్ కేసు…పరారీలో యాక్టర్!
చదివింది మల్టీమీడియా…చేసేవి దొంగతనాలు!
అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు
17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి
డ్యాన్స్ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?
ఫస్ట్‌నైట్ భయంతో వరుడు ఆత్మహత్య!
కిరాతకం: మైనర్ బాలికపై 80 మంది అత్యాచారం!
వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!
యమడేంజర్: ఎంతపని చేసింది…గొంతు కోసింది!
రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు
ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?
కన్నతల్లిని పదేళ్లు బంధించిన కసాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!
భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్ చేయించాడు!
ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!
కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు
హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!
నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్