Home వార్తలు జాతీయం కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండిచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌…ఎందుకంటే?

కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండిచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌…ఎందుకంటే?

0
Prashant Kishor
Prashant Kishor

కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండిచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌…ఎందుకంటే?

Prashant Kishor: ప్రముఖ రాజకీయ వ్యూహకరక్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) కాంగ్రెస్‌ పార్టీకి అనూహ్యంగా ‘చేయి’చ్చారు. చేతి(హస్తం)తో కలిసి పనిచేస్తానన్న పీకే ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించారు. ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరిక దాదాపు ఖాయమైందంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో అనూహ్యంగా ఈ పరిణామం చోటు చేసుకున్నది. విశేషమేమిటంటే, పీకే కాంగ్రెస్‌లో చేరడం లేదని స్వయంగా కాంగ్రెస్‌ పార్టీనే ప్రకటించింది.కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ప్రశాంత్‌కిశోర్‌ నిరాకరించినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా వెల్లడిరచారు. 2024 ఎన్నికలకు సన్నద్ధత కోసం కాంగ్రెస్‌ పార్టీకి పీకే ఇచ్చిన ప్రజెంటేషన్‌పై చర్చించిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ యాక్షన్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఆ సాధికారిత కమిటీలో ఉండేందుకు పీకే అంగీకరించలేదని.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించగా నిరాకరించారని సూర్జేవాలా తెలిపారు. తమ పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని, పార్టీకి ఇచ్చిన సూచనల్ని తాము అభినందిస్తున్నట్టు సూర్జేవాలా తన ట్విటర్‌లో పేర్కొన్నారు.

అయితే పీకే ఎందుకు నిరాకరించారు?

కాంగ్రెస్‌లో చేరడానికి ప్రశాంత్‌ కిశోర్‌ అకస్మాత్తుగా నిరాకరించడం వెనుక చాలా ఉద్దేశాలు వున్నాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడిరచారు. నా కంటే ముఖ్యంగా ఆ పార్టీకి నాయకత్వం అవసరమని ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు. ‘అందుకే, పార్టీలో చేరాలని, ఎన్నికల బాధ్యతలు తీసుకోవాలన్న కాంగ్రెస్‌ ఆహ్వానాన్ని తిరస్కరించానని చెప్పారు. సాధికారత కమిటీలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలంటూ కాంగ్రెస్‌ చేసిన ఉదారమైన ప్రతిపాదనను తిరస్కరించినట్టు వెల్లడిరచారు. నిర్మాణపరమైన సమస్యల్లో పాతుకుపోయిన కాంగ్రెస్‌ పార్టీకి తన అవసరం కన్నా నాయకత్వం, సమష్టి సంకల్పం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరడంలేదనీ.. ఆ పార్టీకి సలహాదారుగా మాత్రమే పనిచేస్తానని వెల్లడిరచారు. కాకపోతే, కాంగ్రెస్‌లో సమూల ప్రక్షాళన జరగాలని, లేకుంటే ఇంకో 20 ఏళ్లు అధికారానికి దూరంగా వుండాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్లుగానే, పీకే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ మూలాల నుంచి పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని పీకే తెలిపారు. అందుకే, కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆహ్వానాన్ని ఆమోదించలేకపోతున్నానని వివరించారు. ఏం చేస్తే కాంగ్రెస్‌ పార్టీకి జవసత్వాలు వస్తాయో ఆయన సోనియాగాంధీతో సమావేశమైన సందర్భాల్లో ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. పీకే ఎన్నికల వ్యూహాలు, నివేదికపై అధ్యయనం చేసేందుకు చిదంబరం అధ్యక్షతన సోనియా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిపై పలుమార్లు తర్జనభర్జనలు జరగ్గా, పార్టీ పునర్వైభవానికి ఈ పథకాలు అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు. కాకపోతే పీకే విషయంలో ఆయన వివిధ పార్టీలతో సంబంధాలు కొనసాగిస్తూ, కాంగ్రెస్‌ పార్టీలో వుంటానంటే…అది సరికాదని మెజారిటీ కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. అయినప్పటికీ, కాంగ్రెస్‌ పీకేను పార్టీలో చేరేందుకు ఆహ్వానించింది. అయితే సగం మంది నేతలు ఆయన చేరికకు ఇష్టం లేకపోవడంతో పీకే వారి ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. (Story: కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండిచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌…ఎందుకంటే?)

See Also: 

మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి: ఏ పార్టీలో చేరుతారంటే?

సైబర్‌ దగా: వెంకయ్యనాయుడు పేరుతో వీఐపీలకు గాలం!

జనసైనికులపై చేయిపడితే…సహించేదిలేదు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

భద్రాచలానికి రైలు…ఏపీని టచ్‌ చేయదు!

ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version